Saturday, May 30, 2020

కరోనా సంక్షోభం: సరికొత్తగా 7 ట్రెండ్స్‌!

2020

కరోనా సంక్షోభం: సరికొత్తగా 7 ట్రెండ్స్‌!
తగ్గనున్న ప్రపంచీకరణ, విదేశీ వాణిజ్యం
బలమైన నాయకుల ఆవిర్భావం



ఎలా ఆవిర్భవించిందో తెలియదు! మొదట ఎవరి నుంచి సోకిందో తెలియదు! ప్రపంచాన్నంతా విపత్తుమయంగా మార్చేసింది కరోనా వైరస్‌. కంటికి కనిపించని ఈ శత్రువు ఇప్పుడు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసేస్తోంది. ఆంక్షల వలలో మనుషుల్ని బందీలను చేసింది. నిబంధనలు సడలిద్దామంటే వ్యాప్తి పెరుగుతుందని ఆందోళన. లేదంటే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని భయం.

టీకా మందు వచ్చేంత వరకు కొవిడ్‌-19తో కలిసి గడపక తప్పని పరిస్థితుల్లో ‘సరికొత్త సాధారణం’ రాబోతోంది. గత మహమ్మారులు, విపత్తులను పరిశీలిస్తే తదనంతర కాలంలో పెద్ద మార్పులేమీ రాలేదని మోర్గాన్‌ స్టాన్లీ చీఫ్‌ గ్లోబల్‌ స్ట్రాటజిస్టు రుచిర్‌ శర్మ ‘ఇండియాటుడే ఈ-కాంక్లేవ్‌’లో తెలిపారు. ఏదేమైనప్పటికీ  లాక్‌డౌన్‌ తర్వాతి కాలంలో ఏడు రకాల ట్రెండ్స్‌ కనిపిస్తాయని అంచనా వేశారు. అవేంటంటే..

ప్రపంచీకరణకు దూరం!
సరికొత్త సాధారణంలో ప్రపంచీకరణపై అతిగా ఆధారపడకపోవచ్చు. ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడులు, వలసలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ జీడీపీలో అంతర్జాతీయ వాణిజ్యం వాటా 53శాతం పడిపోనుంది. ఎందుకంటే ఇప్పటికే మందగమనం ఛాయలు కనిపిస్తున్నాయి. అనేక దేశాల్లో జాతీయవాదం కనిపించనుంది. ప్రత్యేకంగా ఆహార పరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది. తిండిగింజల కోసం ఇతర దేశాలపై ఆధాపడొద్దని భావిస్తాయి. ఇది భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపనుంది. చైనా తరహాలో భారత్‌ బియ్యం, గోధుమల వంటివి ఎగుమతి చేయలేకపోవచ్చు.

‘ఉక్కు’ నేతలు
కరోనా వైరస్‌ తరహా సంక్షోభాలు ప్రజాస్వామ్య మందగమనానికి కారణం కావొచ్చు. అధికారం కొందరు నాయకుల వద్దే కేంద్రీకృతం కావొచ్చు. ఉదాహరణకు బెర్లిన్‌ గోడ కూలిపోవడంతో ప్రజాస్వామ్యం విస్తరించింది. 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ నాయకులు పెరిగారు! రష్యా, టర్కీ వంటి దేశాల్లో ఇది ప్రతిబింబించింది. సాధారణంగా సంక్షోభ కాలంలో నాయకుల ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది. గతంలో ప్రధాని మోదీతో విభేదించే చాలామంది లాక్‌డౌన్‌లో మద్దతుగా నిలుస్తున్నారు. వ్యాపార, వాణిజ్యం సహా అన్నింట్లోనూ వారి జోక్యం అవసరం అవుతుంది. ఆ తర్వాత దాన్ని తొలగించడం కష్టమవుతుంది.

కేంద్ర బ్యాంకుపై ఒత్తిడి
ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు స్వతంత్రంగా పనిచేయడం అవసరం. కానీ సంక్షోభ కాలంలో ప్రజలను ఆదుకొనేందుకు ఉద్దీపన ఇవ్వాలని వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కేంద్ర బ్యాంకుల ఆస్తి, అప్పుల పట్టీ అస్తవ్యస్థం అవుతుంది. ప్రభుత్వ రుణాలు కొనుగోలు చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచ జీడీపీలో ప్రస్తుత ఆర్థిక ఉద్దీపనలు నాలుగు శాతంగా ఉన్నాయి. భారత్‌ జీడీపీలో ఇది ఒక శాతానికి పైగా ఉంది. ఆర్థిక లోటు ఎక్కువ కావడంతో ఇంతకన్నా అధికంగా ఇచ్చేందుకు వీలుండదు. డబ్బులు ముద్రించి ఉద్దీపనలు ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం. విశ్వాసం సన్నగిల్లుతుంది.

రుణ భయం
సాధారణంగా రుణాలు గృహ, ప్రభుత్వ, ఆర్థిక, కార్పొరేట్‌ అనే రకాలుగా ఉంటాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత వినియోగ, కార్పొరేట్‌ రుణాల్లో తగ్గుదల నమోదైంది. తమకు అప్పుల భారం అతిగా ఉందని ప్రస్తుతం కంపెనీలన్నీ గ్రహించాయి. ఇప్పుడీ రుణభయం మిగతా రంగాలకూ వ్యాపిస్తుంది. భారత్‌లో ఎక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ లేకుంటే రుణ లభ్యత కష్టం. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు దివాళా తీయొద్దంటే ఆర్‌బీఐ జోక్యం అవసరం అవుతుంది. ఉద్దీపనలు నష్టాన్ని భర్తీ చేయలేవని, వ్యాపారాలను తిరిగి తెరిపించడమే మార్గమని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. భారత్‌లో ఒక నెల లాక్‌డౌన్‌ అయితే ఏడాదికి జీడీపీ 1.5-2 శాతం తగ్గుతుంది. అదే మూడు నెలలైతే 6 శాతం వరకు ఉంటుంది.

సమస్తం ఆన్‌లైన్‌లోనే..
కరోనా మహమ్మారి కాలంలో వీడియో కాన్ఫరెన్స్‌లు పెరిగిపోయాయి. సమయం గడిపేందుకు వీడియో గేమ్‌లు ఎక్కువగా ఆడుతున్నారు. ప్రజలు ఎక్కువగా స్ట్రీమింగ్‌ వైపు మళ్లితే సినిమా, థియేటర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుంది. వర్చువల్‌ ఎకానమీ వైపు వెళ్లేందుకు 5-10 ఏళ్లు పడుతుందని భావించినా కరోనాతో 5-6 వారాల్లోనే సాధ్యమైంది. మార్పు వేగంగా సాగుతోంది.

ఉత్పత్తికి ఆటోమేషన్‌
ఇప్పటికీ కొన్ని సంస్థలు ఉద్దీపన, సులభ ద్రవ్యంతో కాలం వెలిబుచ్చుతున్నాయి. ఇప్పుడవి మూతపడే అవకాశముంది. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం లేని సంస్థలు దీర్ఘకాలంలో ఎదగలేవు. మనుగడ కష్టమవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యాన్ని (ప్రొడక్టివిటీ) సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచి పనిచేయడం సౌకర్యంగా ఉందని చాలామంది భావిస్తున్నారు. ఆటోమేషన్‌తో ఉత్పత్తి పెరగనుంది.

సంక్షోభంలో అవకాశాలు
కష్టకాలంలో భయాన్ని జయించడం అత్యంత ముఖ్యం. లాక్‌డౌన్‌ తర్వాత మన భయాల్ని తొలగించే నాయకత్వం అవసరం. భయపడకుండా పోరాడటం ఎలాగో చెప్పే వారు కావాలి. ఆర్థిక సంస్కరణలు చేపట్టేందుకు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టాలి. మరిన్ని పెట్టుబడులు, మరింత ప్రైవేటైజేషన్‌, మరిన్ని కార్మిక సంస్కరణలు తీసుకురావాలి. వ్యాపారాల్లో రాజకీయ నాయకులు, అధికారుల అతిజోక్యం లేకుండా చూడాలి.

Tags: Ruchir Sharma, DEGLOBALISATION, STRONG MEN, MONETARY POLICY, DEBT PHOBIA, VIRTUAL ECONOMY, coronavirus, covid 19, రుచిర్‌ శర్మ, డీగ్లోబలైజేషన్‌, బలమైన నాయకులు, ద్రవ్య విధానం, రుణ భయం, వర్చువల్‌ ఎకానమీ, కరోనా వైరస్, ‌కొవిడ్‌ 19

భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో డ్రాగన్‌ చిచ్చు


డ్రాగన్‌ విపరీత బుద్ధి!
భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో డ్రాగన్‌ చిచ్చు

హిమాలయ రాజ్యం నేపాల్‌లో 2019 అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పర్యటన ముగిసిన కొద్ది రోజుల్లోనే భారత్‌-నేపాల్‌ మధ్య కాలాపానీ వివాదం భగ్గుమంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది మే 8న మానససరోవర్‌ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేక్‌ పాస్‌ వరకు భారత్‌ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించడంపై నేపాల్‌ అభ్యంతరాలు లేవనెత్తింది. 2015లో భారత్‌-చైనా లిపులేక్‌ మార్గం అభివృద్ధిపై ఒప్పందం చేసుకొన్నప్పుడూ నేపాల్‌ అలాగే స్పందించింది. 1816 నాటి ‘సుగౌలీ ఒప్పందం’ ప్రకారం ఆ ప్రదేశం తమకు చెందుతుందన్నది నేపాల్‌ వాదన. నాటి ఆంగ్లేయ పాలకులు భారత్‌పై రుద్ది పోయిన అస్పష్టమైన సరిహద్దులతో ఏర్పడ్డ వివాదాల్లో ఇదీ ఒకటి. కాళీ నది జన్మస్థలం... సరిహద్దులను గుర్తించకుండా చేసుకొన్న ఈ ఒప్పందం కారణంగా ఇప్పుడు భారత్‌ అధీనంలోని భూమీ తమదేనని నేపాల్‌ వాదిస్తోంది. తాజాగా లిపులేక్‌ పాస్‌ సమీపంలోకి నేపాల్‌ సైన్యాన్ని తరలించడంతో పరిస్థితి మరింత విషమించింది.

చైనా పరోక్ష జోక్యం
భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కాలాపానీ ప్రాంతం  తమదేనని నేపాల్‌ చెబుతోంది. భారత్‌కు ఈ ప్రదేశంలో సైనిక స్థావరం ఉండటం చాలా ముఖ్యం. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న నిర్మానుష్యమైన కాలాపానీ ప్రాంతంలో 3,500 మీటర్ల నుంచి 6,000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. దీనికి సమీపంలో చైనాకు అతి ముఖ్యమైన బురాంగ్‌ సైనిక స్థావరం ఉంది. ఈ ప్రాంతం నేపాల్‌కు వెళితే, చైనా దళాలు తేలిగ్గా ఉత్తరాఖండ్‌లోకి చొరబడే ప్రమాదం ఉంది. ఇటీవల నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తలెత్తి ప్రధాని ఖడ్గప్రసాద్‌ ఓలీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సమస్య పరిష్కారానికి చైనా దౌత్యవేత్త హౌయాన్‌క్వీ నేరుగా రంగంలో దిగి పార్టీ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యాదేవీ భాండారికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఓలీ సర్కారు బాగా పని చేస్తోందని కితాబినిచ్చారు. ఇది పరోక్షంగా ఓలీకి మద్దతు ప్రకటించడమే. ఇది జరిగిన కొన్నాళ్లకు చైనాలోని ‘ఖొమోలాంగ్మా’ శిఖరం అంటూ ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఉద్దేశించి చైనా వార్తా సంస్థ సీజీటీఎన్‌ ట్వీట్‌ చేసింది. దీనిపై నేపాల్‌ విదేశాంగశాఖ నోరు మెదపకపోవడం చైనా పట్టును తెలియజేస్తోంది. ‘నేపాల్‌ మరెవరి కోసమో సమస్యలు సృష్టిస్తోంది’ అని భారత సైనికాధిపతి జనరల్‌ నరవణే చేసిన వ్యాఖ్యల వెనక అర్థమిదే.

చైనాతో భారత్‌ సరిహద్దు వివాదాలూ ఇదే సమయంలో తెరపైకి రావడం గమనార్హం. ‘నాకులా’ వద్ద ఇరుదేశాల సైనికులు బాహాబాహీ తలపడ్డారు. ఆ తరవాత చైనా హెలికాప్టర్లు అక్కడ చక్కర్లు కొట్టడం మొదలుపెట్టడంతో భారత్‌ సుఖోయ్‌ యుద్ధవిమానాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోపక్క అదే సమయంలో భారత్‌ కొన్ని దశాబ్దాలుగా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ గిల్గిట్‌- బాల్టిస్థాన్‌లో ‘డయమెర్‌ బాషా’ ప్రాజెక్టు నిర్మాణానికి డ్రాగన్‌ సై అంది. చైనా ప్రభుత్వ రంగానికి చెందిన ‘పవర్‌ చైనా’, పాక్‌ సైన్యానికి చెందిన ఫ్రాంటియర్‌ వర్క్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఓడబ్ల్యూ) ఇందుకు ఒప్పందం కుదుర్చుకొన్నాయి. 4,300 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో చైనా కంపెనీకి 70శాతం వాటా, ఎఫ్‌ఓడబ్ల్యూకు 30శాతం వాటా లభించనుంది. దీంతో భారత్‌ అభ్యంతరాలను చైనా ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయం తేలిపోయింది. తాజాగా చైనా ఆక్సాయ్‌చిన్‌ వద్ద గాల్వన్‌లోయలోకి బలగాలను తరలించింది. అంతిమంగా నేపాల్‌, చైనా, పాక్‌ సరిహద్దుల్లో 8,500 కిలోమీటర్ల మేర ఉద్రిక్తతలు కొనసాగే పక్షంలో భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. తమ దేశం నుంచి కంపెనీలు ఏయే దేశాలకు వలస వెళతాయన్న అనుమానం ఉందో... ఆయా చోట్ల డ్రాగన్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. జపాన్‌తో ‘షెంకాకు’ ద్వీపం సమీపంలో, వియత్నామ్‌తో పరాసల్‌ ద్వీపం వద్ద, ఇండొనేసియాతో ‘నటునా’ ద్వీపం వద్ద ఘర్షణ పూరితంగా వ్యవహరిస్తోంది.

ఆచితూచి వ్యవహరిస్తున్న ఇండియా
ఇంత జరిగినా కరోనా వైరస్‌ పుట్టుకపై, ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిపై భారత్‌ ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే ‘క్వాడ్‌’ బృందంలోని జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలు డ్రాగన్‌కు వ్యతిరేకంగా గళమెత్తాయి. వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ ఒక్కటే సహప్రాయోజక కర్తగా వ్యవహరించింది. ఈ తీర్మానానికి నేపాల్‌, పాకిస్థాన్‌ దూరంగా ఉండిపోవడమే వాటి బంధాన్ని సూచిస్తోంది. ఈ దర్యాప్తు వల్ల చైనాకు వచ్చే నష్టమేమీ కనిపించడం లేదు. తాజా పరిణామాలతో చైనా వైఖరిని దృష్టిలో పెట్టుకొని భారత్‌ కూడా తైవాన్‌ విషయంలో కొంత దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ‘వరల్డ్ హెల్త్ అసెంబ్లీ’లో తైవాన్‌కు పరిశీలకుడి హోదా ఇచ్చే అంశంపై భారత్‌ గళం విప్పితే భవిష్యత్తులో చైనా పీఓకే విషయంలో తన దూకుడు తగ్గించుకొనే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా, డ్రాగన్‌కు నొప్పి తెలిసేలా భారత్‌ నిర్ణయాలు ఉంటేనే చైనా దారికి వస్తుంది.

-పెద్దింటి ఫణికిరణ్‌

లిపులేఖ్‌, కాలాపానీలు

 2020


లిపులేఖ్‌, కాలాపానీలు మావే
భారత్‌ నుంచి స్వాధీనం చేసుకుంటాం: నేపాల్‌ ప్రధాని


కాఠ్‌మాండూ: భారత్‌-నేపాల్‌ మధ్య వివాదస్పద ప్రాంతాలైన లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు నేపాల్‌కు చెందినవేనని ఆ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్‌ మంత్రిమండలి మంగళవారం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఓలీ పార్లమెంటులో మాట్లాడారు. ‘‘నేపాల్‌కు చెందిన ఆ భూభాగాల్లో సైనికులను మోహరింపజేయడం ద్వారా భారత్‌ వాటిని వివాదాస్పదం చేసింది. భారత్‌ సైన్యం వచ్చిన తర్వాత నేపాల్‌ పౌరులను అక్కడకు వెళ్లనీయడం లేదు’’ అని చెప్పారు. ‘‘1962 నుంచి భారత్‌ అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఇప్పటివరకు మన పాలకులు ఆ విషయాన్ని లేవనెత్తేందుకే సంకోచించారు. మేం వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. వెనక్కి తెస్తాం’’ అని అన్నారు. 1816 నాటి బ్రిటిష్‌ ఇండియా-నేపాల్‌ ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘సుగౌలి ట్రీటీ’ ఆధారంగా కొత్త పటం రూపొందినట్లు కాఠ్‌మాండూ పోస్ట్‌ తెలిపింది. కాళీ నది జన్మస్థానమైన లింపియాధురను నేపాల్‌లో భారత్‌కు సరిహద్దుగా కొత్త పటంలో చేర్చినట్టు వివరించింది.

నేపాల్‌ కన్నెర్ర

నేపాల్‌ కన్నెర్ర
20 May, 2020


మన దేశానికి సంబంధించినంతవరకూ ఇది సరిహద్దు వివాదాల సీజన్‌లా కనబడుతోంది. ఈనెల 5న సిక్కింలోవున్న నుకా లా ప్రాంతంలో భారత–చైనా సరిహద్దుల వద్ద గస్తీలో వున్న మన సైని కులతో చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అందులో భారత జవాన్లు నలుగురు, చైనా సైనికులు ఏడుగురు గాయపడ్డారు. చివరకు ఇరుపక్షాల సైనికాధికారులు చర్చించుకోవడంతో వివాదం సమసిపోయింది. తాజాగా ఇప్పుడు నేపాల్‌ పేచీ మొదలుపెట్టింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలు తన భూభాగంలోనివేనంటూ అది కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.

అంతేకాదు... ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి బుధవారం కటువైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్‌ రాజముద్రలో వుండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని, ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కరోనా వైరస్‌ను గుర్తుకు తెచ్చేలా ‘చైనా వైరస్‌ కంటే, ఇటలీ వైరస్‌ కంటే ఇండియా వైరస్‌ ప్రమాదకరమైనదంటూ పరుషంగా మాట్లాడారు. ఈ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారంటూ మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ ఎంఎం నరవానె మొన్న శుక్రవారం చేసిన ప్రకటన నేపాల్‌కు తగలవలసిన చోటే తగిలింది. తమను పరోక్షంగా చైనా కీలుబొమ్మగా అభివర్ణించడం అది తట్టు కోలేకపోయింది. అందుకే గతంలో ఎన్నడూ లేనివిధంగా మన దేశాన్ని ఈ స్థాయిలో విమర్శించ డానికి పూనుకొంది. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నా మని నేపాల్‌ విదేశాంగమంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యావలి అనడం, ఆ తర్వాత లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను వెనక్కివ్వాలంటూ పార్లమెంటులో అధికార పక్షం తీర్మానం ప్రవేశ పెట్టడం గమనిస్తే అది లోగడ కంటే దూకుడు పెంచిందని సులభంగానే తెలుస్తుంది.

ముఖ్యంగా ఈనెల 11న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరాఖండ్‌ మీదుగా లిపులేఖ్‌ వరకూ మానస సరోవర్‌ యాత్రకెళ్లేవారి సౌకర్యార్థం నిర్మించిన రహదారిని ప్రారంభించాక నేపాల్‌లో అసహనం కట్టలు తెంచుకుంది. లిపులేఖ్‌ సమీపంలోనే చైనా సరిహద్దు కూడా వుంటుంది. కనుక కొత్తగా నిర్మించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా కూడా మన దేశానికి కీలకమైనది. అందుకే నేపాల్‌ పేచీ వెనక ‘ఎవరో’ వున్నారని జనరల్‌ నరవానె అన్నారు. ఈ రహదారి వల్ల నేపాల్‌కొచ్చే ఇబ్బంది మాటెలావున్నా యుద్ధ సమయాల్లో మన సైన్యాన్ని సులభంగా తరలించడానికి ఉపయోగపడుతుంది గనుక చైనాకు మాత్రం సమస్యాత్మకమే.

భారత్‌–నేపాల్‌ సరిహద్దు వివాదానికి 200 ఏళ్ల చరిత్ర వుంది. రెండు దేశాల మధ్యా 1816 మార్చి 4న సరిహద్దులకు సంబంధించి తొలిసారి సుగౌలీ ఒప్పందం కుదిరింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత్‌ తరఫున సంతకాలు చేశారు. ఆ ప్రాంతంలో పారుతున్న మెచ్చి, మహాకాళి, నారాయణి నదీ తీరాలను గీటురాళ్లుగా తీసుకుని సరిహద్దుల్ని నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. ఆ నదుల గమనం ఈ రెండు శతాబ్దాల్లో అనేకసార్లు మారడం వల్ల ఎవరు ఎవరి భూభాగంలోకి చొచ్చుకొచ్చారన్న విషయంలో అయోమయం ఏర్పడింది.

ఇది చాలదన్నట్టు రెండు దేశాల వద్దా అప్పటి మ్యాప్‌లు కూడా లేవు. మన పారా మిలిటరీ దళమైన సశస్త్ర సీమాబల్‌ జవాన్లు అక్కడి సరిహద్దుల్ని పహారా కాస్తారు. నేపాల్‌ వైపు నుంచి మొదటినుంచీ అలాంటి పహారా లేదు. దీన్ని ఉపయోగించుకుని భారత్‌ తమ 60,000 హెక్టార్ల భూమిని ఆక్రమించిందన్నది నేపాల్‌ ఆరోపణ. ఈ విషయంలో నేపాల్‌ జాతీయవాదులు చాన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. అయితే రెండు దేశాల ప్రభుత్వాల మధ్యా ఎప్పుడూ సత్సంబంధాలే వుండేవి గనుక ఇరు పక్షాలూ ఈ సమస్యపై బాహాబాహీకి దిగలేదు.

అయితే సరిహద్దుల్ని ఖరారు చేయడానికి ఉమ్మడిగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా అదింకా ఎటూ తేలకుండానే వుంది.  నేపాల్‌లో భారత్‌పై అంతకుముందునుంచీ వున్న అసంతృప్తి 2006లో అక్కడ హిందూ రాజరిక పాలన అంతమైనప్పటినుంచీ బలపడుతూ వచ్చింది. తమకు భారత్‌ సమాన స్థాయి ఇచ్చి గౌరవించడం లేదని నేపాల్‌ జాతీయవాదుల అభిప్రాయం. వాటిని పోగొట్టడానికి మనవైపుగా ఎప్పుడూ సరైన ప్రయత్నాలు జరగలేదనే చెప్పాలి. 

మనకు అత్యంత సన్నిహిత దేశంగా, మన కనుసన్నల్లో నడిచే దేశంగా వుండే నేపాల్‌ క్రమేపీ దూరమవుతున్న సంగతిని మన పాలకులు సకాలంలో పట్టించుకోలేదు. 1997లో అప్పటి ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ ఆ దేశంలో పర్యటించాక 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవరకూ మన ప్రధానులెవరూ ఆ దేశం వెళ్లలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1987లో ఆ దేశంతో ఒక ఒప్పందం కుదిరింది. ఇండో–నేపాల్‌ కమిషన్‌ ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి రెండేళ్లకూ అది సమావేశమవుతూ పరస్పర ప్రయోజనాలకు తోడ్పడేవిధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆ ఒప్పందం సారాంశం.

కానీ 2014 వరకూ మన దేశం దాని జోలికే పోలేదు. నరేంద్ర మోదీ వచ్చాకైనా ఆ దేశంతో సంబంధాలు పెద్దగా మెరుగుపడలేదు. రెండేళ్లక్రితం శర్మ ఓలి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటన కోసం మన దేశాన్నే ఎంచుకున్నారు. వివిధ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అది చిన్న దేశమే కావొచ్చు...దానితో కుదుర్చుకోదగ్గ భారీ వాణిజ్య ఒప్పందాలు వుండకపోవచ్చు. కానీ దానికీ, మనకీ పొరుగునున్న చైనాతో మనకు అనేకానేక సమస్యలున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేపాల్‌ విషయంలో మన దేశం చొరవ ప్రదర్శించివుంటే బాగుండేది. తాజా వివాదంలో నేపాల్‌ వాదన సరికాదని మన దేశం ఇప్పటికే జవాబిచ్చింది. ఈ వివాదం ముదరకుండా చూడటం, సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడానికి ప్రయత్నించడం అన్నివిధాలా శ్రేయస్కరం.

కరోనా వేళ భారత భూభాగాల్లోకి డ్రాగన్‌ సేనలు



వేళ్ల లెక్కలు మరిచిన చైనా..!  
 కరోనా వేళ భారత భూభాగాల్లోకి డ్రాగన్‌ సేనలు
 నిలువరిస్తున్న భారత దళాలు..


భారత్‌ చైనా మధ్య సరిహద్దు వివాదం ముదిరిపాకానపడుతోంది. మరో డోక్లాంగా మారే పరిస్థితులు తలెత్తాయి. 1967 తర్వాత ఒక్క తూటా కూడా పేలని భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంట భారీ బలగాలతో ఎదురెదురుగా నిలిచాయి. కరోనా వైరస్‌ ఇరు దేశాల్లో విజృంభించిన సమయంలో కూడా చైనా సైనికులు పొరుగుదేశాల భూభాగాల్లోకి చొరబడటం మానలేదు. ముఖ్యంగా పాంగాంగ్‌ సరస్సు వద్ద,  గాల్వన్‌ లోయలో, సిక్కింలోని నాకుల వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

పాంగాంగ్‌ వద్ద వివాదం ఇదీ..
పాంగాంగ్‌  సరస్సు లద్దాఖ్‌లో ఉంది. దాదాపు 134 కిలోమీటర్ల పొడవున్న ఈ సరస్సు టిబెట్‌ వరకు 604 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. 5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సరస్సు దాదాపు 60శాతం టిబెట్‌ పరిధిలో ఉంటుంది. 1962లో చైనా  దాడి చేసి ఆక్సాయిచిన్‌ను దక్కించుకొంది. అప్పటి నుంచి ఇరు దేశాలు సరిహద్దులుగా భావిస్తున్న వాస్తవాధీన రేఖ ఈ సరస్సుమీద నుంచి పోతుంది. ఇరు దేశాలు కచ్చితమైన సరిహద్దులను ఇక్కడ నిర్ధారించుకోలేదు. ఈ సరస్సు ఉత్తర తీరాన బంజరు పర్వతాలు ఉన్నాయి. వీటిని ఇరు దేశాల సైన్యాలు  ‘ఫింగర్స్‌’గా అభివర్ణిస్తాయి. ఈ వేళ్ల దగ్గర లెక్కలే ప్రస్తుతం వివాదానికి కారణంగా మారాయి. భారత్‌ ‘ఫింగర్‌ 8’ నుంచి వాస్తవాధీన రేఖ వెళుతుందని చెబుతుంది.. భౌతికంగా మాత్రం ఫింగర్‌ 4 వరకే పట్టు ఉంది. కానీ చైనా సైన్యంకు ఫింగర్‌ 8 వద్ద సరిహద్దు పోస్టు ఉంది.. అయినా ఫింగర్‌ 2 వరకు తమదే అని వాదిస్తోంది. ప్రస్తుతం భారత్‌ సైన్యాన్ని ఫింగర్‌2 వద్దే ఆపేస్తోంది. సరస్సులో కూడా భారత్‌ చైనాల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం సరస్సులో భారత దళాలు పెట్రోలింగ్‌ చేస్తుంటే చైనా దళాలు మరబోట్లు వేసుకొని వచ్చి అడ్డుకొన్నాయి. దీంతో భారత్‌ కూడా టాంపా రకం బోట్లను ఇక్కడ వినియోగించడం మొదలుపెట్టింది. ఇటీవల పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో చైనా ఎల్‌ఎక్స్‌ రకం బోట్లను తీసుకొచ్చింది.  

వీటి వ్యూహాత్మక ప్రాముఖ్యం ఏమిటీ..?
ఇవి బంజరు పర్వతాలు మాత్రమే. చైనా వీటిపై ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వెనుక చాలా వ్యూహం ఉంది. భారత్‌ ‘ఫింగర్‌4’ చాలా వ్యూహాత్మకమైంది. ఇక్కడకు శత్రుబలగాలు వస్తే భారత్‌ పాంగాంగ్‌ సరస్సులో గస్తీకి వినియోగించే బోట్ల సంఖ్య, వాటి వద్ద మన సైన్యం కదలికలు శత్రువులకు తేలిగ్గా తెలిసిపోతాయి. ఫింగర్‌ 4 నుంచి చూస్తే భారత్‌ మరపడవలను నిలిపే లుకుంగ్‌ ప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. 

కార్గిల్‌ యుద్ధ సమయంలోనే..
కార్గిల్‌ యుద్ధ సమయంలో బలగాల అవసరం ఉండటంతో ఈ సరస్సు వద్ద కొంత మందిని అటువైపు మళ్లించారు. ఇదే అదునుగా భావించిన చైనా సైన్యం ఫింగర్‌ వద్ద రోడ్డు నిర్మాణం మొదలుపెట్టింది. ఇప్పుడు ఫింగర్‌ 2-3 మధ్య ఈ నిర్మాణం జరుగుతోంది. భారత్‌తో పోలిస్తే చైనా దళాలు ఈ ప్రదేశానికి వేగంగా చేరుకొనే అవకాశాలను ఇది కల్పిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇక్కడ భారత పెట్రోలింగ్‌ను అడ్డుకొనేందుకు చైనా భారీ సంఖ్యలో దళాలను తరలించింది. 

గాల్వన్‌ లోయలో కూడా..
1962 అక్టోబర్‌ 20న చైనా సైన్యం దాడిని ప్రారంభించిన ప్రదేశాల్లో గాల్వన్‌ లోయ కూడా ఒకటి. భారత్‌ 2017లో డోక్లాం వద్ద చైనా సైన్యాన్ని ఎదురొడ్డి నిలిచింది. అప్పట్లో సైన్యాన్ని తరలించడంలో ఏర్పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. వాస్తవాధీన రేఖకు దాదాపు 10 కిలోమీటర్ల లోపలే డర్బుకు-ష్యాక్‌-డీబీవో మధ్య రహదారి నిర్మాణం చేపట్టారు. ఇది దళాల కదలికలకు ఉపయోగపడుతుంది. తాజాగా చైనా లద్దాక్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌ చైనా మధ్య వివాదానికి ఇది కూడా కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ రోడ్డు నిర్మాణానికి చైనా అంగీకరించడంలేదు. గాల్వన్‌ లోయకు సమీపంలోని భారత్‌కు చెందిన దౌలత్‌బేగ్‌ ఎయిర్‌స్ట్రిప్‌ ఉంది. దీనిపై పెద్ద విమానాలను కూడా ల్యాండ్‌ చేసుకోవచ్చు. తాజా చైనా సైన్యం గాల్వన్‌ లోయలోకి భారీ సంఖ్యలో సైనికులను తరలించింది. గాల్వాన్‌ లోయలో గత రెండు వారాల్లో దాదాపు 100 వరకూ గుడారాలు వేసినట్లు, బంకర్ల నిర్మాణం కోసం భారీ సామగ్రిని రప్పించినట్లు తెలుస్తోంది. గాల్వన్‌ వద్ద భారత్‌ కొంత బలంగానే ఉంది.

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు

మే 31, 2020

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు
పంటసిరుల ఎత్తిపోతలు
సాకారం కానున్న మరో ధాన్యాగారం


ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, పూర్తి చేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది కూడా ఓ బ్యారేజీయో, రిజర్వాయరో, సొరంగ మార్గమో, ఒక లిఫ్ట్‌ పనో కాదు. ఇలాంటివన్నీ కలబోసిన అనేక భారీ నిర్మాణాలతో కూడిన అత్యంత భారీ, విశిష్టతలతో కూడిన కాళేశ్వరం ఎత్తిపోతల. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.65వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రధాన పనులన్నీ పూర్తి చేయడం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ చరిత్రను తిరగరాయడమే. ఇంత తక్కువకాలంలో అంత ఎక్కువగా ఒక ప్రాజెక్టుపై ఖర్చుచేయడం, ప్రధాన పనులను పూర్తి చేయడం దేశంలో ఇదే మొదటిసారి. 22 లిఫ్టులు, 4,627 మెగావాట్ల సామర్థ్యంగల పంపులు, మూడు బ్యారేజీలు, 17 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల దూరం సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువల నిర్మాణం... ఇలా అనేక పనుల సమాహారం- కాళేశ్వరం ప్రాజెక్టు! విదేశాల నుంచి మోటార్లు దిగుమతి చేసుకోవడంతో పాటు పనులన్నింటినీ ఏకకాలంలో జరిగేలా చూడటం, వీటన్నింటికీ మించి గత మూడేళ్లలో ఏడాదికి రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల వరకు ఈ ఒక్క ప్రాజెక్టుపైనే ఖర్చు చేయడం- సంకల్పం ఉంటే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల పాటు కొనసాగాల్సిన అవసరం లేదని నిరూపించింది.

తక్కువ సమయంలోనే...
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. చాలా ఎత్తుకు నీటిని తీసుకెళ్లే మార్గమధ్యంలో ఇన్ని భారీ లిఫ్టులుండే భారీ ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం గుర్తింపు పొందింది. భూగర్భంలోనే పంపుహౌస్‌లు నిర్మించడం, అత్యధికంగా 139 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటారును వినియోగించడం, ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటిని తోడేందుకు ఆసియాలోనే అతిపెద్దదైన బావిని తవ్వడం... ఇలా అనేక విశిష్టతలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్లను పునరాకృతి చేసి చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 2016 మేలో శంకుస్థాపన జరిగింది. 2020 మే నెలలో ప్రాజెక్టు చివర ఉన్న రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేలా ప్రభుత్వం పనులు పూర్తి చేయించింది. అంతర్రాష్ట్ర ఒప్పందం సహా కేంద్ర జలసంఘం నుంచి అన్ని అనుమతులూ సాధించింది. అన్ని పనులూ సమాంతరంగానే కొనసాగించి పూర్తి చేయగలిగింది. ప్రాజెక్టు పూర్తికావడం వల్ల రానున్న వానాకాలంలో తెలంగాణలో అత్యంత వెనకబడిన, కరవు ప్రాంతంలోని పొలాలకు నీరందనుంది. ఇదొక భగీరథ యత్నమే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక సమయాన్ని ఈ ప్రాజెక్టుపైన పెట్టడం, నిరంతరం పురోగతిని గమనించడంతోపాటు నిధులకు ఆటంకం లేకుండా చూడటంవల్లే కాళేశ్వరం తక్కువ సమయంలో వాస్తవరూపం దాల్చింది. లక్ష్యంగా నిర్ణయించుకొన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందేలా డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తయితే- నిన్నటిదాకా కరవుతో అల్లాడిన ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. తెలంగాణకు ‘గ్రోత్‌ ఇంజిన్‌’గా కాళేశ్వరం నిలవనుంది.

అత్యధిక ఆయకట్టు


రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నీటిని వినియోగించే, అత్యధిక ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం ఎత్తిపోతల చేరనుంది. ఇప్పటివరకు నాగార్జునసాగర్‌ కింద ఎక్కువ నీటి వినియోగం, ఆయకట్టు ఉంది. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలు, కృష్ణాడెల్టా అవసరాలకు 400 శతకోటి ఘనపుటడుగు(శ.కో.ఘ.-టీఎమ్‌సీ)లకు పైగా కేటాయింపు ఉంది. 34 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఈ పథకం ఆయకట్టుకే కాదు, తెలంగాణలో అతి ముఖ్యమైన మరో అయిదు ప్రాజెక్టుల కింద స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు 13 జిల్లాల్లో 18.26 లక్షల ఎకరాలు కాగా, ఈ అయిదు ప్రాజెక్టుల కింద మరో 18.7 లక్షల ఎకరాల స్థిరీకరణ ఉంది. ప్రాజెక్టు పరిధిలో చెరువులనూ ఈ నీటితో నింపనున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరందిస్తూ ప్రతి రెండు, మూడేళ్లకోసారి వానాకాలం పంటకు ఆయకట్టుకు నీరందించలేని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకోసం కాళేశ్వరం నీటితో పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇలా కాళేశ్వరం నీటితో తెలంగాణలో ఎక్కువ భాగం తడవనుంది. ప్రస్తుతం రోజూ రెండు టీఎమ్‌సీల నీటిని గోదావరి నుంచి మళ్లించే పనులు పూర్తయ్యాయి. మూడో టీఎమ్‌సీ నీటిని మళ్లించే పని కూడా త్వరలోనే పూర్తి కానుంది. ఇది జరిగితే వానాకాలం సీజన్‌లోనే 300 టీఎమ్‌సీలకు పైగా నీటిని మళ్లించడానికి అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదంతా నీటిని తీసుకోవచ్చు. ఈ ఏడాది మే రెండోవారం వరకూ గోదావరి నుంచి నీటిని మళ్లించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపైనే నిర్మించిన బ్యారేజీల నుంచి నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలవృద్ధీ జరుగుతుంది. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని అత్యధిక సాగుభూముల రూపురేఖలు మారిపోనున్నాయి.

సమర్థ నీటి వినియోగంపై దృష్టి
ఈ మహా ప్రాజెక్టు ద్వారా మళ్లించిన నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకోవడం కీలకం. కాళేశ్వరం ద్వారా కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టుకు కేంద్ర జలసంఘం ఆమోదించిన నివేదిక ప్రకారం 134.5 టీఎమ్‌సీల కేటాయింపు ఉంది. ఈ నీటితో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం వరితోపాటు పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, మిర్చి... ఇలా అన్ని పంటల సాగు ఉంది. ఈ పంటల ప్రకారమే నీటి వినియోగాన్ని నిర్ధారించారు. ఆచరణలోనూ ఇది అమలు జరిగినప్పుడే నిర్దేశించుకొన్న ఆయకట్టుకు నీరందుతుంది. ఎక్కువ నీటిని తీసుకొనే పంటలను సాగుచేస్తే ఆ ప్రభావం మొత్తం ప్రాజెక్టుపై పడుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశిత పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉదాహరణకు నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువలకు ఉన్న నీటి కేటాయింపు 264 టీఎమ్‌సీలు. కానీ 400 టీఎమ్‌సీలు వినియోగించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా చివరి ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాలువ ద్వారా నీటి ప్రవాహం జరుగుతుంది. నాగార్జునసాగర్‌ నిండి వరద నీటిని కిందికి వదిలినప్పుడు కాలువల నిండా నీటిని విడుదల చేయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాళేశ్వరం అలా కాదు- అదనంగా అవసరమైన ప్రతి టీఎమ్‌సీని ఎత్తిపోయాల్సిందే. ప్రతి టీఎమ్‌సీకి అదనంగా విద్యుత్తు అవసరం అవుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు టీఎమ్‌సీల నీటిని ఎత్తిపోసేలా మోటార్లు, పంపులు అమర్చారు. ఇవి పూర్తి స్థాయిలో నడిస్తే 4,627 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన నివేదిక ప్రకారం ఏటా విద్యుత్తు ఖర్చు రూ.4,067 కోట్లు. ఎకరా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడానికి ప్రస్తుతం రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించిన యూనిట్‌ ధర రూ.6.40 ప్రకారం రూ.28 వేలు అవుతుంది. అతి తక్కువగా యూనిట్‌ ధర మూడు రూపాయలను పరిగణనలోకి తీసుకొన్నా- ఎకరా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడానికి రూ.13 వేలు ఖర్చవుతుందని అంచనా. ఈ విద్యుత్తు ఛార్జీలను రైతుల నుంచి వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కొండపోచమ్మ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఈ విషయాన్ని ప్రకటించారు. నిర్ణయించిన పంటలను వేయకుండా ఎక్కువ నీటిని తీసుకొనే పంటల జోలికెళ్తే ఒక ఎకరా ఆయకట్టుకు అయ్యే విద్యుత్తు ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆరంభం నుంచే సమర్థ నీటి వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

- ఎం.ఎల్‌.నరసింహారెడ్డి

Friday, May 29, 2020

కరోనా బాధితుల రక్త నాళాల్లో గడ్డల గుర్తింపు

 మే 30, 2020

కరోనా బాధితుల రక్త నాళాల్లో గడ్డల గుర్తింపు
ప్రాణాంతకంగా పరిణమిస్తున్న సమస్య

కరోనా వైరస్‌ ముదిరిన వారిలో న్యుమోనియా, అకస్మాత్తుగా శ్వాసకు విఘాతం కలగడం, అవయవాలు విఫలమవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికితోడు రక్తనాళాల్లోనూ గడ్డలు పుట్టుకొచ్చి, పక్షవాతంతోపాటు మరణాలకూ దారితీస్తున్నట్లు కొత్తగా బయటపడుతోంది. ఇంతకీ ఏమిటీ సమస్య? ఎందుకిలా అవుతోంది?

కరోనా బాధితుల శరీరంపై గులాబీ దద్దుర్లు, కాళ్ల వాపులు, గుండెకు అమర్చిన గొట్టాలు పూడుకుపోవడంతోపాటు హఠాన్మరణమూ చోటు చేసుకుంటోంది. రక్తనాళాల్లో గడ్డల కారణంగానే ఇలా జరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని ‘రక్తపు గడ్డల ఉప్పెన’గానూ వర్ణిస్తున్నారు. కొవిడ్‌ తీవ్రత పెరిగి, ముఖ్యంగా ఆసుపత్రుల్లో చేరిన వారికి అధిక ప్రమాదం పొంచి ఉంటోంది. ఆరోగ్యం విషమించిన వారిలో 20-30% మందికి ఈ ముప్పు ఉంటున్నట్లు నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా రక్తపు గడ్డలు కరిగే సమయంలో డి-డైమర్‌ అనే ప్రొటీన్‌ విడుదలవుతుంది. ఆసుపత్రుల్లో చేరిన చాలామందిలోని రక్తంలో ఈ ప్రోటీన్‌ మోతాదులు అధికంగా ఉంటున్నాయి. దీని ఆధారంగా కొవిడ్‌తో మరణించే అవకాశమున్న వారినీ ముందుగానే గుర్తించొచ్చు. మరోవైపు రక్త కేశనాళికల్లోనూ సూక్ష్మమైన గడ్డలు బయటపడుతుండటం గమనార్హం. ఇది చాలా చాలా కొత్త విషయమంటున్న శాస్త్రవేత్తలు... కారణాల విశ్లేషణపై నిశితంగా దృష్టి సారించారు. అదే సమయంలో గడ్డలను కరిగించే మందులపైనా ప్రయోగ పరీక్షలు ప్రారంభించారు.

కొత్త చికిత్సలపై దృష్టి
కరోనా బాధితులను రక్షించడానికి నూతన చికిత్సల వైపు పరిశోధకులు దృష్టి సారించారు. రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. అయితే మోతాదు విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలు ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌ మీదున్న కొందరికి ఈ మందులు ఇవ్వగా... మరణించే ముప్పు తగ్గినప్పటికీ పెద్ద మోతాదులో ఇస్తే దుష్ప్రభావాలు తలెత్తుతాయని కొందరు వైద్యుల భావన. మరికొన్నిచోట్ల గడ్డలను కరిగించే శక్తిమంతమైన టీపీఏ మందుపైనా ప్రయోగాలు చేస్తున్నారు. వీటి ఫలితాలు మున్ముందు చికిత్సల తీరుతెన్నులను నిర్దేశించగలవని పరిశోధకులు ఆశిస్తున్నారు.

రెండు అంశాలు దోహదం?
బాధితుల్లో రక్తపు గడ్డలు ఎందుకు ఏర్పడుతున్నాయన్నది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అయితే.. ఇందుకు 2 అంశాలు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు.
1 కరోనా వైరస్‌ రక్తనాళాల లోపలి గోడల్లోని కణాల మీద నేరుగా దాడి చేయడం. సాధారణంగా రక్తనాళాలు నున్నగా, మృదువుగా ఉంటాయి. వీటి లోపలి గోడలు రక్తాన్ని గడ్డకట్టించే కారకాలు బయటకు రాకుండా నిలువరిస్తుంటాయి. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌కు గురైతే గోడల కణాలు దెబ్బతిని, రక్తం గడ్డకట్టే ప్రక్రియ పుంజుకుంటుంది. కొవిడ్‌లోనూ ఇలాగే జరుగుతుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి దోహదం చేసే ఏసీఈ2 గ్రాహకాలు రక్తనాళాల గోడల కణాల్లోనూ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం లేకపోలేదని కొన్ని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

2..రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలు. కొవిడ్‌ బాధితుల్లో రోగ నిరోధక కణాలు... వాపు ప్రక్రియను(ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపిస్తున్నట్లు ఇప్పటికే బయటపడింది. ఇది రకరకాల మార్గాల్లో రక్తం గడ్డకట్టేందుకూ ప్రేరేపిస్తుంది. ఇవేకాకుండా.. వృద్ధాప్యం, అధిక బరువు, మధుమేహం, అధిక బీపీ వంటి సమస్యలతోనూ రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. ప్రస్తుతం కొవిడ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న చాలామంది వీటితో బాధపడుతున్నవారే ఉంటున్నారు.

Thursday, May 28, 2020

సినో-బ్రిటిష్‌ ఒప్పందానికి తూట్లు


సినో-బ్రిటిష్‌ ఒప్పందానికి తూట్లు
మరో పెనువివాదంలో చైనా..!
 
బీజింగ్‌: హాంకాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం హక్కులను  కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.  హాంకాంగ్‌లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది. వేర్పాటు వాదం అణిచివేత, హాంకాంగ్‌ హక్కుల అణచివేత, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం పేరుతో హింసకు పాల్పడం, విదేశీ జోక్యాన్ని నివారించడంతోపాటు చైనాలోని సెక్యూరిటీ ఏజెన్సీలు హాంకాంగ్‌లోకి వెళ్లడానికి అధికారం లభిస్తుంది. ఈ బిల్లుకు కేవలం ఒక ఓటు మాత్రమే వ్యతిరేకంగా వచ్చింది. 2,878 మంది అనుకూలంగా ఓటు వేయగా.. ఆరుగురు గైర్హాజరయ్యారు. 

ఈ చట్టానికి అవసరమైన విధివిధానాలను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ తయారు చేస్తుంది. దీనికి మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత హాంకాంగ్‌ ప్రభుత్వం శాసన ప్రకటనతో దీనిని అమల్లోకి తెస్తుంది. అక్కడి చట్టసభను తప్పించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు. అంటే దొడ్డిదోవలో  ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం అన్నమాట. 1997 బ్రిటన్‌ పాలకుల నుంచి హాంకాంగ్‌ను తీసుకొనే సమయంలో చేసుకొన్న వన్‌ కంట్రీ, టూ సిస్టమ్స్‌ ఒప్పందానికి ఇది విరుద్ధం.

హాంకాంగ్‌ కోసం ఆత్రం..!
అసలు హాంకాంగ్‌ కోసం చైనా అంతగా ఎందుకు వెంపర్లాడుతోంది? ఒప్పందం ప్రకారం 2047 వరకు కూడా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వకూడదని ఎందుకు అనుకుంటోంది? ఇప్పటి నుంచే ఈ నగరాన్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి ఎందుకు ఆత్రపడుతోంది..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆర్థిక అవసరాలు..! హాంకాంగ్‌ చైనాకు బంగారు బాతు.. ఆ బాతు గుడ్లను వాడుకోకుండా.. బాతునే కోసుకు తినాలని చూస్తోంది.

2019 జూన్‌ 9న వివాదానికి బీజం వేస్తూ హాంకాంగ్‌ ప్రభుత్వం నేరస్థులను చైనాకు తరలించే బిల్లును ప్రవేశపెట్టింది. మూడు రోజుల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి. అవి సునామీలా మారాయి.  సాక్షాత్తు హాంకాంగ్‌ పాలకురాలు, చైనా కీలుబొమ్మగా పేరున్న కెరీలామ్‌ ‘సారీ’ చెప్పినా.. ఏడ్చినా.. బిల్లును రద్దు చేసినా ఆందోళనలు 2019 చివరి వరకు కొనసాగాయి.   ఒక దశలో చైనా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. భద్రతా దళాలు మారుదుస్తుల్లో హాంకాంగ్‌ ప్రదర్శనకారుల్లో చేరి దాడులు చేశాయి. హాంకాంగ్‌ సరిహద్దుల్లో భారీగా చైనా దళాలు, ట్యాంకులను మోహరించింది. అప్పట్లో వ్యవహారం మొత్తం చూస్తే  హాంకాంగ్‌పై చైనా దండయాత్ర చేస్తోందా.. లేక మరో తియాన్మన్‌ స్క్వేర్‌ పునరావృతం అవుతుందా అనే స్థాయిలో పరిస్థితి నెలకొంది. కానీ, 2020 ప్రారంభంలో చైనా, హాంకాంగ్‌ల్లో కరోనావైరస్‌ వ్యాపించింది. దీంతో ఉద్యమానికి కొన్నాళ్లు విరామం లభించింది. ఈ అదునుగా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. కానీ, వందల సంఖ్యలో విద్యార్థులు, రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. 

ఆ నగరం ఓ ఆర్థిక సౌధం 
ఒకప్పటి బ్రిటిష్‌ కాలనీ అయిన  హాంకాంగ్‌ ఆర్థికంగా ఎప్పుడూ సుసంపన్నంగానే ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపార వాతావరణం హాంకాంగ్‌కు పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడుల వరదను పారించింది. చైనా కంపెనీలకు విదేశీ నిధులు ఇక్కడి నుంచే వెళతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్‌ మార్కెట్లలో హాంకాంగ్‌ మార్కెట్‌ ఒకటి. హాంకాంగ్‌ ఆదాయం, పరపతి నుంచి చైనా భారీగా లబ్ధిపొందింది.
చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద దేశేతర మార్కెట్‌ హాంకాంగే. ప్రపంచ దేశాలకే అప్పులు ఇచ్చే ఆ బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో 7శాతం ఈ ఒక్క నగరంలోనే ఉన్నాయంటే ఎంత వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు చెందిన బీవోసీ హాంకాంగ్‌ లిమిటెడ్‌ నోట్లు జారీ చేసే బ్యాంకుల్లో ఒకటి. ఈ బ్యాంకు నిర్వహణ ఆదాయం ఐదో వంతు హాంకాంగ్‌, మకావ్‌ల నుంచే వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో కొన్నిటి ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్‌లోనే ఉన్నాయి. 

చైనాకు అవసరానికి సొమ్ము..
చైనాలో నగదు కొరతను ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, స్థానిక ప్రభుత్వ ఆర్థిక సంస్థలు హాంకాంగ్‌ నుంచి రుణాలు తెచ్చుకొంటాయి. అవే రుణాలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిందే. ఇప్పుడు హాంకాంగ్‌ చేజారితే చైనాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. 

డ్రాగన్‌ కంపెనీలకు ఆశ్రయం..
పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు ఉన్న హాంకాంగ్‌లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి చైనా కంపెనీలు ఇష్టపడతాయి. చాలా కంపెనీలు ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, క్నుక్‌ వంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి. 2015 నుంచి హాంకాంగ్‌లో ఐపీవోలకు వచ్చిన చైనా కంపెనీలు 100 బిలియన్‌ డాలర్లకు పైగా సేకరించాయి.  చైనాలో సేకరించిన మొత్తంలో ఇది 80శాతానికి సమానం..! అదీ హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ శక్తి. 

తాజాగా విదేశీ పెట్టుబడిదారులు హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ ద్వారా షాంఘై మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ రకమైన ట్రేడింగ్‌ వాటా షాంఘై  స్టాక్‌మార్కెట్లో 8శాతానికి చేరుకొంది. 

డాలర్‌ మార్పిడీకి అడ్డా..
హాంకాంగ్‌ కరెన్సీ విలువ డాలర్‌కు దాదాపు సమానంగా ఉంటుంది. దీంతో చైనీయులు యువాన్లను డాలర్లలో మార్చుకోవడానికి హాంకాంగ్‌లోని బీమా ఉత్పత్తులను వాడుకొంటారు. క్రెడిట్‌ కార్డ్ల ద్వారా చెల్లింపులు చేసి చైనా నిబంధనలను బైపాస్‌ చేస్తుంటారు. దీనికి తోడు చైనా విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా హాంకాంగ్‌కే వెళతాయి.  2017 చివరినాటికి ఇవి దాదాపు 981 బిలియన్‌ డాలర్లను చేరుకున్నాయి. 

అల్లర్ల అదపు డ్రాగన్‌కు అత్యవసరం..
హాంకాంగ్‌లో ఏమి చేసైనా అల్లర్లను అదుపు చేయడం చైనాకు ఇప్పుడు అత్యవసరం. అమెరికా హాంకాంగ్‌ను వాణిజ్య యుద్ధంలో బేరాలాడటానికి ఆయుధంగా మలుచుకొంది. హాంకాంగ్‌ రక్షణకు అమెరికా ఏకంగా ఒక ఆంక్షల బిల్లును కూడా తాజాగా సిద్ధం చేస్తోంది. మరోపక్క మైక్‌ పాంపియో కూడా ఇక హాంకాంగ్‌ను స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏమాత్రం స్వతంత్ర ప్రాంతం చూడదని పేర్కొన్నారు. 

* హాంకాంగ్‌ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు టారీఫ్‌లు విధించకుండా ట్రంప్‌ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. చాలా చైనా కంపెనీలు ఇప్పుడు హాంకాంగ్‌ నుంచే ఎగుమతులు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆందోళనలు ఆ ఎగమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ మినహాయింపులు ఇక దక్కకపోవచ్చు. 
* చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో షాంఘై, షెన్జన్‌ వంటి నగరాలను పశ్చిమ దేశ కంపెనీలను ఆకర్షించేలా చేయాలని భావిస్తోంది. కానీ, ఇది రాత్రికి రాత్రే జరగదు. అప్పటి వరకు ఆర్థిక సంక్షోభం ఆగదు. అందుకే బంగారు బాతు వంటి హాంకాంగ్‌ను దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. 

Monday, May 18, 2020

నేపాల్‌.. ఎందుకిలా?

నేపాల్‌.. ఎందుకిలా?

భారత్‌-నేపాల్ దేశాల మధ్య కొత్త రహదారి మార్గం అంతరాలు సృష్టిస్తోంది.‌  టిబెట్‌లోని మానస సరోవర్‌ పుణ్యక్షేత్రాన్ని చేరుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్‌ మార్గంపై నేపాల్‌ విమర్శలు చేయడంతో ఇరుదేశాల మధ్య వివాదం ఏర్పడింది. నేపాల్‌ ఏకంగా సాయుధ పోలీసు దళాన్ని కాలాపానీ సమీపంలో మోహరించడం గమనార్హం. 

ఏమిటీ లిపులేఖ్‌ మార్గం?
చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌లోని కైలాస మానససరోవరం ఉంది.  భారత్‌ నుంచి వెళ్లే యాత్రికులు మూడుమార్గాలైన సిక్కిం, ఉత్తరాఖండ్‌, నేపాల్‌ నుంచి వెళుతారు. అయితే భారత్‌లోని ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పితోడ్‌గఢ్‌ నుంచి లిపులేఖ్‌ వరకు నూతన మార్గాన్ని నిర్మిస్తోంది. ఇందులో చాలావరకు పాతమార్గం ఉండగా డబుల్‌ లైన్‌ చేయడంతో పాటు చైనా సరిహద్దు వద్ద ఉన్న లిపులేఖ్‌ వరకు కొత్త మార్గాన్ని నిర్మించడం విశేషం. ఈ మార్గంతో మానస సరోవర్‌కు యాత్రికులు త్వరగా చేరుకోగలుగుతారు. దీంతో పాటు భారత రక్షణ అవసరాల దృష్ట్యా ఈ మార్గం కీలకమైనది.

అది మాదే అంటున్న నేపాల్‌
భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న కాలాపానీతో పాటు లిపులేఖ్‌ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోని పితోడ్‌గఢ్‌ నేపాల్‌లోని దర్చులా జిల్లాలకు సరిహద్దుగా ఉంది. మహాకాళి నది ఈప్రాంతం నుంచి ప్రవహిస్తోంది.   1816లో సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళీ నదిని నేపాల్‌ పశ్చిమ సరిహద్దుగా గుర్తించారు.  మహాకాళీ నదిలో కాలపానీ వద్ద అనేక ఉపనదులు కలుస్తాయి.  ఈ ప్రాంతం ట్రై జంక్షన్‌ లాంటింది. నేపాల్‌, చైనా, భారత సరిహద్దులు ఇక్కడ కలుస్తాయి. దీంతో రక్షణపరంగా దీనికి కీలకప్రాధాన్యత ఉంది. భూటాన్‌లోని డోక్లాంకు ఎంతటి ప్రాధాన్యత ఉందో కాలాపానీకి కూడా అంతే గుర్తింపు ఉంది. 

కాలాపానీలోనే మహాకాళి నది జన్మిస్తుంది కాబట్టి పశ్చిమ భాగం మొత్తం భారత్‌కు చెందినదని భారత్‌ వాదిస్తోంది. అయితే  తూర్పు ప్రాంతమంతా నేపాల్‌ కిందకు వస్తోందని  ఆ దేశం కొత్తవాదనకు తెరతీసింది.  1830కు సంబంధించిన పితోడ్‌గఢ్‌ రికార్డులను భారత్‌ తన మద్దతుగా బయటపెట్టింది.  1879లో బ్రిటిషు ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపానీ మొత్తం ప్రదేశం భారత్‌లోనే ఉండటం గమనార్హం. నేపాల్‌కు చెందిన ఒక అంగుళం భూమి కూడా భారత్‌ ఆక్రమించుకోదని భారత్‌ ఇది వరకే స్పష్టంచేసింది. ఈ సమస్యపై ద్వైపాక్షికచర్చలు జరగాలని రక్షణరంగ నిపుణులు  సూచిస్తున్నారు. కాలాపానీతో పాటు లిపులేఖ్‌ కనుమదారి కూడా తమ  ప్రాంతమేనని నేపాల్‌ వాదిస్తోంది. అయితే 1830 నుంచి ఈ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని భారత్‌ చెబుతోంది.  1962లో చైనా అక్రమ చొరబాట్ల కారణంగా ఈ కనుమదారిని మూసేశారు. కొన్ని సంవత్సరాల కిందటే తెరిచారు. 

చైనా పన్నాగమా?
భారత వ్యతిరేక చర్యలకు నేపాల్‌ దిగడం మన దేశానికి విస్మయం కలిగిస్తోంది. నేపాల్‌ ఆందోళనకు దిగడం వెనుక ఇతర దేశాల పాత్ర ఉండవచ్చని భారత సైనికాధిపతి జనరల్‌ నరవణె అన్నారు.  కాలాపానీకి పశ్చిమంగా ఉన్న ప్రాంతం పూర్తిగా భారత్‌దే. లిపులేఖి మార్గం కూడా ఇందులోనే నిర్మిస్తున్నాం. మరి నేపాల్‌ ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని  ఆయన అన్నారు.

సామరస్యంగా సమస్య పరిష్కారం
ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని భారత్‌ యోచిస్తోంది. అయితే భారత హక్కులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్న నిశ్చయంతో ఉంది. పాత రికార్డులు, ఒప్పందాలను నేపాల్ గౌరవించాలని సూచిస్తోంది.

ఎయిర్‌లిఫ్ట్‌ నుంచి వందే భారత్‌ వరకు..

ఎయిర్‌లిఫ్ట్‌ నుంచి వందే భారత్‌ వరకు..

ఆపరేషన్‌ వందే భారత్‌.. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌. పలు విమానాలు, ఓడల ద్వారా విదేశాల్లోని భారతీయులను తీసుకురావాలన్నది ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. ఇప్పటికే తొలి విడతగా కొంతమందిని స్వదేశానికి తీసుకొచ్చిన ప్రభుత్వం రెండో విడత కూడా ప్రారంభించింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ వివిధ సందర్భాల్లో విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. ఇందుకోసం పలు ఆపరేషన్లు చేపట్టింది. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం..

1990 ఎయిర్‌లిఫ్ట్‌

ఆగస్టు 2, 1990.. ఇరాక్‌ సైనిక బలగాలు కువైట్‌పై దాడి చేశాయి. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని భూ ఆక్రమణకు పాల్పడ్డాయి. ఇదే గల్ఫ్‌ యుద్ధానికి దారి తీసింది. ఈ పోరులో 1.70లక్షల మందికిపైగా భారతీయులు కువైట్‌లో చిక్కుకుపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయపడిపోయారు. దీంతో స్పందించిన భారత ప్రభుత్వం యుద్ధం తీవ్రతరం కాకముందే భారతీయులను స్వదేశానికి రప్పించాలనుకుంది. కావాల్సిన అన్ని అనుమతులు తీసుకోని ‘ఆపరేషన్‌ ఎయిర్‌లిఫ్ట్‌’ను ప్రారంభించింది. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 488 విమానాల్లో భారతీయులను తరలించింది. ఆగస్టు 13న మొదలుపెట్టిన ఈ ఆపరేషన్‌ అక్టోబర్‌ 20న ముగిసింది. ఈ ఘటన ఆధారంగా 2016లో బాలీవుడ్‌లో ‘ఎయిర్‌లిఫ్ట్‌’ చిత్రం తెరకెక్కింది. ఇందులో అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు.

ఆపరేషన్‌ సుకూన్‌

జులై 12, 2006లో లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్‌ బలగాలు ఇజ్రాయిల్‌లో అక్రమంగా చొరబడి దాడి చేశాయి. కొందరు ఇజ్రాయెల్‌ సైనికులను చంపి, పలువురిని అదుపులోకి తీసుకొని ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న లెబనీస్‌ ఖైదీలను విడుదల చేయాలని హెజ్బొల్లా డిమాండ్‌ చేసింది. దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్‌ సైన్యం లెబనాన్‌పై బాంబులతో దాడి చేసింది. దీంతో యుద్ధం మొదలైంది. అదే సమయంలో పర్యటన నిమిత్తం లెబనాన్‌కు వెళ్లిన పలువురు భారతీయులు సహా అనేక మంది విదేశీయులు యుద్ధ క్షేత్రంలో చిక్కుకుపోయారు. వెంటనే పరిస్థితులను సమీక్షించిన భారత ప్రభుత్వం ‘ఆపరేషన్‌ సుకూన్‌’ ప్రారంభించింది. ఓడల ద్వారా లెబనాన్‌లో చిక్కుకున్న వారిని భారత్‌కు తీసుకొచ్చింది. లెబనాన్‌లో శ్రీలంక, నేపాల్‌కు చెందిన వారు కూడా చిక్కుకుపోయారు. అయితే ఆయా దేశాలకు వారి పౌరులు తీసుకొచ్చేంత శక్తి లేక భారత్‌ సాయం కోరాయి. దీంతో శ్రీలంక, నేపాల్‌కు చెందిన 2,200 మందిని కూడా భారత  ప్రభుత్వం స్వదేశాలకు తరలించింది.

ఆపరేషన్‌ సేఫ్‌ హోంకమింగ్‌

2011లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లిబియాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో ఆందోళనలు తారస్థాయికి చేరి అంతర్‌ యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 15న మొదలైన ఈ యుద్ధం అక్టోబర్‌ 22 వరకు జరిగింది. అయితే యుద్దం కారణంగా లిబియాలో పనిచేస్తున్న 18వేల మంది భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటూ వెళ్లలేక ఆందోళనకు గురయ్యారు. వారిని రక్షించేందుకు భారత ప్రభుత్వం వైమానిక, నేవీ సైన్యం సహాయంతో ‘ఆపరేషన్‌ సేఫ్‌ హోంకమింగ్‌’కు శ్రీకారం చుట్టింది. 

మొదట విమానాల ద్వారా తరలింపు చేపట్టాలని భారత్‌ భావించింది. అయితే లిబియాలోని ఎయిర్‌పోర్టులో రన్‌వేలు ధ్వంసం కావడంతో అది సాధ్యపడలేదు. దీంతో ఫిబ్రవరి 26న ముంబయి నుంచి మూడు ఓడలను లిబియాకు పంపింది. రెండ్రోజుల ప్రయాణం అనంతరం ఓడలు లిబియాలోని బెంగాజీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఓడలోని ఛార్టెడ్‌ షిప్స్‌ ట్రిపొలి, బెంగాజీ ప్రాంతాల నుంచి భారతీయులను ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు తరలించాయి. అక్కడి నుంచి వారిని విమానాల ద్వారా భారత్‌కు క్షేమంగా తీసుకొచ్చారు. వందల మంది భారతీయులు లిబియా యుద్ధానికి భయపడి దేశ సరిహద్దును దాటి పొరుగు దేశాలకు పారిపోయారు. అక్కడి భారత ఎంబసీకి విషయం చెప్పడంతో ఆయా దేశాల నుంచి వారిని ముంబయికి తరలించారు.

ఆపరేషన్‌ రాహత్‌

2015 మార్చి 27న యెమెన్‌పై సౌదీ అరేబియా దాడులకు పాల్పడింది. దీంతో యెమెన్‌లో సైనిక చర్యలు మొదలయ్యాయి. జనవరిలోనే యెమెన్‌-సౌదీ మధ్య యుద్ధ వాతావరణాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం యెమెన్‌లోని భారతీయులు ఆ దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా సూచన చేసింది. ఫిబ్రవరిలోనూ మరోసారి భారతీయులు ఆ దేశం వదిలి వెళ్లాలని, అలాగే యెమెన్‌కు ఎవరూ వెళ్లకూడదని సూచనలు చేసింది. యెమెన్‌పై సౌదీ దాడిచేసే రెండ్రోజుల ముందు కూడా భారత్‌ హెచ్చరికలు జారీ చేసినా కొందరు భారతీయులు మాట వినలేదు. ఆ ఇరుదేశాల ఘర్షణతో దాదాపు 5వేల మంది భారతీయులు యెమెన్‌లో చిక్కుకుపోయారు. 

దీంతో యెమెన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ రాహత్‌ మొదలుపెట్టింది. యెమెన్‌లో విమాన రాకపోకలు నిలిపివేయడంతో మొదట నౌకల ద్వారా తరలింపు చేపట్టింది. ఏప్రిల్‌ 3న విమానాలకు అనుమతి ఇవ్వడంతో యెమెన్‌లోని సనా నుంచి జీబూటికి.. అక్కడి నుంచి ముంబయి, కొచ్చికి భారతీయులను తీసుకొచ్చారు. మొత్తంగా 18 విమానాల్లో 2,900 మందిని.. పలు నౌకల్లో 1,670 మందిని భారత్‌కు తీసుకొచ్చారు. భారతీయులనే కాదు.. దాదాపు 1200 మంది విదేశీయులను కూడా భారత ప్రభుత్వం వారి స్వదేశాలకు పంపింది. అయితే 11 మంది భారతీయులను పాకిస్థాన్‌ నేవీ కాపాడి కరాచీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి భారత్‌కు పంపడం గమనార్హం. 

ఆపరేషన్‌ మైత్రి

2015 ఏప్రిల్‌ 25.. నేపాల్‌కు ఓ చీకటి రోజు. భూకంపం ఆ దేశాన్ని వణికించింది. భూకంపం ధాటికి దాదాపు 9వేల మంది మృత్యువాత పడ్డారు. 22వేల మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే భారత్‌ స్పందించింది. మిత్రదేశమైన నేపాల్‌కు తన వంతు సాయం చేయాలని భావించి ఆపరేషన్‌ మైత్రి చేపట్టింది. దీనిలో భాగంగా నేపాల్‌కు భారత వాయుసేన విమానాల్లో నిత్యావసర సరకులు, సహాయక చర్యల కోసం సైన్యాన్ని పంపింది. అలాగే నేపాల్‌లో చిక్కుకున్న 43వేల మంది భారతీయులు, పలువురు విదేశీయులను రోడ్డు, విమాన మార్గాల్లో భారత్‌కు తరలించింది. దాదాపు 785 మంది విదేశీయులకు భారత్‌ నుంచి ట్రాన్సిట్‌ వీసా ఇప్పించి వారి స్వదేశాలకు పంపించింది. 

బ్రస్సెల్స్‌ ఎయిర్‌లిఫ్ట్‌

2016 మార్చి 26న బెల్జియంలో ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. బ్రస్సెల్స్‌ ఎయిర్‌పోర్టు సహా పలు చోట్ల మూడు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో 242 మంది భారతీయులు చిక్కుకున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న భారత్‌కు చెందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాయి. వారిలో 28 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు.

ఆపరేషన్‌ వందే భారత్

కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని దేశాలు విమాన ప్రయాణాలను నిలిపివేశాయి. దీంతో అనేకమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారందరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాయు మార్గంలో ఆపరేషన్‌ వందే భారత్‌.. సముద్ర మార్గంలో ఆపరేషన్‌ సముద్రసేతు మొదలు పెట్టింది. తొలి విడతగా మే 7 నుంచి 14 వరకు 12 దేశాల నుంచి 64 విమానాల్లో 14,800 మంది భారతీయులను ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చింది. సముద్ర మార్గంలో 6,527 మందిని తీసుకొచ్చింది. తాజాగా మే 16 నుంచి 22 వరకు రెండో విడత ఆపరేషన్‌ చేపట్టింది. ఈ విడతలో 31 దేశాల నుంచి 30వేల మంది భారతీయులను భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 149 విమానాలను వినియోగించనుంది. ఇవే కాదు, అనేక దేశాల్లో.. మన దేశంలోని రాష్ట్రాల్లో ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రభుత్వం వాయుసేన, నౌకాదళం సాయంతో అనేక ఆపరేషన్లు చేపట్టింది. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Saturday, May 16, 2020

స‌రిగ్గా 102 ఏళ్ల ముందు..



స‌రిగ్గా 102 ఏళ్ల ముందు.. 

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ధ‌నిక‌, పేద దేశాల తేడా లేదు. అన్ని ఖండాల్లోనూ మ‌ర‌ణ మృదంగం మోగిస్తోంది. భార‌త్‌లోనూ అడుగుపెట్టింది. అయితే స‌రిగ్గా 102 సంవ‌త్స‌రాల‌కు ముందు 1918లో ప్ర‌పంచం స్పానిస్ ప్లూ అనే ఇన్‌ఫ్లూయంజాతో నిలువెల్లా వ‌ణికిపోయింది. ఏకంగా 50 కోట్ల‌మంది దీని బారిన ప‌డి ఉంటార‌ని అంచ‌నా. భార‌త్‌లోనూ ఈ వైర‌స్ త‌న మార‌ణ‌కాండ కొన‌సాగించింది. ఇక్క‌డ ఏకంగా 2 కోట్ల‌మంది వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయివుంటార‌ని ప్ర‌భుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. కాశీలోని గంగా తీరంలో వంద‌లాది శ‌వాల‌ను రోజూ కాల్చేవారు. దేశంలోని ప్ర‌తి ప్రాంతంలో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత స్పెయిన్‌లో గుర్తించ‌డంతో దీన్ని స్పానిష్ ఫ్లూ గా వ్య‌వ‌హరించారు

దొంగ లాగా వ‌చ్చింది..
భార‌త్‌లోకి ఈ వైర‌స్ దొంగ‌లాగా వ‌చ్చింది. మొద‌టి ప్ర‌పంచ‌యుద్ధ స‌మ‌యంలో సైనికులు కంద‌కాలు త‌వ్వేవారు. అందులోనే అధిక‌ స‌మ‌యం గ‌డిపేవారు. పారిశుద్ధ్య ప‌రిస్థితులు అంతంత మాత్రంగానే ఉండేవి. ఇలాంటి ప‌రిస్థితుల్లో  ఈ వైర‌స్ పుట్టుకొచ్చింది. మొద‌ట్లో యూర‌ప్‌కు ప‌రిమిత‌మైన వైర‌స్ నౌక‌ల ద్వారా భార‌త్‌లోకి దొంగ‌లాగా ప్ర‌వేశించింది. బాంబే పోర్టులోని సిబ్బందికి ఈ వ్యాధి సోకింది. మొద‌ట్లో దీనిని వైద్య‌ సిబ్బంది గుర్తించ‌లేక‌పోయారు. మ‌లేరియా ల‌క్ష‌ణాలున్నా మ‌లేరియా కాక‌పోవ‌డంతో వైద్యుల‌కు దీని గురించి అంతుపట్ట‌లేదు. క్ర‌మంగా వ్యాధిన‌ ప‌డేవ‌రిసంఖ్య వంద‌ల్లోకి వేల‌ల్లోకి వెళ్లిపోయింది. 

బ్రిటిషు పాల‌కుల నిర్ల‌క్ష్యం..
ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో అప్ప‌టి వ‌ల‌స‌ పాల‌కులు పూర్తిగా నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించారు. అప్ప‌ట్లో వైద్యుల్లో అధిక భాగం శ్వేతజాతీయులే. దీంతో త‌మ‌కు ఎక్క‌డ అంటుకుంటుందోనన్న భ‌యంతో దూరంగా ఉండిపోయారు..ఫ‌లితంగా  ల‌క్ష‌ల మంది బ‌ల‌య్యారు.

బాంబే జ్వ‌రం
తొలినాళ్ల‌లో ఈ వ్యాధి బాంబేలో బ‌య‌ట‌ప‌డింది. దీంతో బాంబే ఫీవ‌ర్ అని పిలిచేవారు. 1918 నుంచి 1920 వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేసింది. మొద‌టి ద‌శ‌లో వృద్ధుల‌పై ప్ర‌తాపం చూపించ‌గా రెండో ద‌శ‌లో యువ‌త సైతం బ‌ల‌వ్వ‌డం గ‌మ‌నార్హం. 1920 చివ‌రి క‌ల్లా వ్యాధి మాయ‌మైంది. మందులు రావ‌డంతో పాటు మాన‌వుల్లో రోగ నిరోధక వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డ‌టంతో ఆ మహ‌మ్మారి అంత‌రించింది.

సామాజిక దూరం పాటించ‌డంతో..
అప్ప‌ట్లోనే ప్ర‌పంచంలోని ప‌లు ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్త‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. యూర‌ప్‌, అమెరికాల్లో సామాజిక దూరాన్ని పాటించారు.  దీంతో వ్యాధి విస్త‌ర‌ణ త‌గ్గింది. తాజాగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో ఇదే వ్యూహాల‌ను పాటిస్తున్నారు. సామాజిక‌దూరాన్ని పాటిస్తే రానున్న‌రోజ‌ల్లో క‌రోనాకు ముక్కుతాడు వేయ‌గ‌లం.

కరోనా తర్వాత జరిగేవి ఇవేనా?

కరోనా తర్వాత జరిగేవి ఇవేనా?
19 Apr, 2020

జనాభా పెరిగిపోతోంది కాబట్టి వాతావరణ మార్పుల ప్రభావం విస్పష్టంగా తెలుస్తోంది కాబట్టి... కరోనా లాంటి ఉత్పాతాలు సమీప భవిష్యత్తులో మరిన్ని వస్తాయన్నది మాత్రం నిస్సందేహం. అందుకే భౌతిక దూరం పాటించడం, లాక్‌డౌన్‌ లాంటివి కరోనా అనంతర ప్రపంచంలో కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఇది కాస్తా చట్టమైందనుకోండి. చిత్ర విచిత్రమైన పరిణామాలు ఎదురవుతాయి. మనుషులకు దూరంగా ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమితమవడం వల్ల మానసికంగా కుంగిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో గుండె జబ్బులు, మతిమరుపు, చావుల్లాంటివీ వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిబంధనల అమలుకు కొన్ని ఫైన్లు గట్రా గ్యారంటీ. 

ఈ చట్టాలు, ఫైన్లు ఉన్నాయి కాబట్టి కంపెనీలు తమ వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు వినూత్న పద్ధతులను పాటించాల్సి వస్తుంది. హోటళ్లలో కూర్చొని తినడం ఉండదు కాబట్టి ఆహారం ఇంటికే తెచ్చి ఇచ్చే సంస్థలకు డిమాండ్‌ పెరిగిపోతుంది. జిమ్‌లు పనిచేసే అవకాశాల్లేవు కాబట్టి ప్రజలు వ్యాయామం కోసం సైక్లింగ్, ట్రెక్కింగ్, హైకింగ్, సర్ఫింగ్‌ వంటి వాటిపై ఆధారపడాల్సి వస్తుంది. కాకపోతే ఎప్పుడు? ఎక్కడ ఎంత సమయం అన్నది ముందుగానే నిర్ణయమైపోతుంది. ఉదాహరణకు కేబీఆర్‌ పార్కులో ఉదయం గంటలవారీ స్లాట్లు ఏర్పాటవుతాయి. నిర్దిష్ట సంఖ్యలోనే ప్రజలను వాకింగ్‌కు అనుమతిస్తారు. 

కాలక్రమంలో ప్రజల కదలికలపై నిఘా పెట్టేందుకు కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తాయి. ఫేస్‌ రికగ్నిషన్‌ వంటివన్నమాట. మూడు అడుగుల కంటే దగ్గరకు ఎవరైనా వస్తే సెల్‌ఫోన్లే పెద్ద సౌండ్‌తో అలారమ్‌ మోగించినా మోగించగలవు. అంతేకాదు ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళ్లే తీరు కూడా మారిపోతుంది. ఒకరోజు ఆఫీసు ఇంకో రోజు ఇంట్లోంచి పనిచేయడం లేదా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పాటించిన సరి–బేసి విధానం మాదిరిగా వారంలో కొన్ని రోజులు ఐటీ.. ఇంకొన్ని రోజులు ఇతర కంపెనీల వాళ్లు ఇలా అన్నమాట. ఇదిలాగే కొనసాగితే ఏమవుతుందో తెలుసా? ఇంకో మనిషి మన దగ్గరగా వస్తున్నాడంటే ఏదో జరిగిపోతోంది అన్న భయం.. అగరోఫోబియా వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

భయమేస్తోందా? అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం. కానీ వాటి నుంచి తప్పించుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదులెండి. ఎంచక్కా అన్ని రకాల డిజిటల్‌ సాధనాలను వాడుకుంటూ అందరితో ‘టచ్‌’లో ఉంటే చాలు! టచ్‌ అంటే తాకడం కాదండోయ్‌! ఆడియో, వీడియోల ద్వారా అందరితో సంబంధాలు మెయింటెయిన్‌ చేయడమన్నమాట. కొంతకాలానికి ఈ పద్ధతులకు అలవాటుపడ్డా కొన్ని సందర్భాల్లో ఇంకొకరి తోడు కచ్చితంగా అవసరం అనిపిస్తుంది. దీన్ని టెక్నాలజీ మార్చేయలేదు. ముఖ కవళికలను క్షుణ్ణంగా అర్థం చేసుకొనే కంప్యూటర్లు/రోబోలు ఇప్పటివరకూ రాలేదు మరి!

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ



కరోనా.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

ప్రాణాంతకంగా మారి అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ విస్తరిస్తున్న తీరు..రోజురోజుకీ మరణాలు సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితి(గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి చైనా తీసుకుంటున్న చర్యల్ని కొనియాడిన ఆయన.. ఇతర దేశాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు ప్రయాణాలపై విధిస్తున్న ఆంక్షల్ని డబ్ల్యూహెచ్‌ఓ తప్పుబట్టింది. దీని వల్ల బాధితులకు సరైన సహాయ సహకారం అందించేందుకు అడ్డంకులు ఏర్పడతాయని అభిప్రాయపడింది. తాత్కాలికంగా ఇలాంటి చర్యలు ఉపశమనం కలిగించినట్లు కనిపించినా.. దీర్ఘకాలంలో దుష్పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.



గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ అంటే?

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న మహమ్మారి ‘కరోనా వైరస్‌’ అంతర్జాతీయ సమాజానికి వణుకు పుట్టిస్తోంది. ఈ పిశాచానికి ఇప్పటికే రెండొందల మందికి పైగా బలవ్వగా.. వేల సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారిన పడ్డారు. చైనా వెలుపల దాదాపు 20 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో భారత్‌ కూడా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ).. ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితి’ని ప్రకటించింది. ఇంతకీ ఏంటీ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ? ఎలాంటి పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్‌ఓ ఈ ప్రకటన చేస్తుంది?   

‘పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కన్సర్ (పీహెచ్‌ఈఐసీ)‌’నే అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక స్థితిగా పిలుస్తారు. ఓ దేశ సరిహద్దును దాటి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాధులు విస్తరిస్తూ ప్రజా ఆరోగ్యానికి ఆందోళనగా మారిన అసాధారణ పరిస్థితుల్లో దీనిని ప్రకటిస్తారు. తద్వారా.. అంతర్జాతీయ దేశాలన్నీ సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో తీసుకొచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల (ఐహెచ్‌ఆర్) ప్రకారం.. అన్ని దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీపై కచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన విధి. 

ఎమర్జెన్సీ వెనుక ఉద్దేశం ఇదే..

* ఈ ప్రకటనతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు నెలకొన్నాయనే సందేశాన్ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచానికి తెలియజేస్తుంది. 

* ఆ వ్యాధిపై పోరాడేందుకు ఇతర దేశాలు సహకరించేలా చేస్తుంది. అంటే.. వ్యక్తిగత సిబ్బంది, నిధులు, ఇతర వనరులను ఇస్తూ బాధిత దేశానికి అండగా నిలవడం. 

* వ్యాధి తీవ్రతను నొక్కిచెబుతూ ప్రభావిత దేశాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై డబ్ల్యూహెచ్‌ఓ చేసిన సూచనలు పాటించేలా ఈ ప్రకటన సాయపడుతుంది.

* వ్యాధి ప్రభావిత దేశాలకు వెళ్లకుండా ట్రావెల్‌ అడ్వైజరీని కూడా సిఫార్సు చేసింది. 2003లో సార్స్‌ వైరస్‌ విజృంభించిన సమయంలోనూ డబ్ల్యూహెచ్‌ఓ ప్రయాణ మార్గదర్శకాలు జారీ చేసింది. 

* అత్యయిక స్థితిని ప్రకటించిన తర్వాత ప్రజా ఆరోగ్య చర్యలపై డబ్ల్యూహెచ్‌ఓ సమీక్ష చేపడుతుంది. ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సులను దాటి ఏ దేశమైనా ఇతర ఆంక్షలు విధిస్తే వాటిపై శాస్త్రీయమైన వివరణ ఇవ్వాలని కోరుతుంది. 

ఇప్పటివరకు ఆరుసార్లు..
2009 నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. 2009లో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు, 2015లో పోలియో సమయంలో, 2014లో పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విజృంభించినప్పుడు, 2015-16లో జికా వైరస్‌ సమయంలో, 2018లో కివు ఎబోలా వ్యాపించినప్పుడు అత్యయిక స్థితి ప్రకటనలు చేశారు. తాజాగా చైనాలో మొదలైన ‘నావెల్‌ కరోనా’ వైరస్‌ వల్ల మరోసారి ప్రకటించాల్సి వచ్చింది. 

రాజకీయ ఒత్తిళ్లు కూడా..
ఒక్కోసారి ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటిస్తే రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎదురవుతుంటాయి. 2014లో ప్రాణాంతక ఎబోలా వ్యాపించినప్పుడు హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్పుడు ఈ నిర్ణయంపై పశ్చిమాఫ్రికా దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ప్రకటన తమ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వెంటనే వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాయి. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ఎబోలా వ్యాప్తి చెందకుండా అదుపులోకి వచ్చింది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

అసమర్థ జన్యువులతో కరోనా తీవ్రం



అసమర్థ జన్యువులతో కరోనా తీవ్రం

May 12 2020

కొవిడ్‌-19 సోకినా కొందరిలో కనిపించని ఇన్ఫెక్షన్‌ లక్షణాలు
మరికొందరిలో కొద్దిపాటి సమస్యలు
ఇంకొందరికి ప్రాణాపాయ పరిస్థితి
వైర్‌సను గుర్తించలేని జన్యువులు
ఉన్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువ
ఓఎ్‌సహెచ్‌యూ శాస్త్రజ్ఞుల వెల్లడి

కొవిడ్‌-19 సోకినవారందరిలోనూ లక్షణాలు ఒకేలా కనిపించట్లేదు. కొందరిలో కొద్దిగా.. మరికొందరిలో ఎక్కువగా.. ఇంకొందరికి ప్రాణాలకే ప్రమాదం కలిగించేంతగా లక్షణాలుంటున్నాయి. వృద్ధుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంటున్నా.. ఈ వైర్‌సను జయించిన వృద్ధులూ ఉన్నారు. పిల్లలూ ఉన్నారు. ఎందుకీ తేడా? అంటే.. వైరస్‌ సోకిన వ్యక్తుల్లోని జన్యువుల్లో తేడానే ఇందుకు కారణమని ఆరెగావ్‌ సైన్స్‌ అండ్‌ హెల్త్‌ యూనివర్సిటీ (ఓఎ్‌సహెచ్‌యూ) శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సాధారణంగా.. ఏదైనా వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తే వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి రోగ నిరోధక వ్యవస్థకు సమాచారం అందించి, ఆ వైర్‌సలను చంపే ‘సైటోటాక్సిక్‌ టి సెల్స్‌’ను పంపాల్సిందిగా అప్రమత్తం చేసే ‘అలారం సిస్టమ్‌’ మన శరీరంలో ఉంటుంది. కానీ.. ఆ అలారం వ్యవస్థ అందరిలోనూ ఒకేలా ఉండదని ఓఎ్‌సహెచ్‌యూ శాస్త్రజ్ఞులు తెలిపారు. అందుకే వైరస్‌ ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటోందని వివరించారు.

అలారం ఇలా..
మనకు ఏదైనా వైరస్‌ సోకినప్పుడు ఈ అలారం వ్యవస్థ అప్రమత్తమవుతుంది. అందులో కీలకమైనవి.. మన జన్యువుల్లో ఉండే అల్లెలేలనే నిర్మాణాలు. ఈ అల్లెలేలలో కొన్ని.. కొన్ని తరహాల వైర్‌సలకు, పాథోజన్లకు ఎక్కువగా ప్రతిస్పందిస్తాయి. అవి ఎంత ఎక్కువగా ప్రతిస్పందిస్తే రోగ నిరోధక వ్యవస్థ అంత ఎక్కువ సమర్థంగా పనిచేస్తుంది. అవి ఎంత తక్కువగా ప్రతిస్పందిస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా అలాగే తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉండేవారిలో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు, తీవ్రత ఎక్కువగా ఉంటున్నాయి. మరీ తక్కువగా ఉంటే ప్రాణాలు కోల్పోతున్నారు. ఓఎ్‌సహెచ్‌యూ పరిశోధకులు తమ రిసెర్చ్‌లో భాగంగా.. మానవుల్లోని ‘హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌ సిస్టమ్‌ (హెచ్‌ఎల్‌ఏ)’ను కంప్యూటర్‌ మోడల్‌ ద్వారా పరీక్షించారు. వ్యక్తుల హెచ్‌ఎల్‌ఏ పనితీరును వారి జన్యువుల్లోని అల్లెలేలే నిర్ధారిస్తాయి. ఒక్కో హెచ్‌ఎల్‌ఏ ప్రొటీన్‌ ఒక్కో అల్లెలేకు సంకేతం. వైర్‌సలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మొట్టమొదట ఇవే గ్రహించి.. ఆ వైర్‌సల తాలూకూ పెప్టైడ్‌లకు (కరోనా వైరస్‌ శరీరభాగాలను తయారుచేసే అమైనో ఆమ్లాలకు) అతుక్కుంటాయి. ఇలా ఒక హెచ్‌ఎలే ప్రొటీన్‌ దేనికైనా అతుక్కుందంటే.. అది మన శరీరానికి సంబంధించినది కాదని.. వైరస్సో, ఇంకేదో వస్తువో వచ్చిందని రోగనిరోధక వ్యవస్థకు తెలుస్తుంది. మరోవైపు.. అలా శత్రు వైర్‌సలోని పెప్టైడ్‌కు అతుక్కున్న తర్వాత.. అల్లెలేలు వాటిని కణం ఉపరితల భాగానికి తీసుకెళ్తాయి. అవి అక్కడికి వచ్చాయంటే అర్థం ఆ కణం ఇన్ఫెక్ట్‌ అయిందని. వెంటనే రోగనిరోధక వ్యవస్థ ఆ కణాన్ని చంపేస్తుంది. ఇంతటి కీలకమైన హెచ్‌ఎల్‌ఏ రకాల్లో కొన్ని మాత్రమే కొవిడ్‌-19 వైర్‌సను బాగా ఎక్కువగా గుర్తిస్తున్నాయి.

ఉదాహరణకు.. ‘బి46:01’ రకం అల్లెలే.. కొవిడ్‌-19 వైర్‌సను గుర్తించడంలో చాలా బలహీనంగా ఉంది. గతంలో ఇదే అల్లెలే బలహీనంగా ఉన్నవారిలో సార్స్‌ ప్రభావం, వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అదే క్రమంలో.. ఈ అల్లెలే ఉన్నవారికి కొవిడ్‌-19 సోకినా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటోందని అంచనా. దీనిపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని.. తమ అంచనా నిజమో కాదో ధ్రువీకరించుకునేందుకు వైరస్‌ బారిన పడినవారి శరీరంలోని జన్యువులను పరీక్షించాల్సి ఉందని ఓహెచ్‌ఎ్‌సయూ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

చరిత్రలో అతి భయంకరమైన ఆ వ్యాధులు ఎలా కనుమరుగయ్యాయి?

చరిత్రలో అతి భయంకరమైన ఆ వ్యాధులు ఎలా కనుమరుగయ్యాయి?

వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూ ఉంటాయ్‌.. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్లు కనుక్కోవాలి. ఎక్కడా ఎలాంటి వైరస్‌ పుట్టికొచ్చినా.. దాని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోకంలో కొత్త వ్యాధులకు ఔషధం కనిపెట్టడం పెద్ద సమస్యేమీ కాదు.. కచ్చితంగా మందు అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. కొంచెం ఆలస్యమైనా ఔషధం అందుబాటులోకి వచ్చి తీరుతుంది. ఇప్పుడంటే వైద్యులు, పరిశోధకులు అధికంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ వ్యాధినుంచైనా బయటపడగలుతున్నారు. మరి వైద్యులు, పరిశోధనలు సరిగా లేని కాలంలో వ్యాధులు ఎలా తగ్గాయి? లక్షల మంది ప్రాణాలు బలిగొన్న వైరస్‌లు, బాక్టీరియాలను ప్రజలు ఎలా తరిమికొట్టారు? చరిత్రలో భయంకరంగా విరుచుకుపడిన కొన్ని సూక్ష్మక్రిములు కాలక్రమంలో ఎలా మాయమయ్యాయో చూద్దాం.. 
Ok
జస్టీనియన్‌ ప్లేగు.. రోగ నిరోధక శక్తే ఆయుధం
చరిత్రలో అతి భయంకరమైన వ్యాధుల్లో ప్లేగు వ్యాధి ఒకటి. క్రీస్తుశకం 541 కాలంలో ఆనాటి బిజంటైన్‌(ఈశాన్య యూరప్‌ రాజ్యం) రాజధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొదటిసారి ప్లేగు వ్యాధి వచ్చింది. ఈజిప్టు నుంచి మెడిటెర్రెనియన్‌ సముద్రం మీదుగా ఈ వ్యాధి పాకిందని చరిత్రకారులు చెబుతున్నారు. బిజంటైన్‌ రాజధానిలో ప్రబలిన ఈ ప్లేగు వ్యాధి.. యూరప్‌తోపాటు ఆసియా, నార్త్‌ అమెరికా, అరేబియా దేశాలకు వ్యాపించింది. అప్పట్లో ఈ వ్యాధికి సరైన మందు లేకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ప్రాణాలు కాపాడమని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఏం చేయలేకపోయారు. దీంతో ప్లేగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రజలు చనిపోయి ఉంటారని అంచనా. అంటే దాదాపు ఆ కాలంలో అప్పటి ప్రపంచ జనాభాలో సగం అన్నమాట. క్రీస్తుశకం 541-542 కాలంలో దీని తీవ్రత ఎక్కువగా ఉండగా.. ఇది క్రీస్తుశకం 750 వరకు ఈ ప్లేగు విలయ తాండవం ఆడింది. ఆ తర్వాత నెమ్మదిగా కనుమరుగైంది. అయితే ఈ అంటువ్యాధి బారి నుంచి ఇతరులు ఎలా బయటపడ్డారన్న ప్రశ్నకు చరిత్రకారుల వద్దా సమాధానం లేదు. కానీ.. రోగనిరోధక శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే రోగం నుంచి బయటపడి ఉంటారని డిపాల్‌ యూనివర్శిటీ చరిత్ర అధ్యాపకులు థామస్‌ మోకైటీస్‌ చెప్పారు. చక్రవర్తి జస్టీనియన్‌ పాలించిన సమయంలో వ్యాధి రావడం, జస్టీనియన్‌కు ప్లేగు సోకి.. కోలుకోవడంతో దీనికి జస్టీనియన్‌ ప్లేగు అని పిలుస్తున్నారట. 

బ్లాక్‌డెత్‌(బుబోనిక్‌ ప్లేగు).. క్వారంటైన్‌కు నాంది
జస్టీనియన్‌ ప్లేగుకు కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా 800 సంవత్సరాల తర్వాత రూపాంతరం చెంది బుబోనిక్‌ ప్లేగుగా మళ్లీ ప్రజలపై విరుచుకుపడింది. బ్లాక్‌డెత్‌గా పిలిచే ఈ వ్యాధి 1347లో యూరప్‌ మొత్తం వ్యాపించింది. దీని బారిన పడి నాలుగేళ్లలో 20 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్రలో ఇదొక భయానక సంఘటన. అయితే ఈ వ్యాధిని ఎలా నయం చేయాలో తెలియకపోయినా ఒకరి నుంచి మరొకరిని వ్యాపిస్తుందని తెలుసుకున్న ప్రజలు వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్‌ చేయడం మొదలుపెట్టారు. వ్యాధి నిర్థారణ అయిన వ్యక్తులను ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు.. అప్పటి అధికారులు రోమన్‌ అధీనంలో ఉన్న ఓడరేవు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఓడల ద్వారా వచ్చిన వ్యక్తులను తొలుత ఐసోలేషన్‌లో ఉంచారు. 40 రోజులపాటు క్వారంటైన్‌ చేసిన తర్వాత వారికి వ్యాధి లక్షణాలు లేవని తేలితేనే రాజ్యంలోకి అనుమతిచ్చేవారు. అలా వ్యాధి సోకిన వాళ్లు మరణించగా.. ముందు జాగ్రత్తలు తీసుకున్నవారు బతికి బట్టగట్టారు. అయితే ఈ ప్లేగు అంత త్వరగా అంతం కాలేదు. పలుమార్లు యూరప్‌ దేశంపై పగబట్టినట్లు దాడి చేసింది. లక్షలమంది ప్రాణాలు బలితీసుకుంది.

ది గ్రేట్‌ ప్లేగు ఆఫ్‌ లండన్‌.. హోం క్వారంటైన్‌
యూరప్‌లో ప్లేగు వ్యాధి తాత్కాలికంగా మాయమైనా 1347-1666 మధ్య కాలంలో ప్రతీ 20 ఏళ్లకోసారి తన ఉనికి చాటుకునేది. 300 ఏళ్లలో 40 సార్లు ప్లేగు వ్యాధి సోకింది. ప్లేగు వచ్చిన ప్రతీసారి లక్షల మంది ప్రాణాలు కోల్పోయేవారు. క్రీస్తుశకం 1665లో ఇంగ్లాడ్‌లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ దేశ రాజధాని లండన్‌లో ఏడు నెలల వ్యవధిలో ఈ ప్లేగుకు లక్ష మంది బలయ్యారు. దీంతో ఆ దేశం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్లేగు వ్యాధి వ్యాప్తికి కుక్కలు, పిల్లులు కారణమని భావించి.. లక్షల సంఖ్యలో ఉన్న వాటిని చంపేశారు. (నిజానికి యెర్సీనియా పెస్టిస్‌ బాక్టీరియా సోకిన ఎలుక మనుషుల్ని కరిచినప్పుడు దాని ద్వారా ఈ ప్లేగు వ్యాధి వస్తుంది.)  ప్లేగు సోకిన వ్యక్తిని ఐసోలేట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ల ఇంటికి అధికారులు గుర్తులు పెట్టేవారు. ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరించారు. అలా తొలిసారి ఇళ్లలో ఉండే ప్రజలు హోం క్వారంటైన్‌ అయ్యారు. ఎవరైనా వ్యాధితో చనిపోతే వారిని ఇళ్లలోనే పూడ్చిపెట్టేవారు. వ్యాధి నిర్మూలనకు ఇంతకుమించిన మార్గం వారికి లేకుండాపోయింది. దీంతో క్రమేణా వ్యాధి వ్యాప్తి చెందడం తగ్గుముఖం పట్టింది.

మశూచి.. తొలిసారి వ్యాక్సిన్‌ వాడకం
యూరప్‌, ఆసియా, అరేబియా దేశాల్లో మాత్రమే మశూచి ఎక్కువుగా వస్తుండేది. మశూచి సోకిన ప్రతి పది మందిలో ముగ్గురు చనిపోతే.. మిగతా వారికి ఒంటినిండా చారలు పడి ప్రాణాలు దక్కేవి. అయితే 15వ శతాబ్దంలో యూరప్‌ అన్వేషకుల ద్వారా మశూచి అమెరికా, మెక్సికో దేశాలకు వ్యాపించింది. అక్కడి వారికి మశూచిని ఎదుర్కొనేంత రోగనిరోధక శక్తి లేకపోవడంతో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని శతాబ్దాల తర్వాత అంటే 1796 బ్రిటన్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ తొలిసారి మశూచికి వ్యాక్సిన్‌ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్‌ మశూచితో పోరాడే విధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ వ్యాక్సిన్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో మశూచి తగ్గుముఖం పట్టింది. అయితే ఈ వ్యాధి పూర్తిగా కనుమరుగు అవడానికి రెండు శతబ్దాలు పట్టింది. 1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ  భూమిపై మశూచి వ్యాధి పూర్తిగా తొలగిపోయిందని ప్రకటించింది. చరిత్రలో మనిషి కనిపెట్టిన వ్యాక్సిన్‌ ద్వారా వ్యాధి తగ్గడం ఇదే ప్రథమం.

కలరా.. పరిశుభత్రతోనే మాయం
19వ శతాబ్దం మొత్తం కలరా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. అన్ని దేశాల్లో విస్తరించి లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంది. 1846 నుంచి 1860 మధ్య కలరా యూరప్‌లో కూడా ప్రబలింది. యూరప్‌తోపాటు ఆఫ్రికా, అమెరికాకు కూడా పాకింది. మొదట్లో ఇది చెడు గాలుల ద్వారా వస్తుందని అందరు భావించారు. కానీ జాన్‌ స్నో అనే డాక్టర్‌ మాత్రం తాగు నీరులోనే వ్యాధి కారక క్రిములు ఉన్నాయని అనుమానించారు. అసలు కలరా ఎలా వస్తుందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ఆస్పత్రుల్లో కలరా రోగుల రికార్డులు పరిశీలించారు. ఎక్కడెక్కడ అధిక సంఖ్యలో కలరా వ్యాపించిందో ఆ ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. చివరకు ఒక ఆధారం లభించింది. లండన్‌లోని ఓ ప్రాంతంలో వీధి కుళాయి చుట్టుపక్కల నివసిస్తున్న 500 మంది కలరా బారిన పడటం స్నో గమనించారు. వీధి కుళాయిని పరిశీలించిన ఆయన నీరు కలుషితం కావడం వల్లే కలరా వస్తోందని గుర్తించారు. నిజానికి కలరా విబ్రియో కలరా అనే బాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బాక్టీరియా కలుషితమైన నీళ్లను ఆవాసం చేసుకుంటుంది. అలాంటి కలుషితమైన నీటిని తాగడంతో వ్యక్తుల్లోకి బ్యాక్టీరియా చేరి కలరా వస్తుంది. బాక్టీరియాపై అవగాహన లేకపోయినా స్నో స్థానిక అధికారులతో మాట్లాడి కుళాయిని తొలగించాడు. దీంతో స్థానికంగా కలరా వ్యాప్తి ఆగిపోయింది. స్నో ప్రయత్నం.. ఒక్కరాత్రిలో కలరాను అంతం చేయకపోయినా.. పరిశుభత్ర, మంచి నీరు కలుషితం కాకుండా చూడాల్సిన అవసరాన్ని ప్రపంచానికి తెలియజెప్పింది. తద్వారా పరిశుభ్రత పెరిగి.. కలరా వ్యాధి నిర్మూలనకు నాంది పలికింది.

స్పానిష్‌ ఫ్లూ.. వైద్యుల కృషా.. వైరస్‌ లక్షణమా!
స్పానిష్‌ ఫ్లూ.. ప్రపంచ చరిత్రలో ఇదో దారుణ అంకం. 1918లో స్పెయిన్‌ మొదలైన ఈ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా సోకింది. రెండేళ్ల పాటు అన్ని దేశాలపై విరుచుకుపడి 5 కోట్ల మంది ప్రాణాలు తీసింది. అయితే కాలక్రమేణా ఈ ఫ్లూ కనుమరుగైంది. ఫిలిడెల్ఫియాలో ఫ్లూ వ్యాప్తించిన కొత్తలో 4,597 మంది మృతి చెందారు. అయితే నెల రోజులలోపే ఫ్లూ పూర్తిగా తొలగిపోయింది. అయితే వైరస్‌ సోకిన తర్వాత బాధితులకు వచ్చే న్యూమోనియాకు వైద్యులు సరైన చికిత్స అందించి నయం చేశారని.. అందువల్లనే ఫ్లూ ప్రభావం తగ్గిందని కొందరు వాదిస్తుంటే.. ఫ్లూ రావడం.. కొన్నాళ్లపాటు ప్రభావం చూపించి వెళ్లడం సాధారణ విషయమేనని మరికొందరు వాదిస్తున్నారు. ఏదీ ఏమైనా రెండేళ్లలో ఈ స్పానిష్‌ ఫ్లూ పూర్తిగా కనుమరుగైంది.

వందేళ్లకో మహమ్మారి..

వందేళ్లకో మహమ్మారి..
22 Mar, 2020

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచం వణికిపోతోంది. కొన్ని రోజుల కిందట పక్క దేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి.. ప్రస్తుతం భారతదేశంలోకి ప్రవేశించి, ఇక్కడ కూడా తన ప్రతాపాన్ని చూపెడుతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశ యంత్రాంగం అప్రమత్తమైంది. 

ఈ మహమ్మారికి ఇంకా మందు కనుక్కోలేదని, టీకా కూడా లేదని, ముందస్తు జాగ్రత్తలతోనే దీనిని నివారించాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. అయితే, గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతి వందేళ్లకు ఓ మహమ్మారి ఇలా ప్రజల ప్రాణాలకు పెనుముప్పులా పరిణవిుంచాయని తెలుస్తోంది. మూడు పర్యాయాలు వచ్చిన ఆయా రకాల వ్యాధులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వ్యాధుల సరసన కరోనా (కోవిడ్‌–19) చేరిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

వణికించిన ప్లేగు 
క్షణాల్లో సోకే ప్లేగు వ్యాధిని మానవ వినాశనిగా చెప్పవచ్చు. నల్లని పెద్ద ఎముకల మూలంగా సోకే డిసీజ్‌ ఇది. ఈ వ్యాధి 1720 ప్రాంతంలో వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. క్రీస్తు పూర్వం 2,400 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టులో కనుగొన్న ఈ వ్యాధి 1894లో ఆగ్నేయ చైనాలో భయంకర భూకంపం ప్రబలినప్పుడు ఆహరధాన్యాల రవాణా, పరిసరాల కాలుష్యం, వలసపోయే వారి వల్ల ప్రపంచమంతటా వ్యాపించింది.

1895లో హాంకాంగ్‌ నుంచి వచ్చిన వారితో మనదేశంలోని బొంబాయి (ఇప్పటి ముంబై)తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లేగు ప్రబలింది. అప్పటినుంచి దాదాపు 20 ఏళ్లపాటు ఈ వ్యాధి వివిధ ప్రాంతాలను పీడించింది. 1898 నుంచి 1908 వరకు అంటే దాదాపు పదేళ్లలో ప్లేగు వ్యాధి వల్ల దేశంలో 5 లక్షల మంది చనిపోయారు. ఈ వ్యాధి బారిన పడి పారిస్‌ నగరంలోనే సుమారు 50 వేల మంది మృత్యువాత పడినట్లు చెబుతుంటారు. 

1820లో కలరా..
ప్లేగు వ్యాధి సృష్టించిన బీభత్సం తర్వాత కలరా వ్యాధి సోకింది. ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో ప్రబలిన ఈ వ్యాధి బారిన పడి లక్షల మంది మృత్యువాత పడ్డారు. కలరా వ్యాధిని అతిసార వ్యాధి అనికూడా పిలుస్తుంటారు. ‘విబ్రియో కలరే’అనే సూక్ష్మ క్రిమి కారణంగా కలరా సోకుతుంది. దేశంలోని కోల్‌కతా నగరంలో తొలిసారి కలరా ప్రబలింది.

అయితే, దేశంలో ఇదివరకే చాలాసార్లు కలరా వచ్చినప్పటికీ 1820లో మాత్రం యూరప్‌ వరకూ వ్యాపించింది. ఆసియా, యూరప్‌ ఖండాలను వణికించింది. ఆగ్నేయ ఆసియా దేశాలు కలరా మూలంగా వణికిపోయాయి. ఈ వ్యాధి కారణంగా లక్ష మందికి పైగానే చనిపోయారు. బ్యాక్టీరియాతో కలుషితమైన చెరువు నీటిని తాగి ప్రజలు ఈ వ్యాధి బారిన పడ్డారు. దేశాన్ని వణికించిన కలరా గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం.

1920లో స్పానిష్‌ ఫ్లూ..
కలరా వ్యాధి వచ్చిన మరో వందేళ్లకు అంటే 1920లో స్పానిష్‌ ఫ్లూ వైరస్‌ వచ్చింది. ఈ వైరస్‌ పేరు చెబితేనే ఇప్పటికీ భయపడతారు. సృష్టిలోనే అతిపెద్ద విషాదం మిగిల్చిన భయంకర వ్యాధిగా స్పానిష్‌ ఫ్లూ మిగులుతుంది. ప్రపంచ చరిత్రలోనే అత్యధిక ప్రాణాలు బలిగొన్న వైరస్‌గా ఇప్పటికీ దీనిని పరిగణిస్తారు. 100 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడగా సుమారు కోటి మంది మృతి చెందారు. 

ప్రస్తుతం కరోనా..
స్పానిష్‌ ఫ్లూ వైరస్‌ వచ్చిన వందేళ్ల తరువాత ప్రస్తుతం మనం ఇప్పుడు వింటున్న కరోనా వైరస్‌ వచ్చింది. చైనా దేశంలోని వూహాన్‌ నగరంలో వెలుగుచూసిన ఈ వైరస్‌ ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడి సుమారు 8 వేల మంది మృతి చెందినట్లు అంచనా. 

దేశంలో కూడా చాలా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఆలయాలు మూసివేశారు. పరీక్షలను వాయిదా వేస్తున్నారు. వివాహాలను నిలిపివేస్తున్నారు. బహిరంగసభలు, సమావేశాలు, షాపింగ్‌ మాల్స్, థియేటర్లపై ఆంక్షలు విధిస్తున్నారు. ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం రద్దు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల్లోకి భక్తులను రానీయడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం అవుతోంది. కోవిడ్‌–19కి కచ్చితమైన చికిత్స కానీ, టీకా కానీ లేదు. ప్రపంచం కనీవినీ ఎరుగనీ ఈ ముప్పును ఎదుర్కొవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం తప్ప మరోటి లేదు.

మహాయుద్ధంలో మానవుడే విజేత

మహాయుద్ధంలో మానవుడే విజేత
Apr 4 2020 @ 00:26AM

సమకాలీన ప్రపంచంలో ‘శక్తిమంతులయిన’ నాయకులకు కొదవేమీ లేదు. అయితే వారిలో ఏ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్ట లేకపోతున్నారు? కరోనా మహమ్మారిపై మానవాళి అంతిమంగా విజయం సాధిస్తుందా? మానవాళి జయించి తీరుతుంది. నియంతలు, క్రూర పాలకుల నుంచేగాక అలా రాజ్యాధికారాలను చెలాయించాలని ఆరాటపడుతున్న వారినుంచి కూడా మానవాళి తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించుకుంటుంది. ఇది తథ్యం.

కరోనా వైరస్ లేదా కొవిడ్ -19 ప్రతాపానికి 205 దేశాలు అల్లకల్లోలమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్ల డించింది. సృష్టిలోని అతి సూక్ష్మ జీవి వైరస్. జీవి జీవ కణాల్లో మాత్రమే అది తనను తాను పునరుత్పత్తి చేసుకొంటుంది. బాక్టీరీయాతోసహా సృష్టిలోని ప్రతిజీవిని వైరస్‌లు సోకుతాయి

కొత్త కరోనా వైరస్‌ కారణంగా ప్రబలిన ఒక మహా అంటువ్యాధికి కొవిడ్ -19 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. ఈ ‘కొత్త’ వైరస్ జాడను తొలుత గుర్తించింది లీ వెన్లియాంగ్ అనే ఒక చైనీస్ డాక్టర్. గత డిసెంబర్‌లో ఆయన ప్రప్రథమంగా కరోనా వైరస్ గురించి ప్రపంచానికి వెల్లడించాడు. అయితే చైనా ప్రభుత్వం ఆయన్ని నానా వేధింపులకు గురిచేసింది! దురదృష్టవశాత్తు డాక్టర్ లీ సైతం కొవిడ్ -19 బారిన పడ్డాడు. 2020 ఫిబ్రవరి 7న మరణించాడు. అప్పుడు ఆయన వయస్సు 33 సంవత్సరాలు (డాక్టర్ లీ మరణానంతరం ఆయన పట్ల తాము వ్యవహరించిన తీరుకు చైనా అధికారులు క్షమాపణలు చెప్పారు). ఈ కీర్తిశేషుడు గుర్తించిన కొత్త వైరస్ 100 రోజులలోగానే భయంకర దావానలంలా ధరిత్రి నలుమూలలకీ వ్యాపించింది. ఏ దేశ సరిహద్దులనూ ఎంత శక్తిమంతమైన సైన్య మూ కొవిడ్ -19ని నిలువరించలేదు. జాతీయ సరిహద్దులను ఈ సూక్ష్మ క్రిమి గుర్తించదు గాక గుర్తించదు. కుల మతాలు, జాతి, జెండర్, పుట్టిన ప్రదేశం, సామాజిక వర్గం ప్రాతిపదికన ఏ స్త్రీ, పురుషుడి పట్ల అది ఎలాంటి వివక్ష చూపదు. భారత రాజ్యాంగంలోని 14, 15 అధికరణలను కరోనా వైరస్ పరిపూర్ణంగా గౌరవిస్తుంది, కాకపోతే ఒక అహేతుక రీతిలో!

ఈ భూమిపై అత్యంత శక్తిమంతమైన వ్యక్తి (అని ఎంతో మంది అంటున్న) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం తన ప్రజలను కరోనా మహమ్మారి బారిన పడకుండా రక్షించడంలో నిస్సహాయుడైపోయారు. ఏప్రిల్ 3న ఈ వ్యాసం రాస్తున్న సమయానికి అమెరికాలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,13,600కి మించిపోయింది. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో సంభవించే మరణాలసంఖ్య హీనపక్షం 1,00,000 నుంచి 2,40,000 మధ్య వుండగలదని అంచనా. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యం సైతం కరోనాను ఏమీ చేయలేకపోతోంది. అమెరికా కూడబెట్టుకున్న అపార సిరిసంపదలు కొవిడ్ -19 నెదుర్కొనే విషయంలో నిష్ప్రయోజనమైపోతున్నాయి. డాలర్ విలువ పెరిగింది. అయితే ‘బలహీన’ యూరో లేదా యువాన్ వలే ‘బలమైన’ డాలర్ కూడా కరోనా ముందు శక్తిహీనమైపోయింది.

ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రభుత్వాధినేతలు (ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైనవారు, ప్రజాస్వామ్యేతర మార్గాలలో అధికారాన్ని కైవశం చేసుకున్నవారు) ప్రజల సమ్మతితో పాలించాలని కాకుండా, అధికారాన్ని చెలాయించేందుకు ఆరాటపడుతున్నారు. ‘ప్రతి ఒక్కరిపైన, ప్రతి దానిపైన అధికారాన్ని చెలాయించేంతవరకు ఒక రాజు సంతృప్తి చెందడని’ సమకాలీన పాశ్చాత్య విజ్ఞుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇది నిండు సత్యం. దురదృష్టవశాత్తు సమకాలీన ప్రభుత్వాధినేతల విషయంలో కూడా ఇదొక పరిపూర్ణ సత్యం. రబ్బర్ స్టాంప్ పార్లమెంటులు, ఆశ్రిత న్యాయ స్థానాలు, సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వ సంస్థలు, మాట జవదాటని అధికార గణం, గూఢచారులు, రాజకీయ ప్రత్యర్థులను ఎటువంటి ఆరోపణలు లేకుండానే నెలలు, సంవత్సరాలు తరబడి జైళ్ళలో నిర్బంధించడం మొదలైనవన్నీ బోలు చర్యలే. 

యావత్ప్రంచమూ ఒక బందీఖానాగా మారిపోవడమూ, తాము ఒకే కారాగారంలోవున్నట్టు పీడకులు, పీడితులూ తెలు సుకోవడం విచిత్రంగా లేదూ? పీడకులైన పాలకులకు మీరీ విషయాన్ని గుర్తు చేయండి. మీరు లాక్‌డౌన్‌లో వున్నారు గనుక మీరు ఆడగల ఒక ఆటను సూచిస్తాను. ప్రపంచ భౌగోళిక పటంనొకదాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులలో ఎవరినైనా ఒకో దేశాన్ని గుర్తించమని అడగండి. వారిని ఒక ప్రశ్న అడగండి: నీవు గుర్తించిన దేశం ఎటువంటి అభియోగాలు మోప కుండా ప్రజలను జైళ్ళలో నిర్బంధించిందా? ఇవిగో మీకు లభించే సమాధానాలు. దక్షిణ అమెరికా ఖండంతో ప్రారంభమవుతాం. 

వెనిజువెలా: దేశాధ్యక్షుడు నికోలస్ మదురోకు విధేయంగా వ్యవహరించే ఈ దేశ న్యాయవ్యవస్థ 30మంది ప్రతిపక్ష నాయ కులకు పార్లమెంటరీ సభ్యత్వ హక్కులను రద్దు చేసింది. మరి కొంతమంది ప్రవాసానికి వెళ్ళిపోయారు లేదా జైలులో మగ్గిపోతున్నారు. 

ఆఫ్రికాలో పరిస్థితులు మరింత ఘోరంగా వున్నాయి.

ఇథియోపియా: 2018లో అబియి అహ్మద్ ప్రధానమంత్రి అయ్యాడు. పొరుగుదేశం ఎరిట్రియాతో సుస్థిర శాంతిని నెలకొల్పాడు. నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందాడు. 2019లో ఇంటర్నెట్‌పై సంపూర్ణంగా ఆంక్షలు విధించాడు. చట్ట విరుద్ధంగా 64మంది హత్యకు గురయ్యారని, కనీసం 1400మంది ఎటువంటి అభియోగాలు లేకుండా జైలుపాలయ్యారని ఒక ఎన్‌జిఓ వెల్లడించింది. 

టాంజనియా: ప్రతిపక్ష ఎంపీలు, ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులను దేశాధ్యక్షుడు జాన్ మగుఫలి ఆదేశాలపై అరెస్ట్ చేశారు. వివిధ మీడియా సంస్థలను మూసివేయించారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని అణచివేసేందుకు జాన్‌ మగుఫలి చట్టాలను తీసుకు వచ్చాడు.

ఐరోపాలో మిశ్రమ పరిస్థితులు కన్పిస్తాయి. ఆ ఖండంలో దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు వర్ధిల్లుతున్నాయి. అయితే అక్కడ ఇటువంటి దేశాలు కూడా వున్నాయి:


హంగరీ: కార్యనిర్వాహక, శాసన, న్యాయవ్యవస్థల అధికారాలన్నిటినీ ప్రధానమంత్రి విక్టర్ అర్బాన్ తన చేతుల్లో కేంద్రీ కరించుకున్నాడు. ఆయన ప్రభుత్వం సెంట్రల్ యూరోపియన్ యూనివర్శిటీని మూసివేసింది. ఇంటర్నెట్‌పై పన్ను విధించింది. తలుచుకున్న విధంగా డిక్రీల జారీ ద్వారా పాలించే అధికారాలను సైతం నాలుగురోజుల క్రితం విక్టర్ సాధించుకున్నాడు. 

రష్యా: తాను మళ్ళీ దేశాధ్యక్షుడుగా ఎన్నికయ్యేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణకు ఆమోదం పొందడంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజయవంతమయ్యారు. దీనిపై మాస్కోలో వేలాది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపగా పోలీసులు రెండువేలమందికి పైగా నిరసనకారులను నిర్బంధంలోకి తీసుకున్నారు. పలువురిపై క్రిమినల్ కేసులు మోపారు. రాజకీయ ప్రత్యర్థుల అరెస్ట్, పోలీస్‌ అధికారుల హింసాకాండ, బాలల నిర్బంధం, తల్లిదండులకు బెదిరింపులు రష్యాలో నేడు నిత్యకృత్యాలైపోయాయి. రష్యాలో 200మందికి పైగా రాజకీయ ఖైదీలువున్నారు. ఆసియా ఖండంలో కొన్ని దేశాలను ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పే పరిస్థితి లేదు. 

థాయిలాండ్: ప్రధానమంత్రి ప్రయుత్ చాన్ ఓ చా ప్రభుత్వం 2019లో అధికారానికి వచ్చింది. దరిమిలా రాజకీయ కార్యకర్తలపై భౌతికదాడులు ముమ్మరమయ్యాయి. మానవ హక్కుల కార్యకర్తలు అదృశ్యమవ్వడం ప్రారంభమయింది. పౌర హక్కుల అణచివేత తీవ్రమయింది. 

కంబోడియా: 2018 పార్లమెంటరీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగలేదు. ప్రధాన ప్రతిపక్షాన్ని నిషేధించారు. పలు వురు ప్రతిపక్ష నాయకులను జైళ్ళకు పంపించారు లేదా నిర్బంధ ప్రవాసానికి పంపించారు. మీడియా, పౌర సమాజ సంస్థలపై ఆంక్షలు విధించారు. అన్ని స్థానాలలోనూ పాలకపక్షమే విజయం సాధించింది. 

ఈ పరిస్థితులు మీకు నిరాశానిస్పృహలను కలిగిస్తున్నాయి కదూ? అయినా మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. సమకాలీన ప్రపంచంలో ‘శక్తిమంతులైన’ నాయకులకు కొదవేమీ లేదు. అయితేవారిలో ఏ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తిని ఎందుకు అరికట్ట లేకపోతున్నారు? కరోనా మహమ్మారిపై మానవాళి అంతిమంగా విజయం సాధిస్తుందా? ఇటువంటి సందేహానికి తావులేదని, మానవాళి ఈ సంక్షోభాన్ని సంపూర్ణంగా అధిగమిస్తుందని ప్రముఖ తమిళకవి వైరముత్తు విశ్వసిస్తున్నారు. కరోనా వైరస్ పై ఆయన ఒక అందమైన కవిత రాశారు. దాని స్వేచ్ఛానువాదమిది: ‘అణువు కంటే చిన్నది/ అణు బాంబు కంటే భయంకరమైనది/ నిశ్శబ్దంగా ప్రవేశిస్తుంది/ యుద్ధం లేకుండా సమస్తాన్ని వినాశనం చేస్తుంది.... మానవుడు కరోనా వైరస్‌ను నిర్మూలిస్తాడు/ ఆ మహమ్మారిని జయిస్తాడు’. అవును, కరోనా వైరస్‌పై యుద్ధంలో మానవాళి జయించితీరుతుంది. నియంతలు, క్రూర పాలకుల నుంచేగాక అలా రాజ్యాధికారాలను చెలాయిం చాలని ఆరాటపడుతున్న వారినుంచి కూడా మానవాళి తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సంరక్షించుకుంటుంది. ఇది తథ్యం.








పి. చిదంబరం

కరోనా విజేత మానవుడే!

కరోనా విజేత మానవుడే! 
21 Apr, 2020 00:06 IST



‘‘అంటువ్యాధులతో మానవుడి పందెం ఈ రోజుది కాదు సుమా! ఈ భూతలంపై కొండలు, కోనల పుట్టుకతోనే మానవుడి జీవితం ముడిపడి ఉందని మరచిపోరాదు. ఈ విషయం ఘనాపాటీల రచనల్లో, కవితల్లో నిక్షిప్తమై ఉన్నవే’’.
– అర్ఘ్యకుమార్‌ బెనర్జీ, డీన్‌ ఆఫ్‌ ఆర్ట్స్, కోల్‌కతా

‘‘అంటు రోగాల వ్యాప్తి గురించిన ఉబు సుపోని, నిర్హేతుకమైన గుడ్డి నమ్మకాల నుంచి ప్రజల్ని విముక్తి చేయడం విజ్ఞాన శాస్త్రం ధర్మం. రోగాలు, రొష్టులు పనిగట్టుకుని ఫలానా జాతినో, ఫలానా ప్రాంతాన్నో, దేశాన్నో కావాలని వివక్షతో ఎంచుకోవు. అంటు వ్యాధులకు కావలసింది లేదా అవి ఆశ్రయించేది మానవ శరీరాన్ని– శీతోష్ణస్థితి గతులతో సంబంధం లేకుండా బలి ష్టమైన పోషకాలు లభించే మానవ శరీరాన్ని. దురదృష్టవశాత్తు వ్యాధి కారక పరాన్న జీవుల్ని గురించిన సశాస్త్రీయమైన వైజ్ఞానిక విజయాలకు సంబంధించిన అవగాహనను పక్కకు నెట్టేసి.. శాస్త్ర సాంకేతిక, వైద్య, వైజ్ఞానిక దృష్టిని కొందరు పక్కదారులు పట్టిస్తున్నారు’’.
– అమితాంగ్షు ఆచార్య, పీఏడీ స్కాలర్, ఎడింబరో, ఇంగ్లండ్‌ 

కత్తిని కత్తి రద్దు చేస్తుంది, యుద్ధం యుద్ధాన్ని జయిస్తుంది, అమా నుష వ్యాధిని శరీరంలోని విరోధ వ్యాధి లక్షణాలు లేదా ప్రతికూల క్రిములు (యాంటీ బాడీస్‌)ను సృష్టించడం ద్వారా నిర్మూలమవు తాయి. ఈ అనుకూల, ప్రతికూల క్రిముల సృష్టి రహస్యాన్ని జీవశాస్త్ర వైజ్ఞానిక పరిశోధనల ఫలితమేనని మరచిపోరాదు. జన్యు లక్షణాల మార్పిడిగానీ, మానవ శరీరంలో అనుకూల ప్రతికూల జన్యువులను, వాటి లక్షణాలను కనిపెడుతూ అనుకూల జన్యువుల సంరక్షణ కోసం జీవశాస్త్ర పరిశోధకులు అనునిత్యం తమ కళ్లను, మెదళ్లను పదును పెట్టుకున్న దాని ఫలితమే– టీకాలు, ఇంజక్షన్ల సృష్టి. మానవాళిని చరిత్రలో ఆరోగ్యపరంగా శతాబ్దాల తరబడి కకావికలు చేసి వదిలిన చిన్నవి, పెద్దవి మహమ్మారులు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా ప్రపంచ దేశాలను పీడిస్తున్న మహమ్మారి ‘కరోనా’ వ్యాధి... గత కాలంలో కోట్ల సంఖ్యలోనే ప్రజల ప్రాణాలు తీసిన అంటువ్యాధు లకన్నా పెద్దది కాకపోయినా ప్రతి వందేళ్లకు వచ్చే ప్రమాదకర వ్యాధుల్లో ఒకటి.

వ్యాధుల కారణాలు అనేకం– ప్రకృతిని మచ్చిక చేసుకుని తన బతుకు తీర్చిదిద్దుకునే క్రమంలో పర్యావరణ స్పృహను కోల్పోయి, సంపదపై ఆబ కొద్దీ బడుగుజీవుల బతుకుదెరువును గాలికి వదిలి వేయడం, అందుకు పాలకవర్గాలు, ప్రభుత్వాలూ సహ కరించి, తమ ప్రలోభాల్ని ఈడేర్చుకోవడమూ చాపకింద నీరులా విధ్వంసకాండ జరిగి పోతూండటమూ. అయితే, ప్రతి నూరేళ్లకొకసారి తీవ్రస్థాయి అంటువ్యాధులు, కరోనాలాంటి మహమ్మారులు ‘దొంగ చాటు దూరబంధువుల్లా’ మానవాళిని కబళిస్తున్నాయి. యుద్ధాలు, క్రిమియుద్ధాలు, భారీ అణ్వస్త్ర ప్రయోగాలు వెదజల్లే ధూళిధూసరితా లవల్ల వాతావరణ కాలుష్యాల ద్వారాను ఇవి విస్తరిస్తున్నాయి. అయితే తిరిగి వీటిని అదుపుచేసి ప్రగతిరథాన్ని ముందుకు నడిపించుకోవ లసినవాడూ ఈ మానవుడేనని మరచిపోరాదు. తన ఉనికిని, మాన వాళి ప్రగతికి ఎదురయ్యే మహమ్మారులను తన అమోఘమైన శాస్త్ర పరిజ్ఞానంతోనే అదుపుచేసి తొలగించుకుంటూ ముందుకు దూసుకు పోతున్న ఈ మానవుడే తిరిగి మహనీయుడుగా అవతరిస్తున్నాడు. 

ఆ మహనీయతను చరిత్రలో తొలిసారిగా సాధించినవాడు క్రీస్తు పూర్వం 400 ఏళ్లనాడు హిప్పోక్రటీస్‌. ఈయన ప్లాటో, సోక్రటీస్, బుద్ధుని కాలంనాటివాడు. మనం చెప్పుకునే ఆధునిక వైద్య పితా మహుడు ఆనాటి హిప్పోక్రటిస్‌. గ్రీస్‌వాడైన ఆయన రచనల్ని, పరి శోధనల్ని కనుమరుగవకుండా కాపాడినవారు అరబ్బులేనని మరవ రాదు. అలా ఆయన గ్రీక్‌ వైద్య విధాన సూత్రాలను అరబ్బులు భద్ర పరచకపోతే ఆ రచనలు ఎప్పుడో కనుమరుగు అయ్యేవి. తన వైద్య విధానాన్ని హిప్పోక్రాటిస్‌ నాలుగు భాగాలు చేసి వాటికి ‘నాలుగు హాస్యాలు’ (హ్యూమర్స్‌) అని పేరుపెట్టాడు. అందరికీ బోధపడటం కోసం అవి: రక్తం, కాలేయంలో ఊరే పైత్య రసం, పచ్చరసం (కామెర్లు), కఫం లేదా శ్లేష్మం అని విభజించాడు. వ్యాధి తీరు తెన్నులనుబట్టి శరీరంలో సమతుల్యత నిర్ధారణ అవుతుందన్నాడు. వీటి సమతుల్యతమీదనే మనిషి చావు బతుకులు ఆధారపడి ఉంటాయిగానీ ఏ మంత్ర తంత్ర శక్తి వల్లనో నిర్ధారణ కావని తేల్చాడు. హిప్పోక్రాటిస్‌ వాడిన వైద్య పదాలన్నీ గ్రీసు పదాలే. వ్యాధుల గుణాల్ని క్రానిక్, ఎపెడిమిక్, ఎండెమిక్, గైనిక్, కార్డియా (గుండె), యుథనేసియా, ఆఫ్తాల్మస్, పిడియాట్రిక్స్‌.. ఈ పదసృష్టి అంతా హిప్పోక్రాటిస్‌ ధర్మమే సుమా! అంతేగాదు, వైద్యాన్ని, వైద్య శాస్త్రాన్ని మతం నుంచి వేరు చేసిన తొలి వైద్య శిఖామణి కూడా హిప్పోక్రాటిసే. 

‘కరోనా’ మహమ్మారిని ఇంతకుముందు పలు చిన్న, పెద్ద అంటు వ్యాధుల్ని కట్టడి చేసిన పద్ధతుల్లోనే అణచివేసి మానవుడే మహనీయుడని నిరూపించుకునే ఘడియ లకు చాలా దగ్గరలోనే ఉన్నాడని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుచూపు మేరల్లోనే కరోనాపై మానవుడు అంతిమ విజేత కాబోతు న్నాడు. ఇందుకు ప్రపంచంలో దాదాపు 280 కోట్ల జనాభాకు ప్రాతి నిధ్యం వహిస్తున్న భారత్‌–చైనా శాస్త్రవేత్తల, వైద్య పరిశోధకుల తొలి ప్రయత్నంగా ‘ప్లాస్మా థెరపీ’పై చేస్తున్న ప్రయోగాలు విజయవంత మయ్యే దశలో, కొద్ది మాసాల్లోనే ఫలప్రదమైన టీకాలు, ఇంజక్షన్ల రూపంలో బయ టపడే అవకాశాలు పెరిగాయి. దీనికి కారణమూ, ప్రేరణా కరోనా వ్యాధి వ్యాప్తి సందర్భంగా తొలి ప్రయోగ బాణంగా క్యూబా, చైనా, సోషలిస్టు దేశాలు వదిలిన ‘ప్లాస్మా చికిత్స’ విధానం.

నిరూపిత మైనంతవరకు దీని వైశిష్ట్యం–కరోనా వ్యాధి నుంచి కోలుకునే రోగు లకు, ప్లాస్మా (రక్తం) ఎక్కించి రోగ నిరోధానికి తోడ్పడే యాంటీ బాడీస్‌ (ప్రతికూల జన్యు కణాలు)ను తయారు చేయడం. ఈ యాంటీ బాడీస్‌ను రూపొందించడానికి ముందుకొచ్చే ‘ఫార్మా’ సంస్థలకు లైసెన్స్‌ ఇవ్వడానికి భారత వైద్య పరిశోధనా కేంద్రం ముందు కొచ్చింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రీయ సంస్థ ప్రకటిస్తే.. యాంటీబాడీస్‌ కలిగిన ప్లాస్మాను ఎక్కించడం ద్వారా ముగ్గురు కరోనా రోగులు కోలుకోగా, మరో ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ప్లాస్మాను ప్రయోగించిన మరో నలుగురు రోగులు పూర్తిగా కోలుకున్నారని కూడా కేంద్ర పరి శోధనా సంస్థ ఈ నెల 18న వెల్లడించింది. 

అందుకే సీసీఎంబీ డైరెక్టర్, శాస్త్రవేత్త రాకేశ్‌ మిశ్రా, నిర్వీర్యం చేసిన సూక్ష్మజీవితోనే టీకా (ప్లాస్మా చికిత్స) తయారీ సులువే అనే నిర్ణయానికి వచ్చి మూడునెలల్లోనే ప్రతికూల వైరస్‌ను ఉత్పత్తి చేస్తా మని భరోసా కల్పించారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసిన వైరస్‌లు ఒకటీ, ఆరా కాదు. ప్రధాన వైరస్‌ల పెక్కింటి ‘పుట్టెంట్రుకలు’ లెక్కపెట్టాలంటే.. క్రీ.శ. 165 నుంచి 180 దాకా, ఆ పిమ్మట 1919–1920 నుంచి ఈరోజు, శతాబ్ది మహ మ్మారిగా మారిన కరోనా వరకు వస్తూ పోతూనే ఉన్నాయి. దాదాపు వీటిలో పెక్కు వైరస్‌లు ‘ఫ్లూ’కు చిన్నా, పెద్దా తోబుట్టువులే. ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోనియో, సార్స్‌–2, కోవిడ్‌– 19 వరకు ఏదో ఒక రూపంలో ఇది  రాజకిరీటంలా నూతన మండ లాన్ని చుట్టిన కాంతి వలయంలా ఉన్నందున బ్రిటిష్‌ వైరాలజిస్టు డాక్టర్‌ డేవిడ్‌ టిర్రెల్‌ ఈ వైరస్‌లకు (1964–66) కరోనా వైరస్‌లు అని పేరు పెట్టాడు. 

ఇలా స్పానిష్‌ ఫ్లూ నుంచి ఏషియన్‌ ఫ్లూ (1957), ఎయిడ్స్‌ వ్యాధి కారక వ్యాధి మూలమైన హెచ్‌ఐవి, సార్స్‌ వైరస్‌ దాకా సామ్రాజ్య యుద్ధ కారణాల ఫలితంగా వాతావరణ కాలుష్యం ఆధారంగా పుట్టి పెరుగుతూ వచ్చిన వైరస్‌లే. ఎయిడ్స్‌ కారక మూలం హెచ్‌ఐవీ వైరస్‌ పుట్టి పెరిగింది ఆఫ్రికా ఖండంపై అమెరికా సామ్రాజ్యవాదం సాగిం చిన సైనికదాడి ఫలితం. అమెరికా సైనికులు సంసారాలకు దూరంగా సంవత్సరాల తరబడి ఆఫ్రికాలో గడపడం కారణంగా అక్కడి గొరి ల్లాలతో పెట్టుకున్న సంపర్కం వల్ల అంటించుకువచ్చిన  వ్యాధికి మరోపేరే హెచ్‌ఐవి. దాని మరోపేరు ఎయిడ్స్‌. అయితే దాన్ని ఆఫ్రికా వ్యాధి అని పేరుపెట్టి ఆ దేశానికి అంటగట్టలేము. అలాగే చైనాలోని వూహాన్‌ మార్కెట్‌లో మాంసాహారం తిన్న వారి నుంచి పుట్టిన కరో నాను చైనీస్‌ వైరస్‌ అని ట్రంప్‌లాగా ఒక దేశానికి అంటగట్టలేము. ఇంతకూ ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. అమెరికా సైనికులు ఆఫ్రికా చింపాంజీలతో సంపర్కంద్వారా పుట్టుకొచ్చిన హెచ్‌ఐవీ(ఎయిడ్స్‌) సంబంధిత వ్యాధుల వల్ల ప్రపంచంలో చని పోయిన వారి సంఖ్య 4 కోట్ల 48 లక్షలని అంచనా. ఇప్పటికి కరోనా వైరస్‌ విస్తృతిలో ప్రపంచ జనాభాలో సగంపైగా (450 కోట్లు) వ్యాధి గ్రస్తులు కాగా, మరణించిన వారి సంఖ్య  1,66,000కు చేరుకుంది.

సరిగ్గా ఈ సందర్భంలోనే, భారతదేశంలో ప్రజారోగ్య రక్షణ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందువల్లనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, క్వారంటైన్‌లో ఉన్న బాధితు లలో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండలేక పారిపోతున్నారని అంతర్జాతీయ జర్నల్‌ లాన్స్‌ట్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఇందుకు కారణం దేశ జాతీయోత్పత్తుల విలువలో కేవలం 1.5 శాతం మాత్రమే ఆరోగ్యరంగంపై కేంద్రప్రభుత్వం ఖర్చు చేస్తోందని మిగతా జనాభా అంతా ప్రయివేట్‌ ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోందని రాసింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇలాంటి పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ జానన్‌ హికెల్‌ అనే ప్రపంచ ప్రసిద్ధ వ్యాఖ్యాత ఈ రకంగా వ్యంగీ కరించాడు. ‘పెట్టుబడిదారీ వ్యవస్థ 34 రకాల ఖరీదైన వెరైటీ డ్రెస్సులూ, 40 రకాల రోస్టులూ, టోస్టులనే కాకుండా.. యుద్ధాల కోసం 16,000 కిలోమీటర్ల దూరం వెళ్లి దాడి చేయగల ఖండాంతర క్షిపణుల్ని సిద్ధం చేయగలదు కానీ, ఏ కారణంవల్లో మౌలిక ప్రజారోగ్యానికి అవసరమైన మాస్క్‌లను, వెంటిలేటర్లను మాత్రం ఉత్పత్తి చేయలేకపోతోంది. అదీ అసలు రహస్యం.’


ఏబీకే ప్రసాద్‌

చైనాలో ఆటవిక భక్షణ

ఆటవిక భక్షణ
చైనాలో కరోనా జన్మరహస్యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ను ‘చైనా వైరస్‌’గా వర్ణిస్తుంటే, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపేయో దాన్ని ‘వుహాన్‌ వైరస్‌’ అని పిలుస్తున్నారు. అమెరికా నాయకులు తమను అప్రతిష్ఠ పాల్జేస్తున్నారని చైనా మండిపడుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో గబ్బిలం మాంసం తిన్న ఒక వ్యక్తి నుంచి కొవిడ్‌ 19 వైరస్‌ అందరికీ పాకింది. అది నిజం కాదని బుకాయించే బదులు అన్ని రకాల జంతువుల మాంస విక్రయశాలలను మూసేసి ఉంటే చాలా బాగుండేది. గబ్బిలాలు, పాములు, పునుగు పిల్లులు, అలుగులు, ముళ్లపందుల వంటి అడవి జంతువులే కాదు- పిల్లులు, కుక్కల వంటి పెంపుడు జంతువుల మాంసాలనూ చైనీయులు ఆబగా ఆరగించడమే కరోనా మహమ్మారికి మూలకారణం. అత్యధిక దేశాల్లో ఆవు, కోడి, మేక, గొర్రె, పంది మాంసాలను భుజించడం ఆనవాయితీ. కానీ, చైనీయుల్లా కనిపించిన ప్రతి జంతువునూ తినేయడం అరుదు. ఇతర దేశాల్లో అలాంటి అలవాటు చాలా కొద్ది ఆటవిక తెగల్లోనే గమనించవచ్చు. చైనాలో అడవి జంతువుల మాంసం అందరికీ లభించదు. దాన్ని సంపన్నులు మాత్రమే కొనగలరు. గబ్బిలం, అలుగుల మాంసం తింటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందనే నమ్మకంతోనే చైనా ధనికులు ఇలాంటి పనులకు దిగుతున్నారు. వారి విడ్డూరపు అలవాట్ల వల్ల భారత్‌తో పాటు అనేక దేశాల్లో పులులు, ఖడ్గమృగాలు అంతరించిపోతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ సమస్త మానవాళి మనుగడకే ముప్పుతెస్తోంది. అసలు నవంబరు చివరివారం నుంచి డిసెంబరు మొదటివారం లోపే వుహాన్‌లో కరోనా కేసులు బయటపడిన సంగతిని చైనా చాలాకాలంపాటు ఎందుకు దాచినట్లు? కరోనా వైరస్‌ పలువురికి వ్యాపిస్తున్న సంగతిని తన వాట్సాప్‌ గ్రూపులో తొలిసారిగా బయటపెట్టిన చైనా వైద్యుడిని తీవ్రంగా మందలించారు. కొన్ని వారాల తరవాత ఆ వైద్యుడు మరణించాక ఆయనకు గొప్పతనాన్ని గుర్తించారు. కరోనా విషయం బయటకు పొక్కకుండా అనేకమంది వైద్యులు, నర్సులు, పాత్రికేయులను కటకటాల పాల్జేశారు. దాచడానికి ఏమీ లేకపోతే చైనా ఇన్ని కపట నాటకాలు ఎందుకు ఆడినట్లు?

అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ సైతం ఈ దుర్వార్తను ముందుగానే ప్రపంచానికి ఎందుకు వెల్లడించలేదు? కరోనా వైరస్‌ విరుచుకుపడిన సంగతిని తైవాన్‌ అధికారికంగా డాక్టర్‌ టెడ్రోస్‌కు తెలియజేసినా, ఆయన ఎందుకు మిన్నకున్నట్లు? తైవాన్‌ లేఖను ఆయన తొక్కిపట్టారు. డాక్టర్‌ టెడ్రోస్‌ మాతృదేశమైన ఈజిప్ట్‌లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టిందని ఇక్కడ గమనించాలి. బహుశా టెడ్రోస్‌కు డబ్ల్యూహెచ్‌ఓ పదవి లభించడం చైనా చలవేనేమో? చైనాతోపాటు అనేక ఆగ్నేయాసియా దేశాల ప్రజలు కుక్క మాంసమే కాకుండా రకరకాల జంతు    మాంసాలను తింటారన్నది బహిరంగ రహస్యమే.

కొవిడ్‌ 19 వుహాన్‌లో పుట్టలేదని, ఆ వైరస్‌ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనీయులూ ఆరోపిస్తున్నారు. నవంబరు-డిసెంబరు మధ్యకాలంలో వుహాన్‌లో జరిగిన అంతర్జాతీయ సైనిక క్రీడల్లో ఓ అమెరికా సైనిక బృందం పాల్గొన్న తరవాతే ఈ వైరస్‌ అక్కడ తలెత్తిందని వారంటున్నారు. కరోనా వైరస్‌ను అమెరికన్లే ప్రయోగశాలలో పుట్టించి ఉంటే, దానికి విరుగుడు కూడా వారు కనిపెట్టి ఉండాలి. కానీ, నేడు కరోనా కేసుల్లో చైనాను అమెరికా మించిపోతున్నా దానికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అంటే ఆ దేశం వద్ద ఇప్పటికిప్పుడు విరుగుడు లేదనేగా! చైనా వద్ద దాచడానికి ఏమీ లేకపోతే, కరోనా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చ జరగకుండా ఎందుకు అడ్డుకొంటోంది? కశ్మీర్‌ విషయంలో 370వ రాజ్యాంగ అధికరణను రద్దుచేసినప్పుడు భద్రతా మండలిలో నానా యాగీ చేసిన చైనా, కరోనాపై చర్చ జరగకుండా ‘వీటో’ చేసింది. తనకున్న ఉబ్బసం, క్యాన్సర్‌ రోగాలు నయంచేసుకోవడానికి పంగోలిన్‌ (అలుగు) పొలుసులు, బొమికెలను పొడి చేసుకుని తిన్న ఒక చైనీయుడి నుంచి 2003లో సార్స్‌ వ్యాధి వ్యాపించింది. అలాగే సౌదీ అరేబియాలో చెడిపోయిన ఒంటె మాంసం తిన్న వ్యక్తి నుంచి మెర్స్‌ వ్యాధి విస్తరించింది. కొవిడ్‌ వ్యాధి విస్తరణకు కారణమంటూ అమెరికా, భారత్‌లలో కొందరు చైనా మీద నష్టపరిహార దావాలు వేసినా, వాటివల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే, నిరంకుశ ప్రభుత్వాల వల్ల జరిగే వినాశం ఏమిటో ప్రపంచానికి తెలిసివస్తోంది.

Friday, May 8, 2020

బంగినపల్లి మామిడి

ఫలరాజం.. బంగినపల్లి మామిడి

ఫలాల్లో మామిడిది మహారాజ హోదా. అందులోనూ బంగినపల్లి మామిడి సంగతి చెప్పాల్సిన పని లేదు. బంగినపల్లి అనగానే నోరూరించే మామిడి మాధుర్యం గుర్తుకు వస్తుంది. మధురమైన మామిడి పండ్లకు చిరునామా బనగానపల్లె. బనగానపల్లె నవాబు మీర్‌ గులాం అలీఖాన్‌(1905-1922)కు మామిడి పండ్లంటే మక్కువ. మేలు జాతి బేనిషాన్‌ రకాన్ని ఎంపిక చేసుకుని బనగానపల్లె సంస్థానంలో విరివిగా నాటించారు. అట్లా ఈ రకం పండ్లకు బనగానపల్లె మామిడిగా పేరు వచ్చింది. వ్యవహారంలో బంగినపల్లిగా మారింది. ఇక్కడ నుంచి తెలుగురాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు ఈ రకం సాగు విస్తరించింది. విదేశాలకు కూడా బనగానపల్లె ప్రాంతం నుంచి ఎగుమవుతుంటాయి. ఒక్కో పండు రెండు కిలోల వరకు తూగుతుంది. ఏ మాత్రం పీచు లేకుండా పూర్తి గుజ్జు ఉండే రుచికరమైన రకం ఇది. నవాబుల కాలంలో 3 వేల ఎకరాల్లో సాగైన బంగినపల్లి ప్రస్తుతం 500 ఎకరాల్లో దీని ఖ్యాతి ఇంతా అంతా కాదు. పొరుగు రాష్ట్రాలకు, దేశ విదేశాలకు బంగినపల్లి మామిడి పండ్లు సరఫరా అవుతుంటాయి. సామాన్య ప్రజలు కూడా వేసవిలో బంగినపల్లి మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. 

గతంలో మామిడి పండ్లను బాదం గడ్డి, వరి గడ్డితో మాగించేవారు. అందువల్ల మంచి వాసన, రుచి ఉండేది. ప్రస్తుతం వ్యాపారులు పండ్లను కార్బైడ్‌, ఇతర రసాయనాలతో మాగిస్తున్నారు. దీంతో రుచి తగ్గిపోయింది.

బనగానపల్లె నవాబుల కాలంలో 3 వేల ఎకరాల్లో ఈ పంట బనగానపల్లె పరిసర ప్రాంతాల్లో సాగయ్యేది. క్రమంగా పంట సరిగా రాకపోవడంతో చెట్లను కొట్టేసి వేరే పంటలు పండించడం ప్రారంభించారు. దీంతో యేటేటా బంగినపల్లి మామిడి విస్తీర్ణం తగ్గిపోయింది.

నోరూరించే బంగినపల్లి 
మధురమైన బనగానపల్లె మామిడి పండ్లలో ఆనాటి రుచి మాయమవుతోంది. ఇప్పుడు మామిడి పండ్లు విషతుల్యం అవవుతున్నాయి. త్వరగా పక్వానికి రావడానికి నానారకాల రసాయనాలు, కార్బైడ్‌లను వాడుతున్నారు. ఇలా మాగబెట్టడం వల్ల రుచి కోల్పోతున్నాయి. ఇవి తింటే అనేక రకాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


కృత్రిమ పక్వం 
బంగినపల్లి మామిడి పండ్లకు ఉండే గిరాకీని వ్యాపారులు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి కృత్రిమ పద్ధతిలో పక్వం చేస్తున్నారు. పసువు పచ్చ రంగులో అచ్చం మాగిన పండు లాగా కనిపించేలా చేసి అమ్ముతున్నారు. ఇలా మాగేసిన కాయలు ఏమాత్రం రుచి లేక పోగా విష తుల్యం. 
 
తగ్గిన దిగుబడి 
సాగవుతోంది. దీంతో వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వేరే రకం కాయలు దిగుమతి చేసుకుని బంగినపల్లి మామిడి పండ్లని విక్రయిస్తున్నారు.



Wednesday, May 6, 2020

టీకా.. అప్పుడు మాకొద్దు

టీకా.. అప్పుడు మాకొద్దు!
4 May, 2020


తొలినాళ్లలో మశూచి టీకాను వద్దన్న ప్రజలు
మూఢనమ్మకాలతో వాడేందుకు వెనకడుగు..
చాన్నాళ్ల తర్వాత ఆ టీకాకు సరేనన్న జనం
కరోనా టీకా కోసం ప్రపంచం ఎదురుచూపు
ప్రయోగాలపై మానవాళి కొండంత ఆశ

కరోనా మహమ్మారిని నియంత్రించే దారిలేక, నివారించే ఔషధం దొరక్క మానవాళి అల్లకల్లోలమవుతోంది.  దీని అంతుచూసే టీకా ఎప్పుడొస్తుందా అని కోట్ల కళ్లతో ప్రపంచం ఎదురుచూస్తోంది. అయితే,  తొలి టీకా వచ్చినప్పుడు జనమంతా వద్దంటే వద్దన్నారు. ఆ విషయం మీకు తెలుసా? మశూచి పేరు గుర్తుంది కదా. మహమ్మారి అన్నమాట పర్యాయపదంగా మారింది దీనికే (దీనికంటే ముందు మహమ్మారులున్నా జనానికి గుర్తున్న తొలిపేరు ఇదే).

16వ శతాబ్దంలో దీని ప్రభావం ముమ్మరంగా ఉండేది. ఇప్పుడు కరోనా తరహాలో యావత్తు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించింది. ఏటా 30లక్షలకుపైగా జనం దీనికి బలయ్యేవారట. అం తటి ప్రమాదకర అంటురోగమిది. చనిపోయేవాళ్లు పోను, దాని నుంచి బతికి బయటపడ్డవారి ముఖం స్ఫోటకం మచ్చలతో వికారం గా మారేది. అసలు ఈ వ్యాధి ఏంటో, ఎలా వస్తుందో తెలుసుకునే పరిజ్ఞానం లేక జనం దానికి బలవటం సాధారణంగా మారింది. 1796లో దానికి టీకా అందుబాటులోకి వచ్చిం ది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ఏటా పొట్టనపెట్టుకునే మహమ్మారిని నియంత్రించే టీకా వచ్చినా దాన్ని వినియోగించేందుకు జనం ముందుకు రాలేదు. అప్పటి వరకు అంటురోగాలకు టీకా అంటే ఎరగని ప్రపంచానికి పరిచయమైన తొలి వ్యాక్సిన్‌ అదే. కానీ జనం దాన్ని ముక్తకంఠంతో తిరస్కరించారు.

నాడు వద్దంటే వద్దన్నారు..
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ మశూచికి విరుగుడు టీకాను రూపొందించారు. మశూచిని మాయం చేయాలంటే ఏం చేయాలనే విషయంలో కొన్నేళ్లపాటు సాగిన ఆయన అధ్యయనం చివకు సత్ఫలితాన్నిచ్చింది. మశూచి ప్రబలిన సమయంలో కౌపాక్స్‌ వైరస్‌ కూడా ప్రభావం చూపింది. శరీరంపై పెద్దపెద్ద పుండ్లు పడేవి. దీన్ని నిశితంగా గమనించిన డాక్టర్‌ జెన్నర్‌ ఓ విషయాన్ని గుర్తించారు. కౌపాక్స్‌ సోకిన వారికి మశూచి రావటం లేదని నిర్ధారించుకున్నారు. అంటే మనిషి శరీరంలోకి కౌపాక్స్‌ కారకాన్ని ప్రవేశపెడితే మశూచి క్రిమి సోకదన్నది ఆయన భావన. ప్రయోగాలు చేసి చివరకు సారా నెల్‌మెస్‌ అనే మహిళ శరీరంలోని కౌపాక్స్‌ పుండు నుంచి కొంతభాగం సేకరించి ఎనిమిదేళ్ల జేమ్స్‌ ఫిప్స్‌ అనే బాలుడి శరీరంలోకి సూది ద్వారా ప్రవేశపెట్టారు.

దీంతో ఆ బాలుడికి కౌపాక్స్‌ సోకింది. నెలన్నర తర్వాత మశూచి రోగి నుంచి తీసిన కణాన్ని ప్రవేశపెట్టారు. కానీ మశూచీ లక్షణాలు కనిపించలేదు. దీంతో తన ప్రయోగం విజయవంతమైందని ప్రకటించి దాని ఆధారంగా టీకాను రూపొందించారు. ప్రపంచమొత్తం దీన్ని వాడి ఆ మహమ్మారిని దూరం చేసుకుంటుందన్న ఆయన ఆశ అనతికాలంలోనే విఫలమైంది. ఆ వ్యాక్సిన్‌ వాడేందుకు జనం వెనకడుగు వేశారు. మరొకరి శరీరంలోని మాంసం కణాలను తమ శరీరంలోకి రావటాన్ని జనం వ్యతిరేకించారు. కొందరు పనిగట్టుకుని ఆ ప్రయోగాన్ని అడ్డుకున్నారు. కొంతమంది మాత్రమే ఆ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్నవారు మశూచి బారినపడని తీరును చూసి కూడా జనం దానికి దూరంగానే ఉండిపోయారు.

తప్పనిసరి చేసినా..
క్రమంగా మహమ్మారి ప్రభావం మరింత ఎక్కువవుతుండటంతో బ్రిటిష్‌ పాలకులు 1840లో చట్టం చేశారు. ప్రజలు నిరభ్యంతరంగా ఆ టీకా వేయించుకోవాలని పేర్కొన్నారు. అది కొంతమేర పనిచేసినా అనుకున్నంత సానుకూలత రాలేదు. దీంతో 1853లో ఆ టీకాను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో బ్రిటన్‌లో ఏటా 66% మంది టీకా వేయించుకోవటం ప్రారంభించారు. అప్పటికే యూరప్, అమెరికా ఖండాల్లోని దేశాలు దీన్ని వాడటం ప్రారంభించాయి. క్రమంగా ఆయా దేశాల్లో మశూచి ప్రభావం తగ్గింది. కానీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో జనంలో మార్పు రాలేదు. ఇంతలో 1898లో బ్రిటన్‌లో తప్పనిసరి చట్టానికి కొంతమంది పనిగట్టుకుని సవరణ చేయించారు. వీరంతా ఆ టీకాను వ్యతిరేకించేవారు. ఫలితంగా టీకా వేయించుకునేవారి సంఖ్య 39శాతానికి తగ్గింది. దీంతో మళ్లీ అక్కడ వ్యాధి విజృంభించింది.

షాజహాన్‌ గుబురు గడ్డం వెనక ‘మశూచి మచ్చలు’ 
మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ గడ్డం వెనక మశూచీ కథ దాగి ఉంది. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు మశూచి బారినపడ్డారు. చివరకు ఆయనెంతో ఇష్టపడే కూతురు కూడా దీనికే బలైంది. ఆయన కోలుకున్నా.. మొహం దిగువన బాగా మచ్చలుపడ్డాయి. అప్పటివరకు నాజూకు గెడ్డంతో ఉన్న షాజహాన్‌.. ఆ మచ్చలు కనిపించకుండా ఉండేందుకు దాన్ని గుబురుగా పెంచటం ప్రారంభించారట.

మనోళ్లదీ అదే మాట..
మశూచితో దేశంలో సాలీనా 2లక్షల మంది సగుటున చనిపోయేవారు. మూఢనమ్మకాల ప్రభావంతో జనం మశూచి టీకాను వ్యతిరేకించారు. ఆ సమయంలో యూకేలోని స్కాట్లాండ్‌లో ఉన్న గ్లాస్గో నగరంలో లక్ష మంది టీకాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం మన దేశంపై మరింత ప్రభావం చూపింది. స్థానిక బ్రిటిష్‌ పాలకులు టీకా అందుబాటులో ఉంచినా, జనంలో మార్పు కోసం పెద్దగా యత్నించలేదు. ఇది మహమ్మారి విజృంభణకు కారణమైంది. కొన్నిచోట్ల బలవంతంగా టీకా ఇచ్చినా, దానికి విరుగుడుగా మూఢనమ్మకంతో జనం పేడ రాసేవారు. మీజిల్స్, కోరింత దగ్గులాంటి టీకాల విషయంలోనూ ఇలాగే చేసేవారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీకాపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ జోక్యం చేసుకుంది.

అదే సమయంలో ఆ సంస్థ పోత్సాహంతో వ్యాక్సిన్‌ కోసం మరిన్ని ప్రయోగాలు జరిగాయి. నేరుగా వైరస్‌ నుంచే వ్యాక్సిన్‌ రూపొందించే మరో విధానం సక్సెస్‌ అయి కొత్తరకం వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినా జనంలో వ్యతిరేకత తగ్గలేదు. చివరకు 1967లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆ వ్యాక్సిన్‌ కచ్చితంగా వేసేలా పాఠశాల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇది సత్ఫలితాలనిచ్చింది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం తగ్గింది. చివరకు 1980లో ఆ మహమ్మారిని నిర్మూలించినట్టు ప్రకటించింది.

మరిప్పుడు.. వెంటనే కావాలి..
ప్రస్తుత సమయానికొస్తే.. కరోనా  ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో తెలియక ఇప్పుడు ప్రపంచం యావత్తూ కరోనాను తలచుకుని హడలిపోతోంది. టీకా, టీకా అంటూ కలవరించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఫలితాలనిస్తున్న ప్రయోగాలు..
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ–భారత్‌కు చెందిన సీరమ్‌ కంపెనీ సంయుక్తంగా చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయట.. త్వరలోనే టీకా వస్తుందట అనే వార్తలు ఒక్క క్షణం కరోనాను జయించినంత సంతోషం కలిగిం చాయి. ఆస్ట్రేలియా వైద్యుల ప్రయత్నాలు సానుకూలం గా ఉన్నాయని, జర్మనీ సంస్థ మనుషులపై ప్రయోగాలు మొదలుపెట్టిందని, అమెరికాలో కూడా ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయని.. ఇలాంటి వార్తలు ప్రసార మాధ్యమాల్లో వస్తుండటంతో క్రమంగా జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరో ఆరేడు నెలల్లో వ్యాక్సిన్‌ రావటం ఖాయమన్న భరోసా దక్కి, అప్పటి వరకు ఎలాగో కరోనాను కాచుకోవాలని సంకల్పించి అడుగులేస్తున్నారు. కరోనాను జయించే బ్రహ్మాస్త్రం ఇప్పుడా వ్యాక్సినే. ఏ దేశం అని కాదు, ప్రపం చంలో ఏ మూల తయారైనా సరే ఆ టీకాను అర్జంటుగా వేయించుకోవాల్సిందే అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన. మశూచి విషయంలో నాడు టీకా వద్దన్న జనం ఇప్పుడెందుకు బలంగా కోరుకుం టున్నారంటే.. ప్రసార మాధ్యమాల విషయంలో విప్లవాత్మక అభివృద్ధే కారణం. కరోనా మృత్యుకేళి ఎలా ఉందో నిత్యం టీవీలు, పత్రి కలు కళ్లకు కడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్న తీరును కళ్లారా చూసి జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో భయం పెరిగింది. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిందా?



ప్రపంచాన్ని చైనా మభ్యపెట్టిందా?
ఆది నుంచీ ఆ దేశానిది అనుమానాస్పద వైఖరే
‘5 ఐస్‌’ కూటమి దేశాల రహస్య నివేదిక
అమెరికా ఆరోపణలకూ ఇదే ఆధారం

కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి చైనా వైఖరిపై ఐదు దేశాలు విరుచుకుపడుతున్నాయి. ఈ వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదంటూ చైనా అబద్ధమాడిందని, వైరస్‌ వివరాల్ని ప్రపంచానికి చెప్పిన వేగుల్ని మాయం చేసిందని మండిపడుతున్నాయి. ‘5 ఐస్‌(కళ్లు)’గా పిలుచుకునే అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల కూటమి ఈ మేరకు ఒక రహస్య నివేదికను సిద్ధంచేసింది. దీని ఆధారంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై విమర్శలు చేశారు. ఇంతకీ వీరి ఆరోపణలకు దన్నుగా నిలుస్తున్న సాక్ష్యాలేమిటి? వాటిని బలపరిచే ఆధారాల్ని అవి ఎక్కడ్నుంచి, ఎలా సేకరించాయి? వైరస్‌ వ్యాప్తి తొలినాళ్లలో చైనాలో ఏం జరిగింది? అది ప్రపంచానికి ఏం చెప్పింది? అందులో నిజానిజాలేమి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘5 ఐస్‌ కళ్ల కూటమి’ నివేదిక సమాధానాలు ఇస్తోంది. బ్రిటన్‌కు చెందిన ‘టెలిగ్రాఫ్‌’ పత్రిక ప్రచురించిన నివేదికలోని అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నివేదికలో ఏముందంటే...
* వుహాన్‌ సముద్ర జీవుల మార్కెట్‌ నుంచి వైరస్‌ వ్యాపించిందని చైనా చెప్పడం పచ్చి అబద్ధం. అది అక్కడి పీ4 ప్రయోగశాల నుంచి బయటికి వచ్చింది. నిజం బయటపడకుండా చైనా అధికారులు ప్రయోగశాలలోని నమూనాలను నాశనం చేశారు. వుహాన్‌ మార్కెట్‌ను పూర్తిగా బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రంచేశారు.
* కరోనా వైరస్‌ మనిషి నుంచి మనిషికి సోకదంటూ చైనా పెద్ద అబద్ధమాడింది. తైవాన్‌ వంటి సరిహద్దు దేశాలు ఖండిస్తున్నా... జనవరి ఆఖరు వరకు డబ్ల్యూహెచ్‌వో సైతం చైనానే వెనకేసుకొచ్చింది. ఇది అంతర్జాతీయ పారదర్శకతను దెబ్బతీయడమే.
* కరోనా వివరాలను ప్రపంచానికి చెప్పిన ప్రజా వేగుల(విజిల్‌ బ్లోయర్‌)ను మాయంచేసింది. విమర్శకుల నోళ్లు మూయించింది.
* చైనాలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని, వైరస్‌ గురించి తెలిపే సమాచారాన్ని ఇంటర్నెట్‌ ద్వారా ప్రజలు తెలుసుకోకుండా డిసెంబరు నుంచే అడ్డుకుంది.
* టీకా తయారీకి ఇతర దేశాలకు సాయం చేయడానికి నిరాకరించింది.
* వైరస్‌ కేసులు, తీవ్రతను తగ్గించి చెప్పడంతో ఇతర దేశాలు వెంటనే అప్రమత్తం కాలేకపోయాయి.
* వైరస్‌ వ్యాప్తిలో అత్యంత ప్రమాదకారులైన గుప్తవాహకుల గురించి దాచి ఉంచింది.

డ్రాగన్‌కు డిసెంబరులోనే తెలిసిందా?
చైనాలో డిసెంబరు తొలి రోజుల్లోనే వైరస్‌ విజృంభణ ప్రారంభమైనట్లు రహస్య నివేదిక వెల్లడించింది. ఇంకా ఏం చెప్పిందంటే..
* మనిషి నుంచి మనిషికి వైరస్‌ సోకుతోందని అప్పుడే తెలిసినా జనవరి 20 వరకు ఆ విషయాన్ని చైనా ఖండిస్తూనే  ఉంది.
* డిసెంబరు 31 నుంచి... సార్స్‌, వుహాన్‌ సముద్ర మాంసం విపణి, వుహాన్‌లో గుర్తు తెలియని న్యుమోనియా పదాలు ఇంటర్నెట్‌లో లేకుండా చేసింది.
* వైరస్‌ నమూనాలను నాశనం చేయాలని, వాటి గురించి ఎలాంటి సమాచారాన్ని ప్రచురించవద్దని జనవరి 3న చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులు ఆదేశించింది.
* చైనాలో అన్ని రకాల ప్రయాణాలను జనవరిలోనే నిలిపేసింది. మిగిలిన ప్రపంచానికి మాత్రం అసలు ప్రయాణాలు ఆపాల్సిన అవసరమే లేదని చెబుతూవచ్చింది. దీనివల్ల ఫిబ్రవరి నెలంతా వేల మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేశారు. అమెరికా, ఇటలీ, భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాసియా దేశాలు రాకపోకలపై నిషేధం విధించాలని ఆలోచిస్తే చైనా తీవ్రంగా విమర్శించింది. తమ దేశంలో మాత్రం తీవ్ర ఆంక్షలను అమలుచేసింది.

వీరు ఏమయ్యారు?
* వైరస్‌ ప్రమాదకరంగా పరిణమిస్తోందని హెచ్చరించిన వైద్యులు, శాస్త్రవేత్తలు కనిపించకుండా పోయారు. కొందరు శిక్షలకు గురయ్యారు.
* వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో పరిశోధకురాలిగా పనిచేస్తున్న హువాంగ్‌ యాన్‌ లింగ్‌ని పేషెంట్‌ జీరోగా భావిస్తున్నారు. ఆమె అనుమానాస్పదంగా మాయమైంది. ప్రయోగశాల వెబ్‌సైట్‌ నుంచి ఆమె వివరాలు తొలగించారు. అయితే ఆమె జీవించే ఉన్నారని, కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదంటూ ప్రయోగశాల ప్రకటించింది.
* మహమ్మారి గురించి మాట్లాడిన వ్యాపారవేత్త ఫంగ్‌బిన్‌, న్యాయవాది ఛెన్‌క్యూషి, మాజీ టీవీ రిపోర్టర్‌ లీ జెహువాలను డిటెన్షన్‌ సెంటర్‌లో పెట్టడమో, శిక్షించడమో చేశారు.

ఎవరివీ 5ఐస్‌?
ఇంగ్లిషు మాట్లాడే అతిపెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలతో ఏర్పడినదే ‘5 కళ్ల కూటమి’. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే ఈ దేశాలు కలిసి పనిచేస్తున్నా.. 1946లో కూటమిని అధికారికంగా ఏర్పాటుచేశాయి. ప్రపంచంలోని వివిధ దేశాల రక్షణ కార్యకలాపాలపై కన్నేసి, సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం దీని ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ‘ఎకెలాన్‌’ అనే అతిపెద్ద నిఘా వ్యవస్థను అమెరికా నడుపుతుండగా.. దీని సేవలను మిగిలిన సభ్యులు పొందుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఈ కూటమి చాలా చురుగ్గా పనిచేసింది. ప్రస్తుత కొవిడ్‌ కల్లోలంపై ఈ కూటమి 15 పేజీల నివేదికను తయారుచేసింది. అది బయటికి పొక్కడంతో దుమారం రేగుతోంది.

వైరస్‌ వ్యాప్తిపై నివేదిక ఏం చెప్పిందంటే..

2013
చైనా పరిశోధకులు గబ్బిలం నుంచి వైరస్‌ సేకరించారు. దీని జన్యుక్రమం కొవిడ్‌-19లోని జన్యుక్రమంతో 96% సరిపోలింది.
2015
నవంబరు 9
తాము కరోనా వైరస్‌ను సృష్టించినట్లు వుహాన్‌ ప్రయోగశాల ప్రకటించింది.
2019
డిసెంబరు 6
వుహాన్‌ మార్కెట్‌లో న్యుమోనియాతో బాధపడుతున్న భర్తను తాకిన భార్యకు అదే లక్షణాలతో జ్వరం వచ్చింది. ఇదే మనిషి నుంచి మనిషికి సోకిన కరోనా తొలి కేసు.
డిసెంబరు 27
తమ దేశంలో 180 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు చైనా ప్రకటించింది.
2020
జనవరి 1
వైరస్‌ విజృంభణపై హెచ్చరించిన వుహాన్‌లోని వైద్యుల అరెస్టు.
జనవరి 10
వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందంటూ చైనా అధికారుల ప్రకటన.
జనవరి 11
చైనాలో తొలి కరోనా మృతి నమోదు
జనవరి 23
వుహాన్‌లో పూర్తి లాక్‌డౌన్‌ విధింపు
జనవరి 30
వైరస్‌ వ్యాప్తిని ‘మహమ్మారి’గా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో.
ఫిబ్రవరి 7
కరోనా గురించి తొట్టతొలిగా మాట్లాడిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ కొవిడ్‌తోనే మృతి
ఏప్రిల్‌
వుహాన్‌ కోలుకుంది. మిగిలిన ప్రపంచం కొవిడ్‌ కోరల్లో చిక్కుకుంది.


అసలు వైరస్‌ ఎక్కడ పుట్టింది?
కరోనా వైరస్‌ ప్రయోగశాలలో పుట్టిందా? మార్కెట్‌లో బయటపడిందా? అనే విషయమై 5 కళ్ల కూటమిలోని దేశాల మధ్యే ఏకాభిప్రాయం లేదు. అదే సమయంలో ఆయా దేశాలు బ్యాట్‌ ఉమన్‌ షియాంగ్‌ లీ చేసిన ప్రయోగాల ఆధారంగా వైరస్‌ పుట్టుకపై పరిశోధన చేస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ... ప్రయోగశాలలోనే వైరస్‌ పుట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని గట్టిగా ప్రకటించారు. అయితే... అమెరికాలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సంచాలకులు రిజర్డ్‌ గ్రెనెల్‌ మాట్లాడుతూ...‘వైరస్‌ను మనుషులే తయారు చేశారని లేదా జన్యుక్రమాన్ని మార్చారనే విషయాన్ని చాలామంది పరిశోధకులు కొట్టిపడేస్తున్నారు. వారి అభిప్రాయంతో మేం ఏకీభవిస్తున్నాం’ అంటూ ప్రకటించారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ప్రయోగశాల నుంచి బయటికి వచ్చి ఉండొచ్చని కొందరు అంటున్నా... ఆ అవకాశం లేదని శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు.

ఆ మబ్బులన్నీ తేలిపోతాయ్‌
‘బ్యాట్‌ ఉమన్‌’ షి జియాంగ్‌లీ
ఎంత కష్టం వచ్చినా నేను విదేశాలకు పారిపోను. మేం తప్పు చేయలేదు. సైన్స్‌పై ఉన్న అపార నమ్మకంతో ఒక విషయం చెబుతున్నా.. ఏదో ఒకరోజు మేఘాలన్నీ తొలగిపోయి, ప్రకాశవంతమైన సూర్యకాంతి కనిపిస్తుంది