Wednesday, April 29, 2020

జిత్తులమారి కరోనా..

జిత్తులమారి కరోనా..

27 Apr, 2020

కరోనా భరతం పట్టేందుకు వ్యాక్సిన్‌ తయారీకి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కృషి జరుగుతోంది. అయితే ఈ నావల్‌ కరోనా వైరస్‌ ఎప్పటి కప్పుడు తన రూపాన్ని మార్చు కుంటూ.. పరివర్తనం చెందుతూ శాస్త్రవేత్త లకు సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌–19 మానవులపై ఎలా దాడి చేస్తుంది.. ఇది తన రూపాన్ని మార్చు కోవడం వల్ల వ్యాక్సిన్‌ తయారీపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది తెలుసుకుందామా..    – 

బేసిక్స్‌ ఫస్ట్‌..
వైరస్‌ అంటే..
సూక్ష్మమైన ఈ పరాన్నజీవి ఆతిథేయి (హోస్ట్‌) శరీరంలోనే వృద్ధి చెందుతుంది.

యాంటీబాడీస్‌..
ఆతిథేయి శరీరంలోని ‘వై’ఆకారంలోని ప్రోటీన్లు.. వెలుపలి నుంచి వచ్చే పరాన్న జీవులను అడ్డుకోవడం లేదా శరీరం నుంచి తొలగిస్తాయి. 

ఆతిథేయిపై వైరస్‌ ఎలా దాడి చేస్తుంది?
1.సార్స్‌ సీవోవీ– 2కు చెందిన స్పైక్‌(కొమ్ము) ప్రోటీన్‌ మానవ కణాల ఉపరితలాన్ని అంటుకుంటుంది. 
2.వైరస్‌ జన్యు పదార్థం ఆర్‌ఎన్‌ఏతో తయారవుతుంది.
3.వైరస్‌ తన జన్యు పదార్థాన్ని మానవ కణంలోకి విడు దల చేస్తుంది. ఆ తర్వాత మానవ కణంలోని ప్రోటీన్లను ఉపయోగించుకుని ఆర్‌ఎన్‌ఏ రెట్టింపు (రెప్లికేట్‌) అవుతుంది.
4.ఇలా తయారైన ఆర్‌ఎన్‌ఏ ఒక దగ్గర చేరి కొత్త వైరస్‌ కాపీలు ఏర్పడతాయి.
5.కొత్త కాపీలు ఏర్పడిన తర్వాత మానవుడి కణం నుంచి బయటకు వస్తాయి.
6.నశించిన మానవుడి కణం ఊపిరితిత్తుల్లో అలాగే ఉండిపోతుంది.

యాంటీబాడీలు ఎలా కాపాడతాయి?
1. కణాలకు అంటుకోకుండా అడ్డుకోవడం..
2.కణంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం..
3. ఆర్‌ఎన్‌ఏ విడుదల కాకుండా చూడటం..
వీటిల్లో ఏదో ఒక పద్ధతి ద్వారా వైరస్‌ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.

సాధారణ ప్రతిరూపకల్పన.. (రెప్లికేషన్‌)
►వైరస్‌ ఓ కణంలోకి ప్రవేశించి.. అందులోని వ్యవస్థను హైజాక్‌ చేస్తుంది. దాన్ని వాడుకుని వైరస్‌ తన కాపీలను తయారు చేసుకుంటుంది. 

మ్యుటేషన్‌..
►సాధారణంగా కాపీలు తయారయ్యే టప్పుడు చిన్న మార్పులు కూడా మ్యుటే షన్‌కు దారి తీస్తుంది. ఇది ఎక్కువగా జన్యు పదార్థంలో జరుగుతుంది. ఇలా పరివర్తనం చెందిన వైరస్‌తో లాభాలు ఉన్నాయి. ఈ వైరస్‌ లను అడ్డుకునేందుకు ఆతిథేయి శరీరంలో ఎలాంటి యాంటీబాడీలు ఉండవు. దీంతో అవి యథేచ్ఛగా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

వ్యాక్సిన్లు..
►వ్యాక్సిన్లు మన శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తయ్యేలా ప్రేరేపిస్తాయి. ఈ యాంటీబాడీలు వైరస్‌పై ప్రత్యేక స్థానాల్లో (యాంటీజెన్స్‌) అంటుకుని వాటిని నిర్వీర్యం చేస్తాయి.

వ్యాక్సిన్‌పై రూపాంతరం చెందిన వైరస్‌ల ప్రభావం..
సంతతి–ఏ: ఆతిథేయి కణానికి సోకుతుంది. ఆతిథేయి రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్‌పై ఉన్న ప్రోటీన్లను బట్టి గుర్తిస్తుంది.
సంతతి–బి: (రూపాంతరం చెందిన వైరస్‌) సంతతి–ఏ పై పనిచేసే యాంటీ బాడీలు సంతతి–బి ని గుర్తించడంలో విఫలం అవుతాయి. దీంతో వ్యాక్సిన్‌ వ్యర్థం అవుతుంది. 

►ఈ సంతతి–బి వేరే వ్యక్తికి సోకితే.. దాన్ని నిర్వీర్యం చేసేందుకు కొత్త వ్యాక్సిన్‌ కనిపెట్టాల్సి ఉంటుంది.

►కొత్త కొత్త రకాలు, రూపాంతరాలు చెందుతూ ఉంటే.. వాటిని అడ్డుకునేందుకు కొత్త కొత్త వ్యాక్సిన్ల అవసరం పెరుగుతూ ఉంటుంది.

సార్స్‌ సీవోవీ–2
►ఇది పూర్తిగా కొత్త రకం కరోనా వైరస్‌ సంతతి. దీన్ని అడ్డుకునేందుకు మానవులకు ఎలాంటి నిరోధక శక్తి లేదు.

ఏం జరుగుతోంది 
►దీంతో ఈ వైరస్‌పై పనిచేసేలా వ్యాక్సిన్లు తయారుచేసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అంతేకాదు ఈ వైరస్‌ ఎలా రూపాంతరం (మ్యుటేషన్‌) చెందుతోందో గమనిస్తున్నారు.

ఒకవేళ రూపాంతరాలు వైరస్‌–
►యాంటీబాడీ చర్యలకు ఆటంకం కలిగించకపోతే.. వ్యాక్సిన్‌ చాలా మందిపై సమర్థంగా పనిచేస్తుంది.

ఇలా జరిగే చాన్సుంది..
►ఒక్కో సంతతి ఒక్కోలా ప్రవర్తిస్తుంటే.. ఒకే వ్యాక్సిన్‌ పనిచేయదు. అలాంటప్పుడు వ్యాక్సిన్లను అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి. 

►వ్యాక్సిన్‌కు అనుగుణంగా వైరస్‌ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అలాంటప్పుడు వ్యాక్సిన్లను మళ్లీ మళ్లీ అప్‌డేట్‌ చేస్తూ ఉండాలి.  

కరోనాకి ముందే ‘ఈవెంట్‌ 201’?!

కరోనాకి ముందే ‘ఈవెంట్‌ 201’?!

28 Apr, 2020

‘‘సార్స్‌ అంటువ్యాధి సార్స్‌–కోవిడ్‌గా కరోనా వైరస్‌ రూపంలో చైనాలోని వూహాన్‌ వైరాలజీ పరిశోధనా సంస్థ నుంచే పుట్టుకొచ్చిన చైనీస్‌ వైరస్సేననీ, ఇది జీవాయుధమేననీ, దానిని యుద్ధ ప్రయోజనాల కోసమే చైనా సృష్టించిందనీ సాగుతున్న ప్రచారం పచ్చి అబద్ధపు ప్రచారం. 2020 జనవరి 26న అమెరికా పత్రిక ‘వాషింగ్టన్‌ టైమ్స్‌’లో ప్రచురించిన ఈ ప్రచార వ్యాసానికి ఆధారం ఇజ్రాయెల్‌ మాజీ సైనికాధికారి ఒకడు చేసిన ఈ ఆరోపణయే. కానీ ఆ వెనువెంటనే మార్చి 17న కొలంబియా యూనివర్సిటీకి చెందిన స్క్రిప్స్‌ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్త క్రిస్తియన్‌ ఆండర్సన్, ప్రొఫెసర్‌ లాన్‌ లిప్కిన్‌ రెండవ సార్స్‌ వ్యాధి రూపంలో వచ్చిన కరోనా వైరస్‌ చైనా పరిశోధనాగారం సృష్టి ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. ఏ వ్యాధి అయినా జంతుజాలం నుంచి బయటకు బదిలీ అయ్యేముందు ఆ జంతువు అంతకుముందు ఏ పరాశ్రయ జీవిపై ఆధారపడిందో దాని ఫలితంగా బదిలీ అవుతుంది కాగా, సదరు జంతు జాలం నుంచే స్వభావసిద్ధంగా (నేచురల్‌ సెలక్షన్‌) మానవులకు వ్యాధి సంక్రమిస్తూంటుంది’’. – అనంత కృష్ణన్‌ (ది హిందూ: 27–04–2020)

అబద్ధాల అంకయ్యకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఉబుసుపోకకు పుట్టింది కాదు, ఆ సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ లాంటి వాళ్లను చూసే ప్రచారంలోకి వచ్చి ఉంటుంది. కరోనా వైరస్‌ మహమ్మారి సుమారు గత ఎనిమిది శతాబ్దాలుగా ప్రపంచాన్ని కకావికలు చేసి కోట్లాది మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్న ఫ్లూ, ప్లేగు, క్షయ, న్యూమోనియా, సార్స్, ఎబోలా ఇత్యాది వైరస్‌ల మాదిరే పుట్టుకొచ్చిన ఉగ్రవ్యాధి. అయినా ట్రంప్‌ అంటువ్యాధుల వ్యాప్తికి ఒక జాతినో, ఒక దేశాన్నో, మానవాళిలో ఒక భాగాన్నో, ఒక ప్రభుత్వాన్నో కారణంగా వివక్ష చూపడానికి ప్రత్యేక కారణం ఉంది. అది– నేటి ప్రపంచంలో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రాజకీయంగానూ, నైతికంగానూ హోరాహోరీగా పోటీ కొనసాగుతోంది. ఒక వ్యవస్థకు అంటే నయావలస సామ్రాజ్య పాలనా వ్యవస్థకు అమెరికా నాయకత్వం వహిస్తుండగా, మరొక వ్యవస్థకు ఆ వలసపాలనా దోపిడీ వ్యవస్థలపై ఎదురు తిరిగి విప్లవం ద్వారా, త్యాగాల ద్వారా ప్రజా బాహుళ్యం అండతో సోషలిస్టు వ్యవస్థను స్థాపించుకుని రక్షించుకుంటున్న నవచైనా నాయకత్వం వహిస్తోంది. ఈ సంకుల సమరం ఇప్పటితో ఆగేది కాదు.

ప్రజాహిత వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుకోదలిచిన సోషలిస్టు వ్యవస్థకు తన ప్రజల్ని తానే చంపుకునేందుకు శాస్త్ర పరిశోధనాగారాల్లో చేజేతులా ఒక వైరస్‌ను పనిగట్టుకుని సృష్టించుకోదు. కానీ జాతుల్ని, వ్యవస్థల్ని ధ్వంసం చేయడం ద్వారా, పీడన ద్వారా వలస పాలనా దోపిడీ వ్యవస్థను, దురాక్రమణల ద్వారా దేశాల సంపదను కొల్లగొట్టే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించుకోజూసే పాలక వర్గాలకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఒక కూసువిద్య. కరోనా వ్యాప్తి సందర్భంగా ఆ వ్యాధి వెనక దాగి అలాంటి వ్యాధుల్ని జీవాయుధాలుగా లేబొరేటరీల్లో సృష్టించుకోవచ్చుననీ, ఒక రహస్య కృత్రిమ ప్రయోగం ద్వారా ఇటీవలనే ప్రపంచం కళ్లు కప్పి అమెరికా సామ్రాజ్యపాలక యుద్ధోన్మాదులు ప్రయత్నించారనీ సుప్రసిద్ధ అమెరికన్‌ మేధావి, ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, సామాజిక వ్యవహారాల నిశిత పరిశీలకుడైన ప్రొఫెసర్‌ నోమ్‌ చామ్‌స్కీ కొద్దిరోజుల నాడే బయట పెట్టారు. కొన్ని రోజులపాటు ప్రపంచ వెబ్‌సైట్లలో వైరల్‌గా మారిన ఆ వార్తను కొలది రోజులనాడు అమెరికా ఒత్తిడి పెట్టి తొలగింప చేసుకున్నట్లు తాజా వార్తలు. ఇంతకూ ఆ రహస్య ప్రయోగానికి తగిలించిన ముద్దుపేరు ‘ఈవెంట్‌ 201’ (‘ఘటన 201’) చైనాలో కరోనా వ్యాధి గురించిన వార్త వ్యాప్తి కావడానికి 2020వ సంవత్సరానికి ముందర, అంటే 2019 అక్టోబర్‌లోనే, కరోనా లాంటి మహమ్మారి వ్యాధి అలుముకోవడానికి అనువైన అంతే లక్షణాలను కృత్రిమంగా భారీ ఎత్తున సృష్టించడం గురించిన కృత్రిమ శాస్త్ర ప్రయోగాన్ని లేబొరేటరీలో అమెరికా నిర్వహించింది. 

ఆ ప్రయోగానికే ఈవెంట్‌ 201 అని పేరు పెట్టారు. దీన్ని నిర్వహించినవారు ప్రపంచ మహా కోటీశ్వరుడైన అమెరికన్‌ బిల్‌గేట్స్‌ (బిల్‌ అండ్‌ మెలిండా) ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాన్స్‌ హాస్కిన్స్‌ ఆరోగ్య భద్రతా కేంద్రీయ సంస్థ! నిజానికి కరోనా వైరస్‌ మహమ్మారిని తలెత్తకుండా నివారించవచ్చని, నివారించగల్గినంత సమాచారం లేకపోలేదనీ ప్రొఫెసర్‌ చామ్‌స్కీ చెబుతూ ఇలా వ్యాఖ్యానించారు: ‘అయినా, ఎలాంటి ప్రయత్నమూ అందుకు జరగలేదు. పైగా కరోనా సంక్షోభం రాజకీయ వ్యవస్థల విద్రోహంవల్ల మరింత తీవ్రరూపం దాల్చింది. తమకు తెలిసిన, అందుబాటులోనే ఉన్న వ్యాధి వ్యాప్తి నిరోధక సమాచారంపైన రాజకీయ వ్యవస్థలు శ్రద్ధ పెట్టలేదు’. కాగా, చైనాలో న్యుమోనియా వ్యాధి లక్షణాలుగా కనిపిస్తున్నా, దాని పుట్టుపూర్వోత్తరాలు మాత్రం తెలవడం లేదని చైనా ప్రభుత్వం 2019 డిసెంబర్‌ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించింది. ఆ తర్వాత వారం రోజులకు చైనా శాస్త్రవేత్తలు ఈ అజ్ఞాత వ్యాధిని కరోనా వైరస్‌గా గుర్తించగలిగి, వెంటనే దాని లక్షణాలను వడపోసి మరీ ప్రపంచానికి సంబంధిత సమాచారాన్ని అందించారు.

సరిగ్గా ఈ దశలోనే ట్రంప్‌ రోజుకో మాట వదులుతూ వచ్చారు. ‘అబ్బే’ సంక్షోభం ఏమీ లేదు, కరోనా, ఫ్లూ లాంటిదే అని ఒకరోజు, ఆ మరునాడే ‘ఇది పెద్ద సంక్షోభమే సుమా, నాకెప్పటినుంచో తెలుసు’ అనీ, ‘మన వ్యాపకాలు మనం చూసుకుందాం, నేను ఏమైనా సరే రేపటి ఎన్నికలు గెలవాలి’ అనీ ట్రంప్‌ పేలుతూ వచ్చాడు. అందుకే చామ్‌స్కీ ‘ఇలాంటి బాపతు నాయకుల చేతుల్లో ప్రపంచం మనగలగడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని వ్యాఖ్యానించవలసి వచ్చింది. అంతేగాదు ఆయన ట్రంప్‌ని ‘బుద్ధిజాడ్య జనితోన్మాది, సంఘవిదూషకుడు’ (సైకోపతిక్‌ బఫూన్‌) అని విమర్శించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మానవాళిని ట్రంప్, అతని ‘ఛోటా’లూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నారనిపిస్తోందనీ, నేడు మనల్ని రెండు రకాల భీకర ప్రమాదాలు –అణ్వస్త్ర యుద్ధ ఛాయలు, అదుపుతప్పిన వాతావరణ కాలుష్యంతో మంటల కుంపటిగా మారుతున్న భూతలమూ వెంటాడుతున్నాయని హెచ్చరించారు. కరోనా వల్ల ప్రమాదాలను ఇవాళ కాకపోతే రేపైనా అదుపు చేసుకోగల అవకాశం ఉంది. కానీ, ఇతర ప్రమాదాల నుంచి కోలుకోవడం ఉండదు.

2019 అక్టోబర్‌ 18–27 మధ్య ఏం జరిగింది?!
ఈ తేదీల్లోనే వూహాన్‌(చైనా) నగరంలో ప్రపంచ దేశాల సైనిక విన్యాసాలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో వంద దేశాల నుంచి వచ్చిన సైనికులతోపాటు 300 మందికి పైగా అమెరికన్‌ సైనికులూ పాల్గొన్నారు. ఆ తర్వాత సరిగ్గా రెండు వారాలకే వూహాన్‌లో మొట్టమొదటి కోవిడ్‌–19 కరోనా మహమ్మారి వ్యాధి బయటపడింది. సరిగ్గా ఇది గమనించిన అమెరికా పోర్ట్‌ డెడ్రిక్‌ పట్టణంలోని తన సైనిక జీవాయుధ రక్షణ పరిశోధనశాలను కాస్తా అకస్మాత్తుగా మూసేసింది. 2019 అక్టోబర్‌ 18న జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ, బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో ఒక రహస్య సమావేశ ప్రదేశంలో.. కరోనా లాంటి మహమ్మారి వస్తే తీసుకోవలసిన జాగ్రత్తల పేరిట అదే తరహా వ్యాధి నమూనాతో ‘ఈవెంట్‌ 201’ ప్రయోగం నిర్వహించారు. ఈ రహస్య సమావేశంలో ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం అని బోర్డు పెట్టారని ‘ఇన్‌స్టాగ్రామ్‌’ పోస్ట్‌ ద్వారా తెలిపారు. ఈ రహస్య సమావేశ ప్రయోగ విన్యాసానికి ఏం పేరు తగిలించారో తెలుసా– ‘ప్రపంచానికి తుది ఘడియలు’ (నౌ ది ఎండ్‌ బిగిన్స్‌)!

బిల్‌గేట్స్‌ ఏర్పాటుచేసిన విలయ తాండవ రహస్య ప్రయోగంలో జిలుగు వెలుగుల కరోనా వైరస్‌ ఆటబొమ్మ సహాయంతో (ప్లష్‌ టాయ్‌) రాగల వినాశనాన్ని చూపాడు. అందులో కొద్ది మాసాల్లోనే ఎలా వేలకు వేలుగా ప్రజలు నేలకు ఒరిగిపోతారో చూపిస్తాడు. అందులో చెప్పిన భయకంపిత వాతావరణాన్ని ఇలా వర్ణిస్తాడు: రేపు మీరు చూడబోయే ‘నవ ప్రపంచ వ్యవస్థ’ ఎలాంటిదంటారు? సంతానప్రాప్తి వైజ్ఞానిక శాస్త్రం ఆధారంగా సంతానం లేకుండా చేసి, వంధ్యత్వాన్ని కల్గించి జనాభాను తగ్గించేయడం మైక్రోసాఫ్ట్‌ అధిపతి కోరిక అని ‘ఎన్‌టీఈబీ’ వెబ్‌సైట్‌ ప్రచారం. ఇలాంటి ప్రయోగాలకు అవసరమైన ఇంజెక్షన్లు రూపొందించడానికి బడా ఫార్మా కంపెనీలు, బిల్‌ గేట్స్‌ చేతులు కలుపుతున్నారని వార్త. ఈ రహస్య ప్రయోగశాలకు (ఈవెంట్‌ 201) అమెరికా గూఢచారి శాఖ మాజీ అధికారులు, వరల్డ్‌ బ్యాంక్, ఐఎంఎఫ్, ఫార్మా, పీఆర్‌ఓ సంస్థ ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ అమెరికా రహస్య ప్రయోగం సఫలమైతే ఆచరణలోకి వస్తే ఏకధాటిన 6 కోట్ల 50 లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని అంచనా. నిజానికి అమెరికా ‘లియోటాయిస్‌’ ఉన్మాదపు యుద్ధ పిపాసను పెంచే పరికరాలు, పిల్లలతో మతిభ్రమింపజేసే ఉన్మాదాన్ని పెంచే పరికరాలు ఇప్పటిదాకా ముక్కుపచ్చలారని పెక్కు మంది చిన్నారుల జీవితాలతో ఆటలాడుకుంటూ వస్తున్నవేనని మరవరాదు.

అసలెందుకీ కరోనా వైరస్‌ సంక్షోభం తలెత్తవలసి వచ్చిందన్న ప్రశ్నకు ప్రొఫెసర్‌ చామ్‌స్కీ సమాధానం వేరు: ‘ఈ సంక్షోభం మార్కెట్‌ పరిస్థితుల వైఫల్యం వల్ల బిళ్లదీటుగా విరుచుకుపడిన ఫలితం. మార్కెట్‌ శక్తుల వైఫల్యం అనేది నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలవల్ల అపరిష్కృతంగా పోగుబడి పేరుకుపోయిన సాంఘిక, ఆర్థిక సమస్యల పర్యవసానమని మరచిపోరాదు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రజా రోగ్య రక్షణకు మందులు, వ్యాక్సిన్లు అందవలసినచోట లాభార్జన ధ్యేయంగా ఎదిగే ప్రైవేట్‌ రంగం వైఫల్యం వల్ల సమస్యలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఉదారవాద ఆర్థిక వ్యవస్థవల్లనే నిరంకుశ పాలనా వ్యవస్థలు బతుకుతున్నాయని మరవరాదు’!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!

భూమ్మీద అదే అతి ప్రమాదకరమైన ప్రదేశం!
27 Apr, 2020

దాదాపు మిలియన్‌ సంవత్సరాల నుంచి మానవులు భూమిపై నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే లేవు. భూమిపై లోతైనా సముద్రాలు, పోడవైన నదులు, ఎతైనా పర్వతాలు వాటి పుర్వొత్తారాల గురించి అందరికి తెలుసు. కానీ మనం నివసించే ఈ భూమిపై ప్రమాదకరమైన ప్రదేశం కూడా ఉందన్న విషయం మీకు తెలుసా? ఆ ప్రదేశం ఎక్కడుంది..  ఎందుకు అది అంత భయంకరమైన ప్రదేశమైందో ఇంగ్లాండ్‌ పాలియోంటాలజిస్టు(శిలాజాల అధ్యయనం, భూమిపై జీవ పరిమాణం)  శాస్త్రవేత్తలు ఇటివల ఆధ్యయనం చేసి అధికారికంగా ప్రకటించారు. 

పోర్ట్స్‌మౌత్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాకు చెందిన ఏజ్ ఆఫ్ డైనోసార్ల శిలాజాలపై ఇటీవల పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలో 100 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలను వారు సమీక్షించగా  ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్‌ శిలల ప్రదేశాలలో పరిశోధనలు జరిపిన వారికి అక్కడ ఎగిరే సరీసృపాలు, మొసళ్లతో పాటు  భయంకరమైన మాంసాహార నీటి జంతువుల శిలాజాలను కనుగొన్నారు. ఈ ప్రదేశాన్ని కెమ్‌ కెమ్‌ గ్రూప్‌ అని కూడా పిలుస్తారని, ఇది భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఎండిన భూమిగా ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు విస్తృతమైన నదీ వ్యవస్థను కలిగి ఉండేదని కూడా వెల్లడించారు.

అంతేగాక ఈ నది వ్యవస్థ చుట్టూ వివిధ రకాల జల, భూసంబంధమైన జంతువులు నివసించేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక దీనిపై డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిజార్ ఇబ్రహీం పుస్తకం కూడా రచించించారు. దీని ప్రకారం ఈ ప్రదేశం కెమ్ కెమ్ గ్రూప్‌కు చెందినదని, ఇక్కడ అతిపెద్ద డైనోసార్లు నివసించేవని తెలిపారు. వాటితో పాటు సాబెర్-టూత్ కార్చరోడోంటోసారస్, టెరోసార్స్ వంటి భయంకరమైన మొసళ్లు, ఎగిరే సరిసృపాలు నీటి వేట జంతువులు నివసించేవని వెల్లడించారు. అంతేగాక ఇది ఒక గ్రహమని,  భూమిపై ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక ఇక్కడ మానవులు జీవించినప్పటికీ.. భయంకరమైన సరిసృపాల వేట వల్ల ఎక్కువ కాలం ఇక్కడ మనుగడ సాగించలేక పోయారని కూడా చెప్పారు.

వందేళ్ల క్రితం ఏం జరిగింది..?

వందేళ్ల క్రితం ఏం జరిగింది..?
27 Apr, 2020 01:30 IST|Sakshi


స్పానిష్‌ వైరస్‌తో కరోనాను పోల్చి ఔననే అంటున్న వైద్య నిపుణులు
వందేళ్ల క్రితం అల్లకల్లోలం సృష్టించిన ఇన్‌ఫ్లూయెంజా
తొలి విడత సాధారణం.. రెండోసారి మాత్రం భయానకం
అవగాహన రావడంతో మూడోసారి తప్పిన ముప్పు
కరోనా కూడా రెండోసారి వస్తే ఏం జరుగుతుందోనని ఆందోళన
రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే ప్రభావం ఉండదంటున్న వైద్యులు

1918 మార్చి.. స్పానిష్‌ వైరస్‌ దాదాపు 20 లక్షల మందిని బలి తీసుకుంది.. ఆరు నెలల తర్వాత ఏకంగా 4 కోట్ల మందిని చంపేసింది. మరో ఆరు నెలల తర్వాత 60 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ లెక్కలకు పక్కాగా రికార్డులు లేనప్పటికీ, అంతర్జాతీయ అధ్యయనాలు కాస్త అటూ ఇటుగా తేల్చిన అంకెలివి. మన దేశంలో మొత్తం కోటిన్నర మంది చనిపోతే, అందులో రెండో విడత సమయంలో కోటి మంది బలయ్యారట. ఆ సమయంలో జరిగిన మొదటి ప్రపంచయుద్ధం దాదాపు 2 కోట్ల మందిని బలితీసుకుంటే మూడు విడతల్లో విరుచుకుపడ్డ వైరస్‌ అంతకు రెండు రెట్ల కంటే ఎక్కువ మందిని అంతం చేసింది. విడతలవారీగా విరుచుకుపడితే వైరస్‌ చూపే మారణహోమం ఇలా ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా (కోవిడ్‌–19) కూడా ఇలాగే రెండోసారి విరుచుకుపడితే ఏమవుతుందో అని జనాలు భయపడుతున్నారు. అయితే, అప్పుడు వైరస్‌ కట్టడిలో ప్రజలకు అవగాహన అతి తక్కువని, ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున అంతగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 



ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ దూకుడు ప్రస్తుతం కొంచెం తగ్గినట్టు కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే సమయం బాగా పెరిగింది. క్రమంగా వైరస్‌ ప్రభావం తగ్గి మరో నెల రోజుల్లో పరిస్థితి మామూలుగా మారే అవకాశం ఉందనేది ఎక్కువ మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే, నిజంగా వైరస్‌ దూకుడు తగ్గినట్టేనా..? అంటే కచ్చితంగా చెప్పలేప్పటికీ ప్రభావం మాత్రం తగ్గుతోందని స్పష్టమవుతోంది. మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి రెండోసారి కూడా విరుచుకుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్‌ రెండో వేవ్‌ రాదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా పేర్కొంది. అయితే, దీని గురించి అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని, శరీరంలో రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకుంటే రెండో వేవ్‌లో కరోనా ప్రభావం తక్కువే ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వందేళ్ల క్రితం ఏం జరిగింది..?
వందేళ్ల క్రితం విరుచుకుపడ్డ స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెంజా దాదాపు మూడున్నర కోట్ల మందిని బలితీసుకుందని అంచనా. 1918లో పంజా విసిరిన ఈ మహమ్మారి మూడు విడతలుగా విరుచుకుపడింది. ఇందులో రెండో దఫా కనీవినీ ఎరుగని రీతిలో మారణకాండను సృష్టించింది. ఈ వైరస్‌ తొలుత స్పెయిన్‌లో వెలుగు చూడటంతో దానికి స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెంజా అని పేరు పెట్టారు. అయితే, ఆ వైరస్‌ ముందు అమెరికాలో పుట్టిందని బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. 1918 మార్చి ప్రారంభంలో అమెరికాలోని కెన్సాస్‌లో ఈ వైరస్‌ పురుడు పోసుకుందని అది వివరించింది. అక్కడి నుంచి మొదటి ప్రపంచయుద్ధం కోసం పశ్చిమ యూరప్‌కు వెళ్లిన అమెరికా సైనికులతో ఆ వైరస్‌ యూరప్‌లోకి చేరింది. జూలైలో పోలండ్‌కు పాకింది. ఇది మొదటి వేవ్‌. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాణనష్టం చాలా తక్కువగా నమోదైంది. దీన్ని గుర్తించేసరికే ఆ తొలి విడత అంతమైంది. చదవండి: జలదృశ్యం నుంచి సుజల దృశ్యం దాకా..


రెండో విడతలో విధ్వంసం
స్పానిష్‌ వైరస్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది రెండో వేవ్‌లోనే. తొలి విడత అంతమైన తర్వాత కొన్ని నెలలకే అది మళ్లీ విరుచుకుపడింది. అమెరికాలోని కెన్సాస్‌ ప్రాంతంలో మళ్లీ ఉనికి కనిపించిన తర్వాత ఆరు రోజుల్లోనే ఏకంగా 6650 మంది పాజిటివ్‌గా తేలారు. చూస్తుండగానే ఒక్క అమెరికాలోనే ఆరు లక్షల మంది చనిపోయారు. మొదటి విడతలో ఎక్కువగా వృద్దులు దీనిబారిన పడగా.. రెండో విడతలో మధ్య వయస్సువారు ఎక్కువగా ప్రభావితులయ్యారు. భారత్‌లో 1918 మేలో తొలిసారి ఆ వైరస్‌ కనిపించి కొద్ది రోజులే ప్రభావం చూపింది. కానీ అక్టోబర్‌లో అది విరుచుకుపడింది. నవంబర్‌లో ఉత్తరభారతమంతా వ్యాపించింది. డిసెంబర్‌ నాటికి బెంగాల్‌ను శవాలగుట్టగా మార్చేంది. మన దేశంలో దాదాపు కోటి మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఈ వైరస్‌ తగ్గుముఖం పట్టింది.

మళ్లీ 2019 ఏప్రిల్‌లో మూడోసారి వెలుగు చూసింది. మొదటి విడత ప్రభావం పెద్దగా లేకపోయేసరికి జనం మేల్కొనలేదు. రెండోసారి విరుచుకుపడేసరికి సన్నద్ధంగా లేకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నారు. రెండోసారి తీవ్ర ప్రభావం చూపటంతో భౌతికదూరం విధానానికి శ్రీకారం చుట్టారు. మూడోవిడత వచ్చే సరికి ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో ప్రభావం కొంతే కనిపించింది. ప్రస్తుతం ఈ వైరస్‌తో కరోనాను పోల్చి చూస్తున్నందున, ఇది కూడా రెండోవిడత విరుచుకుపడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, దక్షిణ కొరియాల్లో మళ్లీ అది తిరగబెట్టిన దాఖలాలు ఉండటంతో పలువురు రెండో వేవ్‌ గురించి ఆందోళన చెందుతున్నారు.

అలవాట్లలో మార్పులు అవసరం
‘వైరస్‌లు ఒకసారితో వెళ్లిపోవటం లేదు. స్పానిష్‌ ఇన్‌ఫ్లూయెంజా తరహాలో కరోనా కూడా మళ్లీ విరుచుకుపడొచ్చు. అది ఎప్పుడో చెప్పలేం. ఈలోపు వ్యాక్సిన్‌ సిద్ధమైతే ఇబ్బంది ఉండదు. కానీ, కొన్ని సందర్భాల్లో వైరస్‌ రెండోసారి రూపు మార్చుకుని రావచ్చు. అప్పుడు ఈ వ్యాక్సిన్‌ అంతగా పనిచేయదు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. భౌతికదూరం, మాస్కుల వాడకం, తరచూ చేతులు కడుక్కోవటం వంటి అలవాట్లను జీవితంలో భాగం చేసుకోవాలి. తొందరలో మందులు అందుబాటులోకి రావచ్చు. దీంతో బాధితులకు ప్రాణహాని తప్పుతుంది. కానీ వైరస్‌ సోకకుండా ఉండాలంటే మన అలవాట్లలో చాలా మార్పులు అవసరం’
డాక్టర్‌ రాజారెడ్డి, సీనియర్‌ సర్జన్‌

రోగనిరోధక శక్తిని పటిష్టం చేసుకుంటే చాలు
‘కరోనాకు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందో తెలియదు. అల్లోపతి మందులు ఎప్పుడు సిద్ధమవుతాయో చెప్పలేం. అవి లేవు కదా అని వైరస్‌ చూస్తూ ఊరుకోదు. రెండో విడత రావాలంటే విరుచుకుపడే తీరుతుంది. అలా అని మనం భయపడుతూ కూర్చుంటే ఫలితం ఉండదు. ప్రతి ఒక్కరు తమ రోగనిరోధక శక్తిని తగిన విధంగా మార్చుకోగలగాలి. మనకు అందుబాటులో ఉండే.. పసుపు, లవంగాలు, దాల్చిని, గ్రీన్‌ టీ, శొంఠి, మెంతికూర, వెల్లుల్లి, దబ్బకాయి, ఉల్లి, ఉసిరి, నల్ల ద్రాక్ష వంటి వాటితోపాటు మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. దీంతోపాటు వావిలి, నేలవాములాంటి వాటితో రూపొందిన మందులు కూడా ఉపయోగపడతాయి’
- డాక్టర్‌ సునీల్, ఇంటిగ్రేటివ్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌

Tuesday, April 28, 2020

రాకాసి మిడతలు.. ముంచుకొస్తున్న ముప్పు!

రాకాసి మిడతలు.. ముంచుకొస్తున్న ముప్పు!
28 Apr, 2020

భారత్‌కూ పొంచి ఉన్న ముప్పు

పులి మీద పుట్రలా కరోనా మహమ్మారికి తోడు మరో ఉపద్రవం ముంచుకువస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలపై ఈ వేసవిలో మరో పిడుగు పడబోతోందా? లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై రాకాసి మిడతల దండు ఒకటి, రెండు నెలల్లో విరుచుకుపడి ఆహార భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే పెను ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) నిపుణులు. ఇప్పటికే ఆహార కొరత, కరోనా మహమ్మారితో సతమతమవుతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లో గత పాతికేళ్లలో ఎన్నడూ ఎరుగనంత భీకరంగా రాకాసి మిడతల దండు ఇప్పుడు విలయాన్ని సృష్టిస్తోంది.

కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించడంతో ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు మన దేశంలోనూ లక్షలాది ఎకరాల్లో నోటికాడికి వచ్చిన పంటలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు నాశనమయ్యాయి. అప్పట్లో కొద్ది రోజుల్లోనే సమసిపోయిన ఈ సమస్య తూర్పు ఆఫ్రికా దేశాలను కొద్ది నెలల్లోనే భీకర రూపం దాల్చి మళ్లీ చుట్టుముట్టింది.

రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో అంతకు ముందుకన్నా 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు విజృంభిస్తున్నది. ఇలాగే ఉంటే వచ్చే జూన్‌ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని, సుమారు 60 దేశాలకు నష్టం చేకూర్చవచ్చని ఎఫ్‌.ఎ.ఓ. నిపుణుల అంచనా. అయితే, కరోనా మహమ్మారి లాక్‌డౌన్‌ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేకపోతున్నాయి. ఫలితంగా ఇథియోపియాలో లక్షల హెక్టార్లలో టెఫ్‌ అనే చిరుధాన్యం, ఉల్లి పంటలు ఇప్పటికే పూర్తిగా నాశనం అయ్యాయి. మిడతల దండును అరికట్ట లేని పరిస్థితుల్లో రానున్న ఒకటి, రెండు నెలల్లో అనేక ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు పెనునష్టం జరగనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్‌ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ చుట్టుముట్టి పంటలకు నష్టం కలిగించే ముప్పు పొంచి ఉందని తాజా నివేదికలో ఎఫ్‌.ఎ.ఓ. హెచ్చరించింది.  – పంతంగి రాంబాబు, సాగుబడి

భారత్‌కు రెండు వైపుల నుంచి ముప్పు
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన మిడతల దండు రెండు వలస దారుల్లో భారత్‌పై దాడి చేసే అవకాశం ఉంది. ఎమెన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ భూభాగం మీదుగా భారత్‌లోని పంజాబ్, హర్యానాల్లో పంట పొలాలపై మే, జూన్‌ మాసాల్లో మిడతల దండు దాడి చేసే ప్రమాదం ఉందని ఎఫ్‌.ఎ.ఓ. హెచ్చరిస్తోంది. అదేవిధంగా, ఇథియోపియా, సోమాలియా దేశాల నుంచి హిందూ మహా సముద్రం మీదుగా దక్షిణ భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్‌ సహా తూర్పు, పశ్చిమ తీరంలోని వివిధ రాష్ట్రాల్లో మిడతల దండు దాడి చేసి పంటలను తీవ్రంగా నష్టపరిచే అవకాశం ఉందని ఎఫ్‌.ఎ.ఓ. తాజా నివేదికలో హెచ్చరించింది. ఎడారి మిడతలు.. 8 తూర్పు ఆఫ్రికా దేశాల్లో (కెన్యా, ఇథియోపియా, సోమాలియా, జిబౌటి, ఉగాండ, టాంజానియా, సూడాన్, ఎరిట్రియ) పంటలు, మొక్కలు, చెట్లకు పెనుముప్పుగా పరిణమించాయి. ఇథియోపియా, సోమాలియాలలో గత పాతికేళ్లుగా ఎన్నడూ లేనంత ఎక్కువగా ఆహార, ఆదాయ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారాయి. కెన్యా.. 70 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువగా మిడతల బెడదను ఎదుర్కొంటున్నది.

10 లక్షల హెక్టార్లలో గుడ్లు
కరువు కాటకాలతో నిరంతరం అల్లాడే ఈ తూర్పు ఆఫ్రికా దేశాల్లో గతేడాది అక్టోబర్‌లో భారీ వర్షాల తర్వాత ఎడారి మిడతలు గుడ్లు పెట్టి సంతతిని తామరతంపరగా వృద్ధి చెయ్యటం మొదలు పెట్టాయి. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. ఇది నూర్పిడి సీజన్‌ కావడంతో రైతులు అల్లాడుతున్నారు. ఆహార , ఆదాయ భద్రతకు ముప్పు వచ్చిపడింది. 

మూక శక్తితోనే విధ్వంసం
ఎడారి మిడత ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటుంది. అప్పుడు పంటలకు వీటి వల్ల బెడద ఉండదు. కానీ, ఎక్కువ సంఖ్యలో ఒక చోట చేరినప్పుడు విధ్వంసకర మూక శక్తిగా ప్రవర్తిస్తాయి. మిడతల దండు ప్రవర్తనలోనే కాదు.. వాటి రంగు, రూపంలో కూడా మార్పులు వస్తాయి.

రోజూ తనంత తిండి!
మిడత రోజూ తన బరువుతో సమానమైనంత ఆకులు, అలములు, గింజలు ఆహారంగా తింటుంది. మిడతల దండు అనేక కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండవచ్చు. ఒక చదరపు కిలోమీటరు విస్తరించి ఉండే మిడతల దండులో 4–5 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. ఇవి ఒక్క రోజులో 35 వేల మంది మనుషులు తినేంత ఆహారాన్ని తినేస్తాయి. ఈ దండు నేల వాలిందంటే ఆయా ప్రాంతాల్లో పంటలు, గడ్డి, ఆకులు పచ్చదనం అంతా ఇట్టే ఖాళీ అయిపోతుంది. ఆహార పంటలతోపాటు పచ్చిక బయళ్లను కూడా మిడతల దండు ఆరగించేస్తుంది. అడవులకూ బెడద పొంచి ఉంది.

జీవన కాలం 3 నెలలు
ఎడారి మిడత జీవిత కాలం సాధారణంగా 3 నెలలు. అయితే, చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తుంది. ఎడారి ప్రాంతాల్లో సైతం నెలకు 2.5 ఎం.ఎం. వర్షపాతం వరుసగా రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి వృద్ధికి సరిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను గంపగుత్తగా పెడుతుంది. చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్ల లో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకొని ఎగర గలుగుతాయి. ఆ దశలో మిడతల దండులో చేరుతుంది. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండిన తర్వాత మిడత గుడ్లు పెడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే గుడ్లు పెట్టిన తర్వాత చనిపోతుంది.

అడ్డుకునేదెలా?
వాతావరణ మార్పుల నేపథ్యంలో అకాల వర్షాలతో ఏర్పడే అనువైన వాతావరణమే మిడతల దండు విజృంభించడానికి కారణమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప అరికట్టేందుకు మరో మార్గమేదీ లేదంటున్నారు.  ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్ల తోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. అయితే, శిలీంధ్రం వృద్ధి చెంది మిడతలను మట్టుబెట్టడానికి 7 నుంచి 14 రోజుల వ్యవధి అవసరం అవుతుంది. చెద పురుగులు, స్కరబ్‌ బీటిల్స్‌పై ఈ శిలీంధ్రం ప్రతికూల ప్రభావం చూపుతున్నదని అంటున్నారు

Saturday, April 25, 2020

బంకర్లలోకి బిలియనీర్స్‌

కరోనా: బంకర్లలోకి బిలియనీర్స్‌
21 Apr, 2020

ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ బారిన పడకుండా తప్పించుకునేందుకు అమెరికాలోని శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌ వెళ్లిపోయి అక్కడి తమ విలాసవంతమైన బంకర్ల (నేల మాళిగలు)లో తలదాచుకుంటున్నారు. వారిలో సిలికాన్‌ వ్యాలీకి చెందిన శతకోటీశ్వరులు కూడా ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక రోజు ప్రపంచ ప్రళయం (డూమ్స్‌ డే) వచ్చి అందరూ చనిపోతారని నమ్మే కొంత మంది శతకోటీశ్వరులు న్యూజిలాండ్‌లో అత్యంత ఖరీదు చేసే విలాసవంతమైన బంకర్లను ఎన్నడో కొని పెట్టుకున్నారని ‘డెయిలీ మెయిల్‌’ వెల్లడించింది.

వారిలో ‘పేపాల్‌’ వ్యవస్థాపకుడు, ఫేస్‌బుక్‌ శతకోటీశ్వరుడు పీటర్‌ తియాల్, టెక్సాస్‌లోని బ్లూబెర్గ్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ గేరీ లించ్‌ కూడా ఉన్నారు. పీటర్‌ తియాల్‌ న్యూజిలాండ్‌లోని అందమైన క్వీన్స్‌టౌన్‌లో మల్టీపర్సన్‌ భవనాన్ని కొనుగోలు చేశారు. అంటే భూమిపైన మామూలుగా కనిపించే ఆ భవనంలోనే అవసరమైనప్పుడు తలదాచుకునేందుకు ‘ప్యానిక్‌ రూమ్‌’ ఒకటి ఉంది. దాన్ని ఆయన 4.7 మిలియన్‌ డాలర్లు (దాదాపు 35.15 కోట్ల రూపాయలు) పెట్టి కొనుగోలు చేసినట్లు తెల్సింది. ఇప్పుడాయన అక్కడికి వెళ్లారో, లేదో తెలియడం లేదు. అయితే గేరీ లించ్‌ లాంటి శతకోటీశ్వరులు ప్రాణాంతకమైన కరోనా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందంటూ వార్తలు వెలువడిన తొలుతలోనే అమెరికా నుంచి విమానాలు పట్టుకొని న్యూజిలాండ్‌ వెళ్లారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త మిహాయి దినులెస్కూ తన భార్యతో కలిసి మార్చి 12వ తేదీన న్యూజిలాండ్‌ వెళ్లారు.

రైజింగ్‌ ఎస్‌ కంపెనీ న్యూజిలాండ్‌లో ఇలాంటి బంకర్లను కొన్నింటిని ఇప్పటికే నిర్మించగా మరికొన్నింటిని నిర్మిస్తోంది. వాటిని మూడు మిలియన్‌ డాలర్ల నుంచి ఎనిమిది మిలియన్‌ డాలర్ల వరకు విక్రయిస్తోంది. వాటిలో 22 మంది నిద్రించే అవకాశం ఉన్న మూడు మాస్టర్‌ బెడ్‌ రూమ్‌లు, లివింగ్‌ రూమ్, డైనింగ్‌ హాల్, కిచెన్‌తోపాటు ఓ ఫిట్‌నెస్‌ సెంటర్, స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్న బంకర్లు కూడా ఉన్నాయి. కొన్ని బంకర్లు కూడా భూమిలోపల రెండు, మూడు అంతస్తులుగా ఉన్నాయి. వాటన్నింటికి కావాల్సిన ఆక్సిజన్, విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిల్లో కొందరు శతకోటీశ్వరులు ఏడాది పాటు కొదవ లేకుండా తినుపదార్థాలను నిలువ చేసుకున్నారు.